ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
జోరుగా..
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి.
పీఎస్‌యూ షేర్లు అప్
డెరివేటివ్స్‌లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్‌ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్‌బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్‌సీ, గ్లెన్‌మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు రామ్‌కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment