జీడీపీ జోష్‌- మార్కెట్లు గెలాప్‌ | GDP josh- Sensex jumps 500 points | Sakshi
Sakshi News home page

జీడీపీ జోష్‌- మార్కెట్లు గెలాప్‌

Published Tue, Dec 1 2020 3:54 PM | Last Updated on Tue, Dec 1 2020 4:14 PM

GDP josh- Sensex jumps 500 points - Sakshi

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 నేపథ్యంలోనూ జులై- సెప్టెంబర్‌లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 506 పాయింట్లు జంప్‌చేసి 44,655 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140 పాయింట్లు ఎగసి 13,109 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,730ను అధిగమించగా, నిఫ్టీ 13,128 పాయింట్లను దాటింది. చదవండి: (సిమెంట్‌ షేర్లు.. భలే స్ట్రాంగ్‌)

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఫార్మా, మెటల్ 3.3-1.7 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ యథాతథంగా నిలిచింది. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ, జేస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీసిమెంట్  8-2.3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. నెస్లే, కొటక్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌ 2.6-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్‌, టాటా పవర్‌, అదానీ ఎంటర్‌, కెనరా బ్యాంక్‌, మదర్‌సన్‌, యూబీఎల్‌, భెల్‌, బీవోబీ, ఫెడరల్ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌ 6.7-4.3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోపక్క శ్రీరామ్‌ ట్రాన్స్‌, చోళమండలం, మణప్పురం, ఐజీఎల్‌, అమరరాజా, నౌకరీ, ఎస్కార్ట్స్‌, జీఎంఆర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, కమిన్స్‌ 4.3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 973 మాత్రమే నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్‌ నెలలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం విశేషం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement