
స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన‍్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్‌ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment