దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 24,064కు చేరింది. సెన్సెక్స్ 501 పాయింట్లు దిగజారి 79,454 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 109.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.16 శాతం దిగజారింది.
బలహీన డిమాండ్‌కు భిన్నంగా డిసెంబర్‌లో అంచనాలకు మించి వాహన విక్రయాలు జరడంతో ఆటో రంగ షేర్లు నిన్నటి మార్కెట్ సెషన్‌లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్‌ఎస్‌ఏ, సిటీ డిసెంబర్ క్వార్టర్‌తో పాటు 2025 ఏడాది మొత్తంగా ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి బలంగా ఉండొచ్చనే తాజాగా అంచనా వేశాయి. ఫలితంగా ఈ రంగంలోని షేర్లు రాణించాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఉంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment