ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే
ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ప్రాధాన్యం
భౌగోళిక అనిశ్చితుల ప్రభావం
దేశీ స్టాక్ మార్కెట్ల తీరుపై విశ్లేషకుల అంచనాలు
ముంబై: ప్రపంచ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు తదితర అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్ 2న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆటోరంగ అమ్మకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు.
ఇవికాకుండా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశి్చతులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. త్రైమాసికవారీగా కంపెనీలు వెల్లడించే తాజా వార్తలు వివిధ కౌంటర్లలో యాక్టివిటీకి కారణంకానున్నట్లు తెలియజేశారు. బ్లూచిప్ కంపెనీలలో నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్లను మరింత ముందుకు నడిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.
దేశీ గణాంకాలు
ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే తయారీ, సరీ్వసుల రంగాలకు చెందిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పీఎంఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరును ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా వివరించారు. అయితే దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ పరిణామాలే మార్కెట్లకు కీలకంకానున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. కాగా.. ఇకపై రెండో త్రైమాసిక(జులై–సెపె్టంబర్) కార్పొరేట్ ఫలితాలవైపు ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. ఇన్వెస్టర్లలో కంపెనీల లాభార్జన మెరుగుపడనున్న అంచనాలున్నట్లు తెలియజేశారు.
విదేశీ అంశాలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 0.5 శాతం వడ్డీ రేటు తగ్గింపు కారణంగా గత వారం మార్కెట్లు బలపడ్డాయి. ఆర్థిక గణాంకాలలో స్థిరత్వం, విదేశీ పెట్టుబడులు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు నాయిర్ వివరించారు. చైనా ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటన సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచి్చనట్లు పేర్కొన్నారు. ఇది ఆసియా మార్కెట్లలో మరిన్ని పెట్టుబడులకు దారి చూపవచ్చని అంచనా వేశారు. కమోడిటీల ధరలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, కీలక గణాంకాలు మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2020 మార్చి తదుపరి యూఎస్ ఫెడ్ తొలిసారి వడ్డీ రేటును తగ్గించింది. దీంతో ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి చేరాయి. సోమవారం(30న) ఫెడ్ చీఫ్ జెరోమీ పావెల్ ప్రసగించనున్నారు.
గత వారం రికార్డ్స్
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 1,028 పాయింట్లు ఎగసింది. 85,572 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 85,978కు చేరింది. నిఫ్టీ 388 పాయింట్లు జమ చేసుకుని 26,179 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 26,277ను తాకింది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. మార్కెట్ విలువరీత్యా బీఎస్‌ఈలో టాప్–10 కంపెనీలలో 8 కౌంటర్లు లాభపడ్డాయి. దీంతో టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఉమ్మడిగా రూ.1.21 లక్షల కోట్లకుపైగా బలపడింది. వీటిలో ప్రధానంగా ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.53,653 కోట్లు పెరిగి రూ. 20,65,198 కోట్లయ్యింది. ఎస్‌బీఐ విలువ రూ.18,519 కోట్లు పుంజుకుని రూ. 7,16,334 కోట్లను తాకింది. ఎయిర్‌టెల్ విలువ రూ. 13,095 కోట్లు బలపడి రూ.9,87,905 కోట్లకు, ఐటీసీ విలువకు రూ.9,927 కోట్లు జమయ్యి రూ. 6,53,835 కోట్లకు చేరింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 8,593 కోట్ల వృద్ధితో రూ. 15,59,052 కోట్లుగా నమో
దైంది.
పెట్టుబడులు @ 9 నెలల గరిష్టం
సెపె్టంబర్‌లో ఎఫ్‌పీఐల స్పీడ్
ఇటీవల దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి(27)వరకూ నికరంగా రూ. 57,359 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇది గత 9 నెలల్లో అత్యధికంకాగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇందుకు ప్రధాన కారణ మైంది. దీంతో 2024లో దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించాయి. ఇంతక్రితం 2023 డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 66,135 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ జూన్ నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు నెలవారీగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment