
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి ముగింపుతో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్ పెరిగి 22,484కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 74,124 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.59 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.49 శాతం పెరిగింది. నాస్‌డాక్ 1.22 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు..
అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో నిన్నటి మార్కెట్ సెషన్‌లో ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య సుంకాల అనిశ్చితి కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జులై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment