
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,497 వద్దకు చేరింది. సెన్సెక్స్ 12 పాయింట్లు దిగజారి 74,102 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడి క్రమంగా పంజుకుంటున్న మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పతనమయ్యాయి.
సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టైటాన్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, నెస్లే, ఎస్‌బీఐ, టాటా మోటార్స్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం, జొమాటో, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండడంతో భారత మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌ల వాల్యుయేషన్ ఆందోళనల వల్ల ఆయా సెగ్మెంట్లు తీవ్ర దిద్దుబాట్లకు లోనయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment