ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం,అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్‌లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 59138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17629 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
హిందాల్కో,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఐసీఐసీఐ బ్యాంక్,అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెసీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అథేర్ మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment