దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ ఉదయం 9:20 వరకు 88 పాయింట్లు లాభపడి 21,739 వద్దకు చేరింది. సెన్సెక్స్ 332 పాయింట్లు పుంజుకుని 72,050 వద్ద ట్రేడవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతిఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, నెస్లే, పవర్‌గ్రిడ్, టైటాన్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి
డిసెంబర్ నెలకు సంబంధించి అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) డేటా విడుదలైంది. మార్కెట్ భావించిన దానికంటే కొంత అధికంగా సీపీఐ సూచీలున్నాయి. మార్కెట్లు 0.2 శాతంగా ఉంటుందని భావించాయి. కానీ 0.3శాతంగా నమోదైంది. క్రూడ్‌ఆయిల్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లుగా ఉంది. ఎర్రసముద్రం అనిశ్చితుల నేపథ్యంలో ఇరాన్ ఒమన్ కోస్ట్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లపై దాని ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 102.3కు చేరింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment