వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే! | Rich Dad Poor Dad Robert Kiyosaki tweet silver will | Sakshi
Sakshi News home page

వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!

Dec 25 2025 1:30 PM | Updated on Dec 25 2025 1:48 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki tweet silver will

ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్‌కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్‌లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్‌పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్‌ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్‌’లో తనదైన శైలిలో స్పందించారు.

‘వెండి 70 డాలర్లు దాటింది.
బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.
ఫేక్‌ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌’ అంటూ పోస్టును ‍‍ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.

‘న‍ష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్‌ డాలర్‌ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్‌ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం.

 

Advertisement
 
Advertisement
Advertisement