
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు నష్టపోయి 22,918కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు దిగజారి 75,919 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.41 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందే
ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు. ‘ఎఫ్‌ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది’ అని తెలిపారు. ఎఫ్‌ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ.1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ.లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాది స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment