దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్‌లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్‌లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు.
దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది.
ఎఫ్‌ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్‌డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్‌ఈల్డ్ 2 బేసిస్‌పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది.
మార్కెట్‌లో ఇప్పటికే ఐటీస్టాక్‌ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్‌రంగ స్టాక్‌లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment