
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 927 పాయింట్లు భారీగా నష్టపోయి 54774 వద్ద నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 16401 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.బ్లూడార్ట్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, అంబీర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment