దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల కొనుగోలుతో పాటు, రిలయన్స్ ఇండిస్ట్రీస్ 44వ యాన్యువల్ జనరల్ మీటింగ్ మార్కెట్‌పై అనుకూల ప్రభావం పడింది. ఐపీఓ తర్వాత తొలిసారి రిలయన్స్ నిర్వహిస్తున్న మీటింగ్‌లో కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఏం చెబుతారా' అని షేర్ హోల్డర్లు ఆసక్తిగా ఎదురు చూస్తుడడంతో 9.24గంటల సమయానికి మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 52,472 వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 36 పాయింట్లతో 15,722 కొనసాగుతుంది.
ఐటీ స్టాక్స్ జోరు
సెన్సెక్స్ సూచీల‍్లో ఐటీ స‍్టాక్స్ జోరందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా తో పాటు ఎల్ అండ్ టీ, యాక్సిక్ బ్యాంక్, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూస్టీల్ స్టాక్ ప్రైస్ 1.34శాతం పెరిగింది. జాతీయస్థాయిలో పలు ఆటో మొబైల్ సంస్థలు వాహనాల ధరల్ని పెంచడంతో వాటి ప్రభావం మార్కెట్‌పై ప్రభావం చూపి 0.6శాతం తగ్గింది.హీరో మోటర్ కార్ప్,టాటా మోటార్స్ నష్టపోయాయి.
చదవండి: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Comments
Please login to add a commentAdd a comment