
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాంతో సూచీలు వరుసగా తొమ్మిది సెషన్‌లుగా నష్టాల్లో ట్రేడవుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 22,835కు చేరింది. సెన్సెక్స్(Sensex) 309 పాయింట్లు దిగజారి 75,621 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.41 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..
డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment