
దేశీయ స్టాక్ మార్కెట్‌ల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. బుధవారం మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌లపై పడింది.
బుధవారం ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 51979 వద్ద నిఫ్టీ 174 పాయింట్లు నష్ట పోయి 15464 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
ఇక మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, హిందాల్కో,ఓఎన్‌సీజీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment