
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు ఎగబాకి 22,5001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు పెరిగి 74,183 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.75 శాతం దిగజారింది. నాస్‌డాక్ 0.18 శాతం నష్టపోయింది.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలపై వివిధ దేశాలు ప్రతికార సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం సహా ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు కీలకంగా మారుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతుండటం భారతీయ ఈక్విటీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫిబ్రవరి నెలకు భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు.
ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment