Sensex BSE
-
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్‌జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్లో ఓవర్‌నైట్ ట్రేడ్‌లో మిక్స్డ్ ఫలితాలు వెలువరించాయి. దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్‌యూఎస్,ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
సూచీలకు మాంద్యం భయం
ముంబై: ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ స్టాక్ సూచీల రెండురోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించారు. ఆటో, విద్యుత్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 17,108 వద్ద నిలిచింది. అయితే ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ రంగ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్ 60,716 వద్ద కనిష్టాన్ని, 61,032 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 18,064 – 18,155 పరిధిలో కదలాడింది. అమెరికా తయారీ రంగ, రిటైల్ అమ్మకాలు మెప్పించకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఏషియన్ పెయింట్స్ షేరు 3% నష్టపోయి రూ.2,868 వద్ద స్థిరపడింది. ► ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ప్రకటన తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. బీఎస్ఈలో నాలుగుశాతం క్షీణించి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.3462 వద్ద స్థిరపడింది. ►బలమైన ఆదాయాల వృద్ధి నమోదు ఆశలతో ఓఎన్జీసీ షేరు రెండు శాతం పెరిగి ఆరు నెలల గరిష్టం రూ.152 వద్ద స్థిరపడింది. -
స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండే
-
మార్కెట్లలో బ్లాక్‌మండే
-
నేడు తొలుత మార్కెట్ల వెనకడుగు?!
నేడు (20న) దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 11,855 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,897 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. నిరుద్యోగులు, చిన్న సంస్థలకు అండగా ప్రతిపాదిస్తున్న సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో నష్టపోయాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం నేలచూపులతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రెండు రోజులుగా దేశీ మార్కెట్లు జోరందుకున్న సంగతి తెలిసిందే. సెన్సెక్స్ హైజంప్ సోమవారం మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్క్ ఎగువనే కదిలింది. చివరికి 449 పాయింట్లు జమ చేసుకుని 40,432 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు జంప్‌చేసి 11,873 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,519 వద్ద, నిఫ్టీ 11,898 వద్ద గరిష్టాలను తాకాయి. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,830 పాయింట్ల వద్ద, తదుపరి 11,786 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,907 పాయింట్ల వద్ద, ఆపై 11,942 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,907 పాయింట్ల వద్ద, తదుపరి 23,548 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,474 పాయింట్ల వద్ద, తదుపరి 24,680 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ట్రిపుల్ సెంచరీతో షురూ- నిఫ్టీ సెంచరీ
వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్‌చేసి 38,083కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు ఎగసి 11,255 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనుండటం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. లాభాలతో ఎన్ఎస్ఈలో అన్ని ప్రధాన రంగాలూ సగటున 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్ స్వల్పంగా 0.15 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, విప్రో, ఇన్ఫోసిస్, జీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, ఐషర్, ఎల్అండ్టీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్టెల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్ 2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎఫ్‌అండ్‌వో ఇలా డెరివేటివ్ కౌంటర్లలో నౌకరీ, ఇండిగో, మైండ్‌ట్రీ, హావెల్స్, కోఫోర్జ్, గ్లెన్‌మార్క్, బీఈఎల్, అశోక్ లేలాండ్ 3.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా 3.4 శాతం పతనంకాగా.. పెట్రోనెట్, బీవోబీ, భారత్ ఫోర్జ్, అంబుజా, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్ 0.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-1.4 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,189 లాభపడగా.. 375 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
3 వారాల గరిష్టం సెన్సెక్స్‌కు 184 ప్లస్
వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. తొలి నుంచీ లాభాలతో కదిలిన సెన్సెక్స్ 184 పాయింట్లు ఎగసింది. 26,103 వద్ద ముగిసింది. తద్వారా జూలై 30 తరువాత మళ్లీ 26,000 పాయింట్లను అధిగమించింది. వెరసి నాలుగు రోజుల్లో 774 పాయింట్లను జమ చేసుకుంది. ఇక నిఫ్టీ కూడా 52 పాయింట్లు పుంజుకుని 7,792 వద్ద స్థిరపడింది. ఇది మూడు వారాల గరిష్టంకాగా, బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, పవర్, ఆయిల్ రంగాలు 1.5% స్థాయిలో బలపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు పుంజుకోవడానికి షార్ట్ కవరింగ్ కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగాదేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. బుధవారం రూ. 718 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు గురువారం మరో రూ. 625 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నేడు మార్కెట్లకు సెలవు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, కమోడిటీ హోల్‌సేల్, ఫ్యూచర్స్‌తోపాటు బులియన్, మెటల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.