మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.
టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.92 శాతం దిగజారింది.
ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్‌మార్కెట్లు పని చేస్తాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment