
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 273 పాయింట్లు దిగజారి 22,273కు చేరింది. సెన్సెక్స్(Sensex) 908 పాయింట్లు తగ్గి 73,704 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.35 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.23 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.59 శాతం తగ్గింది. నాస్‌డాక్ 2.78 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Comments
Please login to add a commentAdd a comment