దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది.
అమెరికాలోని నాస్‌డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్‌లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది.
యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్‌ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్‌లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్‌లను విక్రయించారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment