దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ50 వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 720.60 పాయింట్లు లేదా 0.90 శాతం క్షీణించి 79,223.11 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 80,072.99 నుండి 79,147.32 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
ఇక నిఫ్టీ50 183.90 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 24,004.75 వద్ద రెడ్‌లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,196.45 వద్ద, కనిష్ట స్థాయి 23,978.15 వద్ద నమోదైంది.
నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 32 రెడ్‌లో ముగిశాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ముగిసిన 18 స్టాక్‌లలో ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
Published Fri, Jan 3 2025 3:54 PM | Last Updated on Fri, Jan 3 2025 3:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment