గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.
అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.
స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.
ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్‌లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్‌లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్‌బీఐ (SBI) ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్‌లతో సహా ఐదు స్టాక్‌లు మాత్రమే దిగువన ట్రేడింగ్‌లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్‌బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment