పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్‌జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్‌లో ఓవర్‌నైట్ ట్రేడ్‌లో మిక్స్‌డ్ ఫలితాలు వెలువరించాయి.
దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్‌లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు.
బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్‌యూఎస్,ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్‌బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment