దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్‌డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.
కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment