దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారాంతపు ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 226 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 78,699.07 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 79,043.15 - 78,598.55 రేంజ్‌లో ట్రేడయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 ( NSE Nifty 50 ) 63 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,813.40 వద్ద గ్రీన్‌లో స్థిరపడింది. నిఫ్టీ ఈరోజు గరిష్ట స్థాయి 23,938.85 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,800.60 వద్ద ఉంది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో 2.51 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 29 గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ 1.81 శాతం వరకు నష్టాలు మూటకట్టుకుని నష్టాలతో ముగిసిన 21 స్టాక్‌లలో ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 124 పాయింట్లు లాభపడి 23,877కు చేరింది. సెన్సెక్స్(Sensex) 397 పాయింట్లు పుంజుకుని 78,891 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 71.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.15 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.02 శాతం దిగజారింది.
ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో యూఎస్‌లో మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 31తో అమెరికాలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment