
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు ఎగబాకి 22,378కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పెరిగి 73,856 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.46 శాతం ఎగబాకింది.
బుల్.. బౌన్స్‌బ్యాక్!
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నెలకొన్న ట్రెండ్‌కు పూర్తి విరుద్ధంగా ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు తెరతీశారు. దీంతో మార్కెట్ సూచీలు పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై వెనక్కి తగ్గవచ్చన్న అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. సానుకూల ప్రపంచ మార్కెట్లు, ఫిబ్రవరిలో పుంజుకున్న సేవల రంగం, షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఇందుకు సహకరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
రూపాయి.. జోరు!
మార్కెట్ల దన్నుతో దేశీ కరెన్సీ సైతం బలపడింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు పుంజుకుంది. 87.06 వద్ద నిలిచింది. డాలరుతోపాటు ముడిచమురు ధరలు బలహీనపడటం రూపాయికి దన్నునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా తదితర దేశాలు సైతం సుంకాల విధింపునకు తెరతీయడంతో డాలరు వెనకడుగు వేసినట్లు తెలిపారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment