దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:11 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 25,907కు చేరింది. సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 84,817 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్పల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం, నాస్‌డాక్ 0.36 శాతం నష్టపోయాయి.
ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ గురువారం (22న) నిఫ్టీ సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ.342 కోట్లు సమీకరించనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (24న) స్టాక్ లిస్ట్ కానున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment