దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు నష్టపోయి 22,993కు చేరింది. సెన్సెక్స్(Sensex) 305 పాయింట్లు దిగజారి 75,905 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 107.74 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.29 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.5 శాతం దిగజారింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
శనివారం ట్రేడింగ్
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్‌ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment