profits up
-
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్‌చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చాయి. ఆధునిక భారత్‌కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్‌కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్‌నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
ముంబై: ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాలు ఆర్జించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగసి తొలిసారి 76 వేల స్థాయిపై 76,010 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ 154 పాయింట్లు బలపడి 23,111 వద్ద ఆల్‌టైం అందుకుంది. అయితే ఆఖరి గంటలో సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఇంధన, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 22,932 వద్ద స్థిరపడింది. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.63%, 0.10% చొప్పున రాణించాయి. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. మార్కెట్లు మరిన్ని సంగతులు ► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఐఆర్డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్‌గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్‌టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల సంపద.. ఆల్‌టైమ్ గరిష్టం మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
మార్కెట్‌కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
97 డిపోలకు గాను 96 లాభాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు పెరగడంతో దశాబ్దం తర్వాత సంస్థ లాభాలను ఆర్జిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలి్పంచడంతో, వారి రూపంలో కోల్పోయే మొత్తాన్ని ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్ చేస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లెక్కలు ఖరారు చేశారు. గత సోమవారం (డిసెంబర్ 18) ఒక్కరోజే రూ.21.11 కోట్ల ఆదాయం నమోదైంది. ఈనెలలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే, సోమవారం ఏకంగా 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం చవిచూసింది. ఇలా 96 డిపోలు లాభాల్లోకి రావటం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్‌టైం రికార్డుగా నిలిచింది. డిసెంబరులో ఇప్పటివరకు 49 డిపోలు లాభాలు ఆర్జించాయి. దీంతో ఈనెల మొత్తానికి రూ.3.14 కోట్ల లాభం నమోదవుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలా ఒక నెల మొత్తానికి లాభాలు నమోదవడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. బస్సుల్లో సాధారణ రోజుల్లో కంటే సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. జీరో టికెట్ల జారీ మొదలైన తర్వాత తొలి సోమవారం (18వ తేదీ) 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు తేలింది. సోమవారం 30.12 లక్షల జీరో టికెట్లు (మహిళలకు ఇచ్చేవి) జారీ అయ్యాయి. కొత్త ఉత్సాహం కొన్ని డిపోలు సోమవారం ఒక్కరోజే 14 లక్షలకు మించి లాభాలు ఆర్జించటం విశేషం. ఒక్కో డిపో రోజుకు ఐదారు లక్షల నష్టాలను చవిచూసే పరిస్థితికి అలవాటుపడ్డ ఆర్టీసీకి తాజా లెక్కలు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం హనుమ కొండ డిపో రూ.14.10 లక్షలు, దేవరకొండ డిపో రూ.13.94 లక్షలు, మహబూబ్‌నగర్ డిపో రూ. 13.61 లక్షలు, హైదరాబాద్–1 డిపో రూ. 13.55 లక్షలు.. ఇలా పలు డిపోలు భారీ లాభాలు నమో దు చేసుకున్నాయి. ఒక్క కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం పొందటంతో మొత్తం డిపోల జాబితాలో నష్టాలు పొందిన ఏకైక డిపోగా మిగిలింది. 450కు మించి టికెట్ల జారీ సాధారణంగా జిల్లా సర్విసుల్లో ఒక కండక్టర్ గరిష్టంగా 300 వరకు టికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వాటిల్లో 450కి మించి టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నా.. వారు ఎక్కడి వరకు ప్రయాణిస్తారో తెలుసుకోవడం, వారు తెలంగాణ నివాసితులా కాదా అని ధ్రువపత్రాలు పరిశీలించడం లాంటి వాటి వల్ల టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. -
మళ్లీ కొత్త రికార్డులు
ముంబై: ఎఫ్ఎంసీజీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీ లు ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 71,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు బలపడి 21,453 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడి కి లోనయ్యాయి. అయితే వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే షేర్లు ఒక శాతం రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటు లాభాలు ఆర్జించగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగి 71,624 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 21,505 వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్టాలు నమోదు చేశాయి. మరో వైపు ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లో నయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.603 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు ఒక శాతం లాభపడ్డాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు యూరప్ మార్కెట్లు పరిమిత లాభాల్లో కదలాడాయి. ► ‘‘స్టాక్ మార్కెట్లో ఆశావాదం కొనసాగింది. స్థిరీకరణ దశలో భాగంగా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఎర్ర సముద్రం నౌకా మార్గానికి రక్షణ కల్పిస్తామంటూ అమెరికా ప్రకటనతో క్రూడాయిల్ ధరల్లో స్థిరంగా నెలకొంది. వృద్ధి ఆధారిత స్టాకుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు వినిమయ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► పెట్రోలియం క్రూడ్, డిజిల్‌పై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.50%, ఓఎన్జీసీ, హిందూస్తాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఐఓసీ, పెట్రోనెట్ షేర్లు ఒకటి నుంచి అరశాతం చొప్పున పెరిగాయి. ►భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటన(మంగళవారం)కు ముందు దేశీయ ఐటీ షేర్లలో అప్రమత్తత చోటు చేసుకొంది. కోఫోర్జ్ 3%, విప్రో 2%, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు ఒకశాతం పతనమయ్యాయి. ఎంఫసీస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీఎం షేర్లు అరశాతం నష్టపోయాయి. ► షేర్ల విభజన రికార్డు తేది జనవరి 5 గా నిర్ణయించడంతో నెస్లే ఇండియా షేరు 4.50% లాభపడి రూ.25,485 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5.50% పెరిగి రూ.25,699 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెపె్టంబర్(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 30 శాతం జంప్ చేసి 6.9 బిలియన్ పౌండ్లకు చేరింది. హోల్‌సేల్ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో హోల్‌సేల్ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్ పౌండ్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది. -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
లాభాల్లోకి జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో మొదటిసారి ఓ త్రైమాసికంలో లాభాలను నమోదు చేసింది. జూన్‌తో అంతమైన మూడు నెలల కాలానికి రూ.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.186 కోట్లు నష్టపోవడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఈ ఫలితాల్లో బ్లింకిట్ గణాంకాలు సైతం కలిసే ఉన్నాయి. విడిగా ఫుడ్ డెలివరీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. హైపర్ ప్యూర్ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారం పెద్ద సంక్లిష్టతలు లేకుండా నిర్వహించేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు జొమాటో వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో తెలిపారు. వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం వ్యాప్తంగా లాభాలను ఆర్జిస్తామని ప్రకటించారు. ఇక ముందు తమ వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుందని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. వచ్చే కొన్నేళ్లపాటు తాము ఏటా 40 శాతానికి పైగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తామని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో జొమాటో కంటే బ్లింకిట్ వాటాదారులకు ఎక్కువ విలువ తెచ్చి పెడుతుందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. కొన్ని పట్టణాల్లో జొమాటో స్థూల ఆర్డర్ విలువ సమీపానికి బ్లింకిట్ స్థూల ఆర్డర్ విలువ చేరినట్టు చెప్పారు. వృద్ధిని కొనసాగించేందుకు, తాము విజయం సాధిస్తామనుకున్న కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 2 శాతం లాభపడి రూ.86 వద్ద ముగిసింది. -
చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరగనున్నాయి. రూ. 1 లక్ష కోట్లకు చేరనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు తగ్గడం, దేశీయంగా రిటైల్ రేట్లు అధిక స్థాయిలో ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం.. 2017–2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఓఎంసీల నిర్వహణ లాభాలు సగటున రూ. 60,000 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూడు ప్రభుత్వ రంగ ఓఎంసీల మీద నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఆయిల్ కంపెనీలకు ప్రధానంగా రిఫైనింగ్ (ముడి చమురును శుద్ధి చేయడం), రిటైల్ బంకుల ద్వారా ఇంధనాలను మార్కెటింగ్ చేయడం ద్వారా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. నివేదికలో మరిన్ని అంశాలు.. ► రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్ పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు సగటున బ్యారెల్‌కు 15 డాలర్లు పలికాయి. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పటికీ .. రిటైల్ ఇంధన ధరను ఆ స్థాయిలో పెంచకపోవడంతో, రిఫైనింగ్ మార్జిన్లు పటిష్టంగానే ఉన్నా.. మార్కెటింగ్‌పరంగా నష్టాలు నమోదు చేయాల్సి వచి్చంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత బలహీనపడింది. ► ఈసారి నిర్వహణ లాభాలు లీటరుకు రూ. 5–7 స్థాయికి చేరవచ్చని, స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 6–8 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది. ► 2017–23 మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు తమ రిఫైనింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 3.3 లక్షల కోట్లు వెచి్చంచాయి. ఫలితంగా 2017లో రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న వాటి స్థూల రుణ భారం 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, లాభదాయకత తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఎంసీల పెట్టుబడి వ్యయాలు రూ. 54,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. ► ఈసారి క్రూడాయిల్ రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగినా లేక ముడిచమురు ధర తగ్గకుండా రిటైల్ రేట్లు తగ్గినా అంచనాలు మారిపోవచ్చు. -
తొమ్మిదేళ్లలో మూడింతలు
న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభాలు గత తొమ్మిదేళ్లలో మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా భవిష్యత్‌లోనూ ఈ ధోరణిని పీఎస్‌బీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,270 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల లాభాలు 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఈ విజయాలను చూసి పొంగిపోతూ పీఎస్‌బీలు అలసత్వం వహించరాదని, అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను, నియంత్రణ సంస్థ నిబంధనలను, పటిష్టమైన అసెట్–లయబిలిటీ .. రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను పాటిస్తూ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. గతంలో ఇటు బ్యాంకులు అటు కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లూ ఒత్తిడిలో ఉండేవని .. ప్రస్తుతం అటువంటి పరిస్థితి నుంచి బైటపడ్డాయని మంత్రి చెప్పారు. బ్యాంకుల అసెట్లపై రాబడులు, నికర వడ్డీ మార్జిన్లు, ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి మొదలైనవన్నీ మెరుగుపడ్డాయన్నారు. రుణాల వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై, బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా సమ్మాన్ బచత్ పత్రాలకు ప్రాచుర్యం కలి్పంచాలని చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల కోసం ఉద్దేశించిన నిధులను గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి బదలాయించడం కాకుండా, ఆయా లక్ష్యాల సాధన కోసం పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్‌వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
ఆర్బీఐ పాలసీ వెల్లడికి ముందు లాభాలు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడొచ్చనే ఆశలతో బుధవారం స్టాక్ సూచీలు ఆరునెలల గరిష్టంపై ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి బలోపేతం అంశాలు కలిసొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సెన్సెక్స్ 403 పాయింట్లు దూసుకెళ్లి 63,196 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 18,739 వద్ద గరిష్టాలను నమోదు చేశాయి. చివర్లో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 63,143 వద్ద స్థిరపడింది. ఆరు నెలల తర్వాత ఈ సూచి తొలి సారి 63 వేల స్థాయికి చేరుకుంది. అలాగే ఇందులోని 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 18,726 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకిది 6 నెలల గరిష్టం కావడం విశేషం. ముఖ్యంగా మెటల్, ఇంధన, ఎఫ్ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ. 5,408 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,033 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 78,439 కోట్ల నుంచి రూ. 1,05,932 కోట్లకు ఎగసింది. ఇక ఇదే కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 413 కోట్ల నుంచి రూ. 2,696 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం టర్న్అరౌండ్ సాధించింది. రూ. 2,414 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. 2021–22లో రూ. 11,441 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,78,454 కోట్ల నుంచి రూ. 3,45,967 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 2 డివిడెండ్ ప్రకటించింది. డీవీఆర్కు రూ. 2.1 చెల్లించనుంది. భారీ పెట్టుబడులు: గతేడాది క్యూ4లో బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 49 శాతం జంప్‌చేసి 7.1 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి 25 శాతం అధికంగా 22.8 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. క్యూ4లో 24 శాతం వృద్ధితో 94,649 జేఎల్ఆర్ వాహనాలు విక్రయమైనట్లు సంస్థ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి 9% అధికంగా 3,21,362 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు నమోదైనట్లు వెల్లడించారు. ఇక దేశీయంగా ప్యాసింజర్ వాహన హోల్‌సేల్ విక్రయాలు 45 శాతం ఎగసి 5.38 లక్షలను తాకినట్లు టాటా మోటార్స్ పీవీ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. 2023–24లో రూ. 38,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 0.8 శాతం బలపడి రూ. 516 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్‌లు, కార్‌మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్‌లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్ దిగ్గజం ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.80 వద్ద లాకయ్యింది. ► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది. -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
ట్రావెల్ ఆపరేటర్ల లాభాలకు బూస్ట్
ముంబై: ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 6–7 శాతం వృద్ధి చెందనున్నాయి. అలాగే కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 90 శాతం ఆదాయాన్ని రికవర్ చేసుకోనున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. కోవిడ్‌పరమైన ఆంక్షల వల్ల ప్రయాణాలు నిల్చిపోవడంతో రెండేళ్ల పాటు నష్టపోయిన ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభదాయకత .. 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 6–7 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్, విహార ప్రయాణాలు మెరుగుపడటంతో ఆదాయాలూ పెరగగలవని క్రిసిల్ తెలిపింది. కోవిడ్ సమయం నుంచి అమలు చేస్తున్న ఆటోమేషన్, వ్యయ నియంత్రణ విధానాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తిరిగి మహమ్మారి పూర్వ స్థాయిని (2020 ఆర్థిక సంవత్సరం) దాటేయొచ్చని తెలిపింది. 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటింగ్ సంస్థలు వరుసగా 25.8%, 2.7% మేర నిర్వహణ నష్టాలు ప్రకటించాయి. నివేదికలోని మరిన్ని అంశాలు. ► నిర్వహణ పనితీరు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, నికర రుణ రహితంగా ఉండటం వంటి అంశాలు ఆయా సంస్థలకు సహాయకరంగా ఉండనున్నాయి. ► స్వల్పకాలిక విహార యాత్రలకు.. (ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతాలకు) ప్రాధాన్యం పెరుగుతోంది. యూరోపియన్ దేశాల వీసాల జారీ పుంజుకోవడంతో రాబోయే వేసవి సెలవుల కోసం బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే, విహార యాత్రల కోసం అమెరికాకు వెళ్లే ధోరణులు రికవర్ కావడానికి మరింత సమయం పట్టనుంది. ► అంతర్జాతీయ మందగమనం సుదీర్ఘంగా కొనసాగవచ్చన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతుండటంతో రాకపోకలు మెరుగుపడనుండటం.. ఆదాయాల వృద్ధికి తోడ్పడనుంది. -
సూచీలకు స్వల్పలాభాలు
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్పలాభాలతో గట్టెక్కాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 58,245 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభంతో 17,177 వద్ద ప్రారంభమయ్యాయి. తొలి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 344 పాయింట్లు ఎగసి 58,418 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు బలపడి 17,207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 140 పాయింట్ల స్వల్పలాభంతో 58,215 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 17,152 వద్ద నిలిచింది. ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ కమోడిటీ షేర్లు రాణించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.18 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, మీడియా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
లాభాలకు అవకాశం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలు లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపై దృష్టి సారించవచ్చు. ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీ ప్రసంగం భారత్ తో పాటు ఈక్విటీ మార్కెట్లకు కీలకం కానుంది. అమెరికా మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణిని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు, తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. బీఎస్ఈ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను నేటి నుంచి (ప్రస్తుతం ఉన్న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి) సాయంత్రం 5.00 గంటల వరకు పొడగించడమైంది. నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ సూచీలు గతవారం కొంతమేర రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే హోళీ సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. కమోడిటీ మార్కెట్ తొలి సెషన్లో పనిచేయదు. సాయంత్రం సెషన్ (సాయంత్రం 5గంటల నుంచి 11:55 గంటకు వరకు)లో ట్రేడింగ్ జరుగుతుంది. అగ్రి కమోడిటీ ఇండెక్స్ రెండు సెషన్లలోనూ పనిచేయదు. ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం యథావిధిగా ప్రారంభవుతాయి. ‘‘మార్కెట్లో రికవరీ సూచీలపై కొంత ఒత్తిడిని తగ్గించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అయితే ఐటీ, ఆటో, ఇంధన షేర్లు కూడా పుంజుకోవాల్సిన అవశ్య కత ఎంతైనా ఉంది. ఇటీవల నిఫ్టీ 200 డేస్ మూ వింగ్ యావరేజ్ అధిగమించగలిగింది. తక్షణ నిరోధం 17,750... ప్రస్తుతం 17,750 వద్ద తక్షణ నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగి 17,900 స్థాయిని అందుకోవచ్చు. అనూహ్యంగా దిద్దుబాటుకు లోనైతే 17500 – 17350 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. మిశ్రమ సంకేతాలు నెలకొన్న తరుణంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్ గౌర్ తెలిపారు. మంగళవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఎదుట మంగళవారం, హౌసింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిటీ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల సైకిల్ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు, చైనా సీపీఐ, బ్రిటన్ పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్, యూరో జోన్ ఎస్అండ్పీ కన్స్ట్రక్షన్ పీఐఎం, రిటైల్ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే జపాన్ కరెంట్ అకౌంట్, చైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ద్రవ్యోల్బణం, పీపీఐ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. అయితే అమెరికా ఆర్థిక వృద్ధి నమోదు కారణంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడంతో బాండ్లపై రాబడులు కొంత నెమ్మదించాయి. మూడు రోజుల్లో రూ.8,300 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లో రూ.8,300 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. గతవారంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్ నాలుగు కంపెనీ షేర్లలో 1.87 బిలియన్ (రూ. 15,280 కోట్లు) డాలర్లు భారీ పెట్టుబడిని పెట్టడంతో ఎఫ్ఐఐల నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఎఫ్ఐఐలు ఫిబ్రవరి రూ.5,249 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఈ మార్చిలోనూ విదేశీ అమ్మకాలు కొనసాగవచ్చు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. ఈక్విటీలతో పోలిస్తే రిస్క్ సామర్థ్యం తక్కువగా ఉండే బాండ్లపై పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ విజయ్‌కుమార్ తెలిపారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
అదరగొట్టిన మారుతి:అమ్మకాల జోష్ మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెట్టింపు కంటే ఎక్కువలాభాలను నమోదు చేసింది. అలాగే ఆదాయం కూడా 25 శాతం ఎగిసింది. EBIT మార్జిన్ కూడా 350 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 7.6 శాతానికి చేరుకుంది. లాభాల మార్జిన్ 380 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతంగా ఉంది. ప్యాసింజర్, హై ఎండ్ కార్ల బలమైన డిమాండ్, ఇటీవలి కాలంలో ధరల పెంపు నేపథ్యంలో మారుతీ గణనీయ లాభాలను సాధించింది. త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 129.55 శాతం జంప్ చేసింది. గత ఏడాదితో రూ.1,041.8 కోట్లతో పోలిస్తే, రూ.2,391.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 29,057.5 కోట్లను సాధించింది. గత ఏడాది 23,253.3 కోట్ల వార్షిక ప్రాతిపదికన 24.96 శాతం పెరిగింది. జోరందుకున్న అమ్మకాలు, ముడి సరుకు ధర తగ్గడంతో లాభాల్లో పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 430,668 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 403,929 యూనిట్లు కాగా, ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇది మొత్తం 430,668 యూనిట్ల విక్రయాలకు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు , ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లు ఉన్నాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.27,849.2 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకి 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అత్యధికంగా రూ. 81,679 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 58,284.1 కోట్లుగా ఉంది. ఎఫ్వై22 మొదటి తొమ్మిది నెలల్లో రూ.1,927.4 కోట్ల నుంచి ఏడాది మొదటి తొమ్మిది నెలల నికర లాభం రూ.5,425.6 కోట్లకు పెరిగింది. -
రికార్డ్ లాభాలను సాధించిన ఉజ్జీవన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్‌కు బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 63 శాతం జంప్‌చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో క్విప్ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. -
అదానీ పోర్ట్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: నౌకాశ్రయాలు, టెర్మినళ్ల దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 65 శాతం జంప్‌చేసి రూ. 1,738 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,050 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,923 కోట్ల నుంచి రూ. 5,211 కోట్లకు ఎగసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబర్) లో కార్గో పరిమాణం, ఆదాయం, నిర్వహణా లాభాల్లో సరికొత్త రికార్డు సాధించినట్లు కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. ఈ బాటలో అక్టోబర్‌ను సైతం పరిగణిస్తే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7 నెలల్లో 200 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) కార్గోను సాధించినట్లు తెలియజేశారు. వెరసి పూర్తి ఏడాదికి నిర్దేశించుకున్న 35-36 కోట్ల మెట్రిక్ టన్నుల కార్గో పరిమాణం, రూ. 12,200-12,600 కోట్ల నిర్వహణా లాభ లక్ష్యాన్ని అందుకునే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్‌ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
ఫలితాల్లో మారుతి అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం
సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!) గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది. అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్‌లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్‌తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి 9,548 వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. -
టీసీఎస్ లాభం రూ. 10 వేల కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలకు అనుగుణమైన లాభాలతో రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం 8.4 శాతం పెరిగి రూ. 10,431 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ లాభాలు ఒక త్రైమాసికంలో రూ. 10వేల కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే ప్రథమం. ఇక సమీక్షా కాలంలో ఆదాయం 18 శాతం ఎగిసి రూ. 55,309 కోట్లకు చేరింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 46,867 కోట్ల ఆదాయంపై రూ. 9,624 కోట్ల లాభం నమోదు చేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 10 శాతం, ఆదాయం 5 శాతం పెరిగాయి. ‘మా సర్వీసులకు డిమాండ్ పటిష్టంగా ఉంది. వివిధ విభాగాలు, మార్కెట్లలో లాభదాయకతపరంగా మెరుగైన వృద్ధి నమోదు చేశాం‘ అని సంస్థ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులు ‘సవాళ్లతో‘ కూడుకుని ఉన్నాయని, మరింత ‘అప్రమత్తంగా‘ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి రిస్కుల ప్రభావం కంపెనీపై పడకుండా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తామని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయపరమైన సవాళ్లపై ఆందోళనల కారణంగా క్లయింట్లు దీర్ఘకాలిక డీల్స్‌కు దూరంగా ఉంటున్నారని సీవోవో గణపతి సుబ్రమణియం చెప్పారు. ధరలపరంగా పరిస్థితి స్థిరంగానే ఉందని, రూపా యి క్షీణత కారణంగా ఒత్తిళ్లేమీ లేవని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున టీసీఎస్ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ అక్టోబర్ 18 కాగా, నవంబర్ 7న చెల్లిస్తుంది. ► క్యూ2లో నిర్వహణ మార్జిన్ 1.6% క్షీణించి 24%కి పరిమితమైంది. నాలుగో త్రైమాసికం నాటికి దీన్ని 25%కి పెంచుకోవాలని.. తర్వాత 26–28%కి చేరుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ► విభాగాల వారీగా చూస్తే సమీక్షా కాలంలో రిటైల్, సీపీజీ (కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్) 22.9%, కమ్యూనికేషన్స్.. మీడియా 18.7 శాతం, టెక్నాలజీ .. సర్వీసులు 15.9 శాతం, తయారీ 14.5 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ► కంపెనీ ఆర్డరు బుక్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 400 మిలియన్ డాలర్ల ఒప్పందమే అతి పెద్దది. ► క్యూ2లో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరింది. మహిళా సిబ్బంది వాటా 35.7 శాతంగా ఉంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) జూన్ త్రైమాసికంలో 19.7 శాతంగా ఉండగా క్యూ2లో 21.5 శాతానికి చేరింది. అయితే, ఇది దాదాపు గరిష్ట స్థాయికి చేరినట్లేనని, ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని లక్కడ్ తెలిపారు. టీసీఎస్ షేరు సోమవారం 2% పెరిగి 3,121 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. -
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్‌ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్‌కే పరిమితం కావాలి. -
పేటీఎమ్: 2023 సెప్టెంబర్‌కల్లా లాభాల్లోకి
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. 2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
గెయిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్ స్టాండెలోన్ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు గురువారం 0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది. -
అదర గొట్టిన టీవీఎస్ మోటార్, షేరు జూమ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్‌గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్లో 5 శాతం ఎగిసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్డౌన్లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి. మోటారు సైకిళ్ల విక్రయాలు 3.06 లక్షల యూనిట్ల నుంచి 4.34 లక్షల యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 1.38 లక్షల నుంచి 3.06 లక్షల యూనిట్లకు చేరాయి. 2.96 లక్షల యూనిట్ల ద్వచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఎన్సీడీలను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
డా.రెడ్డీస్ లాభం 108 శాతం అప్: అయినా షేరు ఢమాల్
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది. ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు. బూస్టర్ డోస్‌గా స్పుత్నిక్ లైట్.. కోవిడ్‌కి సంబంధించి స్పుత్నిక్ లైట్‌ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు. -
మూడు నెలల గరిష్టంలో ముగింపు
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు ఆరోరోజూ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 56వేల స్థాయిపైన 56,072 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,700 స్థాయిని అందుకొని 114 పాయింట్లు పెరిగి 16,719 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు మూడునెలల గరిష్టం. రూపాయి రికవరీతో డాలర్ల రూపంలో లాభాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.675 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.739 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదు పైసలు పతనమై 79.90 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.9.08 లక్షల కోట్లు: స్టాక్ మార్కెట్ ఈ వారమంతా లాభాలను గడించింది. సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4% దూసుకెళ్లడంతో బీఎస్ఈలో రూ.9.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు ఎగసింది. సెన్సెక్స్ ఉదయం 119 పాయింట్ల లాభంతో 55,801 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 16,661 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో తడబడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలతో తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 501 పాయింట్ల రేంజ్లో 55,685 వద్ద కనిష్టాన్ని, 56,186. వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 141 పాయింట్ల పరిధిలో 16,752 – 16,611 శ్రేణిలో ట్రేడైంది. -
క్యూ1లో టీసీఎస్ భేష్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతంపైగా బలపడి రూ. 9,478 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 52,758 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఆదాయంలో రిటైల్, సీపీజీ 25 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 19.6 శాతం, తయారీ విభాగం, టెక్నాలజీ సర్వీసులు 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.9 శాతం, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ 11.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ప్రాంతాలవారీగా చూస్తే.. ఉత్తర అమెరికా బిజినెస్ 19.1 శాతం, యూరప్ 12.1 శాతం, యూకే 12.6 పురోగతి సాధించగా.. దేశీయంగా 20.8 శాతం వృద్ధిని అందుకుంది. ఈ బాటలో లాటిన్ అమెరికా బిజినెస్ 21.6 శాతం ఎగసింది. మార్జిన్లు డౌన్ క్యూ1లో ఉద్యోగ వలస(అట్రిషన్) రేటు 19.7 శాతానికి చేరినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా వెల్లడించారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 17.4%తో పోలిస్తే ఇది అధికంకాగా.. వార్షిక వేతన పెంపు, నైపుణ్య గుర్తింపు తదితరాలతో మార్జిన్లపై ప్రభావం పడినట్లు తెలియజేశారు. తాజాగా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 6 లక్షలను మించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో వ్యయ నిర్వహణ సవాళ్లు విసిరినట్లు తెలియజేశారు. వెరసి నిర్వహణా మార్జిన్లు 23.1%గా నమోదైనట్లు తెలియజేశారు. క్యూ1లో మొత్తం 8.2 బిలియన్ డాలర్ల(రూ. 64,780 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో 40 కోట్ల డాలర్లకుపైబడిన రెండు భారీ డీల్స్ ఉన్నట్లు తెలిపింది. కీలక మార్కెట్లలో ఆర్థిక మాంద్య ఆందోళనలు కంపెనీపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని సమీర్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్తగా 14,136 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,06,331కు చేరుకుంది. ► ఈ ఏడాది కొత్తగా 40,000 మందికి ఉద్యోగాలు ► డివిడెండుకు రికార్డ్ డేట్ జూలై 16కాగా, ఆగస్ట్3కల్లా చెల్లించనుంది. ► 10 కోట్ల డాలర్ల విభాగంలో కొత్తగా 9 క్లయింట్లు జత 5 కోట్ల డాలర్ల విభాగంలో జత కలసిన 19 కొత్త క్లయింట్లు కంపెనీ క్యూ1 ఫలితాలను మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. బీఎస్ఈలో టీసీఎస్ షేరు 0.7% బలపడి రూ. 3,265 వద్ద ముగిసింది. ఆల్‌రౌండ్ గ్రోత్... కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించాం. అన్ని విభాగాల్లోనూ వృద్ధితోపాటు ప్రోత్సాహకర స్థాయిలో ఆర్డర్లు సంపాదించాం. డీల్స్ కుదుర్చుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తున్నాం. కొత్త వ్యవస్థాగత నిర్మాణంతో క్లయింట్లకు చేరువవుతున్నాం. ఈ ఏడాది కొత్తగా 40,000 మందిని నియమించుకోనున్నాం. క్లయింట్లతో చర్చల నేపథ్యంలో డిమాండ్ కొనసాగనున్నట్లు భావిస్తున్నాం. హై అట్రిషన్ మరో క్వార్టర్పాటు కొనసాగవచ్చు. ఆపై ద్వితీయార్ధం నుంచి నిలకడకు వీలుంది. –రాజేశ్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
ఉత్తమ్ గాల్వాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్స్ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్ రోల్డ్, గాల్వనైజ్డ్ స్టీల్ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ. 7,245 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 8,644 కోట్ల నుంచి రూ. 7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
ఆయిల్ ఇండియాకు లాభాల పంట
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.504 కోట్లకు చేరింది. షేరువారీ ఆర్జన రూ.4.65గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.239 కోట్లు (షేరువారీ ఆర్జన రూ.2.20)గా ఉండడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారెల్ ముడి చమురుపై 71.35 డాలర్ల మేర ధర గిట్టుబాటు కావడం లాభాల వృద్ధికి దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర 43 డాలర్ల స్థాయిలో ఉంది. కంపెనీ చమురు ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేకుండా 0.76 మిలియన్ టన్నులుగా ఉంటే, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.2,281 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు వృద్ధి చెందింది. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.1,012 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా రూ.1,281 కోట్లుగా ఉంది. -
ముత్తూట్ లాభం అప్
ముంబై: గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,002 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 926 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,821 కోట్ల నుంచి రూ. 3,052 కోట్లకు ఎగసింది. దీనిలో వడ్డీ ఆదాయం రూ. 2,729 కోట్ల నుంచి రూ. 3,003 కోట్లకు బలపడింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నిర్వహణలోని ఆస్తుల(రుణాలు) విలువ(ఏయూఎం) 17 శాతం ఎగసి రూ. 60,919 కోట్లను తాకింది. బంగారు రుణాలకు డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ ప్రారంభంకావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లోనూ పటిష్ట పనితీరును చూపగలమని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిని సాధించగలమని అంచనా వేశారు. -
మూరత్ ట్రేడింగ్ మురిపించెన్..!
ముంబై: దీపావళి రోజు గంటసేపు జరిగిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్ మురిపించింది. స్టాక్ సూచీలు సంవత్ 2078 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. మూరత్ ట్రేడింగ్‌లో ఎంపిక చేసుకున్న షేర్లు లాభాల్ని పంచుతాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. రెండురోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ గురువారం సాయంత్రం 6:15 నిమిషాలకు సెన్సెక్స్ 436 పాయింట్ల లాభంతో 60,208 వద్ద మొదలైంది. నిఫ్టీ 106 పాయింట్ల పెరిగి 17,935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటో షేర్లకు కలిసొచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకూ అధిక డిమాండ్ నెలకొంది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను విక్రయించగా.., దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.38 కోట్ల షేర్లను కొన్నారు. బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్ఛంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు పనిచేయలేదు. నేడు, రేపు(శని,ఆది) సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. ప్రపంచ మార్కెట్లకు ఫెడ్ బూస్ట్... ఫెడ్ రిజర్వ్ కమిటి గురువారం రాత్రి ప్రకటించిన పాలసీ నిర్ణయాలు మెప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. తక్షణమే ఫెడ్ ట్యాపరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నెలవారీగా చేపడుతున్న బాండ్ల కొనుగోళ్లను ఈ నవంబర్ నుంచి ప్రతి నెలా 15 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉందని హామీనిచ్చింది. ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా అక్టోబర్ ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐరోపా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూఎస్ సూచీలు అరశాతం లాభంతో ప్రారంభమయ్యాయి. -
లాభాల రోడ్డెక్కిన ఓలా.. ఈసారి లాభం ఎంతంటే?
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్న ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తొలిసారిగా నిర్వహణ లాభాలు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలుతో ఆదాయం క్షీణించినప్పటికీ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 90 కోట్లు లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం సంస్థ రూ. 610 కోట్ల నష్టం ప్రకటించింది. తాజాగా ఆదాయం 65 శాతం క్షీణించి రూ. 690 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం నష్టం రూ. 1,715 కోట్ల నుంచి రూ. 1,326 కోట్లకు తగ్గింది. ఓలా మాతృ సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ఈ విషయాలు వెల్లడించింది. ఫుడ్ డెలివరీ, ఆర్థిక సేవల వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్న ఏఎన్ఐ కన్సాలిడేటెడ్ ఆదాయంలో .. సింహభాగం వాటా ట్యాక్సీ సేవల విభాగానిదే ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏఎన్ఐ టెక్నాలజీస్ ఆదాయం 63 శాతం క్షీణించి రూ. 983 కోట్లకు తగ్గగా, నిర్వహణ నష్టం రూ. 429 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020–21లో 1 కోటి మంది దాకా కొత్త యూజర్లు చేరారని, మరిన్ని కొత్త నగరాలకు కార్యకలాపాలు విస్తరిస్తున్నామని, కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఇటీవలే ప్రకటించారు. ఐపీవో ద్వారా 1–15 బిలియన్ డాలర్ల (రూ. 7,324–10,985 కోట్లు) నిధులు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
గెయిల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్‌సీఎండీకి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది. -
ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ ! ఈ కార్పోరేట్ కంపెనీలో 45,000 ఉద్యోగాలు.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది. ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్: అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్‌లో కాగ్నిజంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో డిజిటల్ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్ తెలిపారు. క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో.. నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్–డిసెంబర్) ఆదాయం 4.75–4.79 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. -
అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు... ఇవ్వన్నీ సామాన్య జనాలకు అర్థం కాని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు వస్తే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు. నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు. నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..! గత నాలుగు రోజుల నుంచి స్టాక్‌మార్కెట్లు పరుగులు పెడుతూనే ఉంది. అక్టోబర్ 8 శుక్రవారం రోజన బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల మార్కును దాటి రికార్డులను సృష్టించింది. దీంతో గత నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ పెట్టుబడిదారులు సుమారు 6,09,840.74 కోట్ల లాభాలను సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 12న బీఎస్ఈ సూచి నాల్గవ సెషన్లో 0.25 శాతం పెరిగి 60,284.31 పాయింట్ల వద్ద ముగిసింది. చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!! బీఎస్ఈ ఇండెక్స్ గత నాలుగు రోజుల్లో 1094.58 పాయింట్లు పుంజుకుంది.ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 6,09,840.74 కోట్లు పెరిగి రూ. 2,68,30,387.79 కోట్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్లు మంగళవారం రోజున బలహీనంగా ప్రారంభమయ్యాయి బలహీనమైన గ్లోబల్ సూచనలతో మార్కెట్లు అస్థిరతను చూశాయి. అయితే, చివరి గంటలో మార్కెట్లు భారీగా లాభాలను గడించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి టైటాన్ షేర్లు అత్యధికంగా 5 శాతం మేర లాభపడింది తరువాత బజాజ్ ఆటో, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను పొందాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ షేర్లు వెనుకబడ్డాయి. చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...! -
ఎస్కార్ట్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 178 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ1లో రూ. 92.6 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,089 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో ట్రాక్టర్ విక్రయాలు 43 శాతం ఎగసి 25,935 యూనిట్లను తాకాయి. వ్యవసాయ పరికరాల విభాగం ఆదాయం రూ. 977 కోట్ల నుంచి రూ. 1,436 కోట్లకు ఎగసిందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలహీనపడి రూ. 1,223 వద్ద ముగిసింది. -
పుంజుకున్న టైటాన్
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో భాగమైన టైటాన్ కంపెనీ 2021–22 జూన్ త్రైమాసికంలో తన పనితీరును మెరుగుపరుచుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.297 కోట్లు నష్టపోగా.. తాజాగా ముగిసిన త్రైమాసికంలో రూ.18 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,020 కోట్లుగా ఉంది. టైటాన్ ఆభరణాల విభాగం మంచి పనితీరును చూపించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ విభాగం ఆదాయం రూ.1,182 కోట్ల నుంచి రూ.2,467 కోట్లకు వృద్ధి చెందింది. వాచ్‌లు, వేరబుల్ ఉత్పత్తుల నుంచి ఆదాయం రూ.292 కోట్లకు పుంజుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విభాగం ఆదాయం రూ.75 కోట్లుగానే ఉండడం గమనార్హం. అలాగే, కళ్లద్దాల వ్యాపార ఆదాయం రూ.30 కోట్ల నుంచి రూ.67 కోట్లకు మెరుగుపడగా.. ఇతర ఉత్పత్తుల నుంచి వచ్చిన ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. -
అదరగొట్టిన రిలయన్స్
సాక్షి,ముంబై: దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రికార్డు స్థాయిలో లాభాలను సాధించింది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని సంస్థ నికర లాభాల్లో 2020 సంవత్సరం క్యూ 4లో భారీ వృద్ధిని సాధించింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ 4 ఫలితాల్లో ఆర్ఐఎల్ రూ.13,227 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 6,348 కోట్ల రూపాయలు. ఏకీకృత ఆదాయం 11 శాతం ఎగిసి 154,896 కోట్లుగా ఉంది. గత ఏడాది కంపెనీ ఆదాయం 139,535 కోట్ల రూపాయలని రిలయన్స్ తెలిపింది. రిలయన్స్ ఆయిల్-టు కెమికల్ వ్యాపారం 20.6శాతం వృద్ధితో , రూ.1,01,080కోట్ల ఆదాయం ఆర్జించగా, ఎబిటా రూ.11407కోట్లుగా ఉంది. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పద్దతిలో 16.9శాతం ఎక్కువ. గత ఏడాది 4,267 కోట్ల భారీ వన్‌టైం నష్టాలను నమోదు చేసిన రిలయన్స్ ఈ ఏడాది 797 కోట్ల లాభాలను గడించడం విశేషం. అలాగే మార్చి 31, 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు 7రూపాయల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. ముఖ్యంగా ఆర్ఐఎల్కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 47.5 శాతం వృద్ధిని నమోదు చేసి 3,508 కోట్ల రూపాయలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 2,379 కోట్ల రూపాయలు. కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం దాదాపు 19శాతం పెరిగి 18,278 కోట్ల రూపాయలకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 15,373 కోట్ల రూపాయలు అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 426 మిలియన్ల కస్టమర్లు జియో సొంతమని, ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ, గృహ,సంస్థలకు డిజిటల్ అనుభవాలను అందించడానికి తాము కట్టబడి ఉన్నామని రిలయన్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న జియో.. ఇండియాను ఒక ప్రధాన డిజిటల్ సమాజంగా మార్చే కృషిని కొనసాగిస్తుందన్నారు. చదవండి : వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్ -
అదరగొట్టిన టీసీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ గతేడాది చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 9,246 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 8,049 కోట్లు నమోదైంది. మొత్తం ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 39,946 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో టీసీఎస్ నికర లాభం రూ. 32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది. ఇది న్యాయపరమైన క్లెయిముల ప్రొవిజన్లు మినహాయించి ప్రకటించిన నికర లాభంకాగా.. నికరంగా చూస్తే రూ. 32,430 కోట్లు ఆర్జించింది. ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన న్యాయవివాదానికి కంపెనీ రూ. 1,218 కోట్లు(16.5 కోట్ల డాలర్లు) కేటాయించింది. ఇక మొత్తం ఆదాయం 4.6 శాతం పుంజుకుని రూ. 1,64,717 కోట్లయ్యింది. అంతక్రితం ఏడాది రూ. 1,56,949 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఆర్డర్‌బుక్ జోరు క్యూ4లో ఆర్డర్‌బుక్ 9.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలోనే అత్యధికంకాగా.. 2021 మార్చికల్లా మొత్తం ఆర్డర్ బుక్ విలువ 17.1 శాతం వృద్ధితో 31.6 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేసింది. క్యూ4లో కొత్తగా 19,388 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 4,88,649కు చేరింది. ఐటీ సర్వీసులలో వలసల రేటు 7.2 శాతంగా నమోదైనట్లు టీసీఎస్ తెలియజేసింది. కోవిడ్–19.. గత మూడు త్రైమాసికాలుగా కోవిడ్–19 నేపథ్యంలోనూ పటిష్ట ఫలితాలను సాధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ముగించినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. మెగా డీల్స్, పరిశ్రమను మించిన వృద్ధి, సిబ్బంది, కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు తదితరాలకు క్యూ4లో సాధించిన మార్జిన్లు విలువను చేకూర్చినట్లు వ్యాఖ్యానించారు. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 3,250 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,338 వద్ద గరిష్టాన్ని, రూ. 3,213 వద్ద కనిష్టాన్ని తాకింది. కొత్త ఏడాదిలోనూ.. గత దశాబ్దంలో కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు, పరిశోధన, నవీకరణ వంటి అంశాలు భవిష్యత్‌లోనూ సాంకేతిక సేవలలో భారీ అవకాశాలకు దారి చూపనున్నాయి. వృద్ధి, ట్రాన్స్ఫార్మేషన్లలో మరింత వాటాను సాధించనున్నాం. కొత్త ఏడాది(2021–22)లో క్లయింట్ల పురోగతి ప్రణాళికలకు సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతల ద్వారా మద్దతివ్వడంలో దృష్టిపెట్టనున్నాం. – టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ -
అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రూపేణా రూ.9.45 లక్షల కోట్ల ఆదాయం 2020–21 ఆర్థిక సంవత్సరంలో సమకూరింది. సవరించిన అంచనాల కంటే ఇది 5 శాతం అధికం కాగా.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లో వచ్చిన ఆదాయం కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు వివరాలను ఆదాయపన్ను శాఖ శుక్రవారం విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.13.19 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తుందని తొలుత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ తర్వాత కరోనా రాకతో ఆర్థిక వ్యవస్థ చతికిలపడడం తెలిసిందే. దీంతో కేంద్ర సర్కారు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష పన్నుల ఆదాయం అంచనాలను రూ.9.05 లక్షల కోట్లకు సవరించింది. ఆదాయపన్ను రిఫండ్లను (అధికంగా వసూలు చేసిన పన్నును తిరిగి ఇచ్చేయడం) పెద్ద మొత్తంలో చేసినప్పటికీ.. సవరించిన పన్నుల ఆదాయ అంచనాలను తమ శాఖ అధిగమించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ సంస్థల ఆదాయపన్ను చెల్లింపులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు. 2019–20 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.10.49 లక్షల కోట్లు రావడం గమనార్హం. తాజాగా ముగిసిన 2020–21లో ఇది రూ.9.45 లక్షల కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.11.08 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని బడ్జెట్లో కేంద్రం అంచనా వేయడం గమనార్హం. రూ.2.61లక్షల కోట్ల రిఫండ్లు ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో కార్పొరేట్ పన్ను రూపేణా రూ.4.57 లక్షల కోట్లు సమకూరగా.. వ్యక్తిగత ఆదాయపన్ను ద్వారా రూ.4.71 లక్షల కోట్లు వచ్చింది. రూ.16,927 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో వసూలైంది. రూ.2.61 లక్షల కోట్ల మేర పన్ను రిఫండ్లను కూడా కలిపి చూస్తే స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 2020–21 సంవత్సరానికి రూ.12.06లక్షల కోట్లుగా ఉంది. పన్ను రిఫండ్లు గత ఆర్థిక సంవత్సరానికి 42 శాతం పెరిగాయి. ‘‘కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ.. 2020–21 సంవత్సరానికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో పెరుగుదల నమోదైంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పన్ను నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పీసీ మోదీ పేర్కొన్నారు. ఇది పన్నుల ఆదాయంలో ప్రతిఫలించినట్టు చెప్పారు. -
కొత్త ఏడాదికి లాభాల స్వాగతం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి((2021–22) లాభాలతో స్వాగతం పలికింది. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం దేశీయ మార్కెట్ లాభాల్ని మూటగట్టుకుంది. మెటల్, ఆర్థిక, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ల అండతో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 14,867 వద్ద నిలిచింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.24 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అలాగే కేంద్రం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.14,500 కోట్ల మూలధన నిధులను సమకూర్చింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్ బలపరిచాయి. మరోవైపు అమెరికాలో భారీ ఉద్యోగ కల్పన లక్ష్యంగా మౌలిక రంగంలో 2.3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్లు దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ అంశం మన కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 583 పాయింట్లు, నిఫ్టీ 192 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.94 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.207.15 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.297 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పీఎస్బీ షేర్ల పరుగులు కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు(పీఎస్బీ) రూ.14,500 కోట్ల నిధులను కేటాయించడంతో ఈ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. మొండిబకాయిలుతో పాటు పలు సంస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం భారీ ఎత్తున నిధులను సమకూర్చడంతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో ఈ బ్యాంకు షేర్లు 10% ర్యాలీ చేశాయి. మెరిసిన మెటల్ షేర్లు...: బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ స్టీల్ కంపెనీలకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడంతో ఈ రంగానికి చెందిన షేర్లు రాణించాయి. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 5% ఎగిసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 8.5% ఎగసి రూ.60 వద్ద స్థిరపడింది. డోల్వీ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడంతో జేఎస్‌డబ్ల్యూ షేరు 8% లాభంతో రూ.505 వద్ద ముగిసింది. టాటా స్టీల్ షేరు 6% లాభపడి రూ.859 వద్ద స్థిరపడింది. మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓ ధర రూ. 483–486 న్యూఢిల్లీ: గతంలో లోధా డెవలపర్స్‌గా కార్యకలాపాలు సాగించిన రియల్టీ దిగ్గజం మాక్రోటెక్ డెవలపర్స్ ఈ నెల 7న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 9న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 483–486గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్ల వరకూ రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. -
మళ్లీ బుల్ పరుగు..!
ముంబై: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో స్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ రికార్డుల బాట పట్టింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త శిఖరాలపైన ముగిశాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి తొలిసారి 52 వేల శిఖరంపైన 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 15,314 వద్ద నిలిచింది. మార్కెట్ రికార్డు ర్యాలీలోనూ ఐటీ, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 692 పాయింట్లు లాభపడి 52,236 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 15,340 వద్ద కొత్త జీవికాల గరిష్టాలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.1.22 లక్షల కోట్లను ఆర్జించగలిగారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.205.14 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 72.68 వద్ద స్థిరపడింది. ఏడు ట్రేడింగ్ సెషన్‌ల్లో 1154 పాయింట్లు... ఈ ఫిబ్రవరి 5న సెన్సెక్స్ సూచీ తొలిసారి 51000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే సూచీ 1154 పాయింట్లను ఆర్జించి సోమవారం 52,154 వద్ద ముగిసింది. ఇదే ఏడాది జనవరి 07న సెన్సెక్స్ 50000 స్థాయిని అధిగమించింది. కాగా 50వేల నుంచి 51 వేల స్థాయికి చేరుకునేందుకు 11 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్ల అనూహ్య ర్యాలీతో ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ మూడు శాతానికి పైగా లాభపడి జీవితకాల రికార్డు స్థాయి 37306 వద్ద ముగిసింది. ► నిఫ్టీ–50 ఇండెక్స్‌లో మొత్తం ఏడు స్టాకులు ఏడాది గరిష్టాన్ని తాకగా.., అందులో ఐదు స్టాక్‌లు ఆర్థిక రంగానికి చెందినవి కావడం విశేషం. ► యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం ర్యాలీ చేశాయి. ► మెరుగైన క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో అపోలో హాస్పిటల్ షేరు 12 శాతం లాభపడి ఏడాది గరిష్టానికి ఎగసింది. ► ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో అమరరాజా బ్యాటరీస్ ఆరు శాతం పతనమై, రూ.928 వద్ద ముగిసింది. మార్కెట్ ఉత్సాహానికి కారణాలు... ► మెరుగైన ఆర్థిక గణాంకాలు... గత వారాంతంలో వెలువడిన డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ను మెప్పించాయి. పారిశ్రామికోత్పత్తి ఆశించిన స్థాయిలో నమోదుకాగా., రిటైల్ ద్రవ్యోల్బణమూ దిగివచ్చింది. అలాగే సోమవారం విడుదలైన జనవరి హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లు 2.03 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఆర్బీఐ ఇక ఇప్పట్లో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ► కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. యూఎస్ బాండ్ ఈల్డ్ గతేడాది మార్చి తర్వాత పెరిగింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆమోదానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫలితంగా గత శుక్రవారం అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. ఒక సోమవారం జపాన్ ఇండెక్స్ నికాయ్ రెండు శాతం లాభపడి 1990 తర్వాత తొలిసారి 30వేల స్థాయిని తాకింది. సింగపూర్, థాయిలాండ్, దక్షిణ కొరియా దేశాలు అరశాతం నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు సైతం రెండుశాతం ఎగిశాయి. ► మెప్పించిన కార్పొరేట్ ఫలితాలు... కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ముగిసింది. ఆర్థిక పురోగతిపై ఆశలు, పండుగ సీజన్లో నెలకొన్న డిమాండ్ లాంటి అంశాలు కలిసిరావడంతో ఈ క్యూ3 లో కంపెనీలు రెండింతల వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్యూ3లో సుమారు 3087 కంపెనీల సరాసరి నికరలాభం 69 శాతం పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది. ► కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు... భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) బుల్లిష్ వైఖరిని కలిగి ఉండటం కూడా సూచీల రికార్డు ర్యాలీకి కొంత తోడ్పడింది. దేశీయ మార్కెట్లో ఈ ఫిబ్రవరి 15 నాటికి ఎఫ్ఐఐలు రూ.20,700 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. కేంద్ర బడ్జెట్ మెప్పించడం, వడ్డీరేట్లపై ఆర్బీఐ సులభతర వైఖరి, లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ప్రపంచ దేశాల్లోకెల్లా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం తదితర కారణాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. -
నిఫ్టీ @ 15000
ముంబై: ట్రేడింగ్‌లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం చివరికి లాభాలతోనే ముగిశాయి. ఇంట్రాడేలో 51 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 50,732 వద్ద స్థిరపడింది. అలాగే తొలిసారి 15000 స్థాయిని తాకిన నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 14,924 వద్ద నిలిచింది. సూచీలకిది అయిదో రోజు లాభాల ముగింపు. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఐటీ, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. వరుస ర్యాలీతో జోష్ మీదున్న సూచీలు ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 51 వేల స్థాయిని, నిఫ్టీ 15 వేల మార్క్‌ను అందుకున్నాయి. అనంతరం... ఊహించినట్లుగానే ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 508 పాయింట్ల రేంజ్లో 50,565 – 51,073 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 150 పాయింట్ల పరిధిలో 14,865 – 15,015 స్థాయిలో ట్రేడైంది. ఈ వారంలో సెన్సెక్స్ 4446 పాయింట్లు, నిఫ్టీ 1289 పాయింట్లను ఆర్జించాయి. గతేడాది ఏప్రిల్ 10తో ముగిసిన వారం తర్వాత సూచీలు అత్యధికంగా లాభపడిన వారం ఇదే. ‘‘మంచి వ్యాల్యూమ్స్ మద్దతుతో మార్కెట్ పటిష్టమైన స్థితిలో ముగిసింది. నిఫ్టీకి 15,000 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఇప్పటికీ బుల్లిష్ వైఖరినే కలిగి ఉన్నాము. త్వరలో నిఫ్టీ 15200 స్థాయికి చేరుకోవచ్చు. పతనమైన ప్రతిసారి కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేస్తే మంచింది.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ నిపుణుడు రుస్మిక్ ఓజా సలహానిస్తున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► డిసెంబర్ క్వార్టర్లో ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని ఎస్బీఐ ప్రకటించడంతో ఈ బ్యాంకు షేరు 11% లాభంతో రూ.393 వద్ద ముగిసింది. ► ఫిబ్రవరి 11న జరిగే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్ ప్రకటనపై చర్చిస్తామని ఐటీసీ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ షేరు రెండు శాతం లాభపడింది. ► క్యూ3 లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేరు 20% లాభపడింది. -
మార్కెట్‌కు వ్యాక్సిన్..!
వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో సూచీలు ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 46,618 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల పెరుగదలతో 13,759 వద్ద మొదలయ్యాయి. ఆరురోజుల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో సూచీలు ముందడుగు వేసేందుకే మొగ్గుచూపాయి. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాలు ఒక్కొక్కటి మార్కెట్‌ను మెప్పిస్తుండటంతో సూచీల జోరు మరింత పెరిగింది. బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వృద్ధికి ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 2478 పాయింట్లు పెరిగి 48,764 వద్ద, నిఫ్టీ 702 పాయింట్ల లాభంతో 14,336 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తుదిదాకా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో చివరికి సెన్సెక్స్ 2,315 పాయింట్లు పెరిగి 48,601 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281 వద్ద ముగిసింది. గతేడాది ఏప్రిల్ 7 తర్వాత సూచీలకిది ఒకరోజులో అతిపెద్ద లాభం కావడం విశేషం. సూచీల భారీ లాభార్జనతో గత ఆరు రోజుల్లో కోల్పోయిన మొత్తం నష్టాల్లో 60 శాతాన్ని తిరిగిపొందాయి. లాభాలే.. లాభాలు.. సీతమ్మ పద్దును స్టాక్ మార్కెట్ స్వాగతించడంతో బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు లాభాల వర్షంలో తడిసి ముద్దయ్యారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులో రూ.6.34 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. తద్వారా బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్క్యాప్ రూ.192.46 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రంగాల షేర్లు ఎందుకు దూసుకెళ్లాయంటే... ► బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీతో పాటు, ఆస్తుల నిర్వహణ కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ.22 వేల కోట్ల రీ–క్యాపిటలైజేషన్ను ప్రకటించారు. ఫలితంగా ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు షేర్లు 15 శాతం నుంచి 11 శాతం లాభపడ్డాయి. ఆర్బీఎల్, యాక్సిస్, పీఎన్బీ, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 6 నుంచి 11 శాతం ర్యాలీ చేశాయి. ► జీవిత బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ఈ రంగానికి చెందిన షేర్లు 12 శాతం నుంచి 4 శాతం లాభపడ్డాయి. ► కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ.1.80 లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రకటించడంతో మౌలిక సదుపాయ రంగ కంపెనీలైన ఎన్సీసీ లిమిటెడ్, అశోకా బిల్డ్‌కాన్, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్చన్స్, దిలీప్ బిల్డ్‌కాన్ షేర్లు 14 శాతం నుంచి 5 శాతం లాభపడ్డాయి. ► కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామనే ప్రకటనతో ఆటో షేర్ల ర్యాలీ కొనసాగింది. కొత్త వాహనాలకు గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఆశలతో వాహన రంగ షేర్లు 10 శాతం వరకు లాభపడ్డాయి. వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. భారత ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి పెంచేందుకు కేంద్ర బడ్జెట్ పునాది వేసింది. మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణాన్ని మరింత పరిపూర్ణం చేయనుంది. పీఎస్‌యూ బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్‌తో దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో స్థిరత్వం కోవిడ్ ఆర్థిక వృద్ధికి, ఈక్విటీ మార్కెట్లకు కలిసొస్తుంది. – విజయ్ చందోక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ బడ్జెట్ స్వరూపం వృద్ధి ప్రాధాన్యతను కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ, ఆటో స్క్రాపేజీ పాలసీ, అసెట్ మోనిటైజేషన్ అంశాలు మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 5న వెలువడే ఆర్బీఐ పాలసీ విధాన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. – నీలేశ్ షా, కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్మెంట్ ఎండీ -
డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 16 శాతం మేర పెంచుకుంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగిందని శనివారం విడుదల చేసిన ఫలితాల్లో వె ల్లడించింది. ఏకీకృత లాభంలో సంవత్సరానికి 16.4 శాతం వృద్ధితో రూ .446.97 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 384.04 కోట్ల రూపాయలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 10.8 శాతం పెరిగి 7,542 కోట్ల రూపాయలకు చేరుకోగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ వృద్ధి 42.1 శాతంగా ఉంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా ఈ త్రైమాసికంలో మెరుగ్గానే ఉన్నాయి. ఇబిఐటిడిఎ ముందు ఆదాయాలు సంవత్సరానికి 15.5 శాతం పెరిగి రూ .689.12 కోట్లకు చేరుకున్నాయి. వార్షికంగా మార్జిన్ విస్తరణ 9.14 శాతంగా ఉంది. పండుగ షాపింగ్ డిమాండ్ మునుపటి రెండు త్రైమాసికాల కంటే మెరుగైన త్రైమాసిక లాభాలును అందించిందని సంస్థసీఎండీ నెవిల్లే నోరోన్హా చెప్పారు. ఎఫ్ఎంసిజియేతర రంగం నుండి సప్లయ్ కొరత, ముడిసరుకు ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. అయితే పరిస్థితిలో కొంత మెరుగుదల ఉన్నా , సమీప కాలంలో అమ్మకాలు మిశ్రమంగా ఉంటాయని, ఇది మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. -
అదరగొట్టిన టీసీఎస్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలకు తగినట్టుగానే మూడవ త్రైమాసికంలో నికర లాభాలు 7.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో 8701 కోట్ల రూపాయలను నికర లాభాలను ఆర్జించగా, అందుకుముందు ఏడాది ఇదే కాలంలో టీసీఎస్ నికర లాభం 8118కోట్లుగా ఉంది. ఆదాయం కూడా 5.4 శాతం ఎగిసి 42,015 కోట్లుగా ఉందని టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం 39,854 కోట్ల రూపాయలు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత సంస్థ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత తొమ్మిదేళ్లలో 9 సంవత్సరాలలో బలమైన వృద్ధిని సాధించిన డిసెంబర్ క్వార్టర్ ఇదేనని తెలిపింది. అలాగే ఈక్విటీ షేరుకు రూ .6 మూడవ తాత్కాలిక డివిడెండ్‌ను టీసీఎస బోర్డు ప్రకటించింది. (రికార్డుల మోత, టెక్ మహీంద్ర ఘనత) కోర్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్, సంస్థ చేసుకున్న మునుపటి ఒప్పందాలు డిసెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలకు తోడ్పడిందని టీసీఎస్ సీఈఓ,మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. తమ మార్కెట్ ప్లేస్ గతం కంటే బలంగా ఉన్న నేపథ్యంలో సరికొత్త ఆశావాదంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. -
2021కి...లాభాలతో స్వాగతం...
ముంబై: స్టాక్ మార్కెట్ 2021 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికింది. ఐటీ, ఆటో, ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించడంతో కొత్త ఏడాది తొలిరోజున రికార్డుల పర్వం కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారమూ లాభాలతో ముగిశాయి. జీఎస్టీ అమలు తర్వాత ఈ డిసెంబర్లో ఒక నెలలో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు వసూళ్లను సాధించడంతో పాటు ఆటో కంపెనీలు వెల్లడించిన వాహన విక్రయ గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అలాగే భారత్‌లో ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించవచ్చనే వార్తలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 47,869 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,018 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 229 పాయింట్లు లాభపడి 47,980 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,050 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు నూతన గరిష్టాలను తాకిన తరుణంలోనూ ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 269 పాయింట్లను ఆర్జించింది. ఆటో షేర్ల లాభాల పరుగులు... డిసెంబర్లో అంచనాలకు తగ్గట్టుగానే వాహన విక్రయాలు జరిగాయని ఆటో కంపెనీలు ప్రకటించాయి. దీనికి తోడు ఇటీవల పలు ఆటో కంపెనీలు తమ వాహనాలపై పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు 4 నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ లిస్టింగ్ విజయవంతం... గతేడాదిలో చివరిగా ఐపీఓను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు ఎక్ఛ్సేంజీల్లో లాభాలతో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 36% ప్రీమియం ధరతో రూ. 436 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో 55 శాతానికి పైగా లాభపడి రూ.489.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరకు 29 శాతం లాభంతో రూ.407 వద్ద స్థిరపడ్డాయి. మునిసిపల్ సోలిడ్ వేస్ట్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి. -
రెండో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ షేర్ల అండతో సూచీలు రెండోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 437 పాయింట్ల లాభంతో 46,444 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,601 వద్ద ముగిసింది. వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ రూపాయి బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే కొత్తగా వెలుగులోకి వచ్చిన స్ట్రైయిన్ వైరస్‌ను కోవిడ్–19 వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని దిగ్గజ ఫార్మా కంపెనీలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ ఒకదశలో 506 పాయింట్లు లాభపడి 46,513 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 291 పాయింట్ల ర్యాలీ చేసి 13,619 స్థాయిని తాకింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అధికంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి. రెండురోజులుగా జరిగిన కొనుగోళ్లతో సూచీలు సోమవారం కోల్పోయిన నష్టాలను దాదాపు తిరిగి పొందాయి. అలాగే మార్కెట్ పాజిటివ్ అవుట్‌లుక్ చెక్కుచెదరలేదని స్పష్టమైంది. దేశీయ ట్రేడింగ్ ప్రభావితం చేయగల ప్రపంచమార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. ఇక డాలర్ మారకంలో రూపాయి 8 పైసలు బలపడి 73.76 స్థాయి వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.537 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఫండ్లు(డీఐఐలు) రూ.1326 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఐటీ షేర్లకు భలే గిరాకీ... అంతర్జాతీయ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ యాక్సెంచర్ ఫలితాల ప్రకటన నాటి నుంచి ఐటీ షేర్లకు మంచి డిమాండ్ నెలకొంది. యాక్సెంచర్ ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో పాటు మెరుగైన అవుట్‌లుక్‌ను ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఇక దేశీయంగా విప్రో, ఇన్ఫోసిస్ పెద్ద ఐటీ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి విప్రో కంపెనీ 700 మిలియన్ డాలర్ల డీల్‌ను కుదుర్చుకుంది. అలాగే రూ.9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. ఈ సానుకూల పరిణామాలతో బుధవారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎమ్ఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. బ్రెగ్జిట్, లాక్డౌన్ ప్రభావాలే కీలకం... మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో కొత్త వైరస్ స్ట్రైయిన్ భయాలు, లాక్డౌన్ ఆందోళనలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు వంటి ప్రతికూలతను విస్మరించి మార్కెట్ ముందుకు కదులుతుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. త్వరలో ఖరారు కానున్న బ్రెగ్జిట్ ఒప్పందాలు, లాక్డౌన్ వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ఏమేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు. 15 రెట్లు సబ్‌స్క్రైబైన ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ చివరి తేది నాటికి 15 రెట్ల సబ్‌స్క్రిబ్షన్‌ను సాధించింది. ఇష్యూ లో భాగంగా కంపెనీ జారీ చేసిన 66.66 లక్షల షేర్లకు గానూ.., 10.02 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 9.67 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 18.69 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 16.55 రెట్ల బిడ్లు దాఖలమైనట్లు ఎన్ఎస్ఈ గణాం కాలు తెలిపాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.300 కోట్లను సమీకరించింది. ఇష్యూ ధర శ్రేణి రూ.313–315గా ఉంది. జనవరి 1న షేర్లు ఎక్సే్ఛంజీల్లో లిస్టు కానున్నాయి. -
ఆరో రోజూ లాభాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి అరగంటలో నెలకొన్న కొనుగోళ్లు సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 46,961 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా ఆరురోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 396 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 114 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ.2,720 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐ) రూ.2,424 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 862 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకు ఇది ఏడోవారమూ లాభాల ముగింపు కావడం విశేషం. స్టాక్ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీలను నడిపిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలు, బ్రెగ్జిట్ పురోగతి, అమెరిక ఉద్దీపన ఆశలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారని బినోద్ పేర్కొన్నారు. ఇంట్రాడేలో 47,000 స్థాయికి సెన్సెక్స్... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ తొలిసారిగా 47,000 పైన, నిఫ్టీ 13,750 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఉదయం సెషన్లో అనూహ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 260 పాయింట్లు నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయాయి. ఆదుకున్న ఐటీ షేర్లు... ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ నవంబర్‌తో ముగిసిన క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో దేశీయ లిస్టెడ్ ఐటీ కంపెనీ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 2% ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. -
నష్టాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 604 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి. ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి. ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్... స్పైస్‌జెట్ కంపెనీ షేరు బీఎస్ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది. బర్గర్ కింగ్ లిస్టింగ్ సోమవారం: గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్ కింగ్ షేర్లు సోమవారం స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
ఫండ్స్‌లో వరుసగా ఆరో నెలా అమ్మకాలే
న్యూఢిల్లీ: మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వరుసగా ఆరో నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో (ఎంఎఫ్) అమ్మకాలు కొనసాగాయి. నవంబర్‌లో ఈక్విటీల నుంచి 30,760 కోట్ల పెట్టుబడులను ఫండ్స్ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి ఇప్పటిదాకా రూ. 68,400 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ జరిగింది. అయితే, ఇతరత్రా వచ్చిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తొలి 11 నెలల్లో (జనవరి–నవంబర్) నికరంగా రూ. 28,000 కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. ఇదే వ్యవధిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 1.08 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలు ఎలా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐల ఊతంతో మార్కెట్లు గత కొద్ది నెలలుగా పెరుగుతూనే వచ్చాయి. ‘మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరడం, నిఫ్టీ వేల్యుయేషన్ 36 రెట్ల స్థాయికి చేరడం వంటి అంశాల కారణంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. సెప్టెంబర్–అక్టోబర్‌తో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా పెరగడం ఇందుకు నిదర్శనం‘ అని ప్రైమ్‌ఇన్వెస్టర్‌డాట్‌ఇన్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే దాకా ఈ ధోరణి కొనసాగవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లు కరెక్షన్కు లోనైనా, దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపించినా ఫండ్లు మళ్లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టొచ్చని మార్నింగ్‌స్టార్ ఇండియా డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ తెలిపారు. -
ఎల్ఐసీ.. షంషేర్!
కరోనా కల్లోలం ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. కానీ ఎల్ఐసీకి మాత్రం స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండించింది. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవరీ అయి ప్రస్తుతం జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లు సృష్టిస్తోంది. మార్కెట్ పతన సమయంలో కొని, పెరుగుతున్నప్పుడు విక్రయించే ‘కాంట్రా’ వ్యూహాన్ని అమలు చేసే ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయికి చేరాయి. కల్లోల కంపెనీల నుంచి వైదొలగడం, వృద్ధి బాటన ఉన్న కంపెనీల్లో వాటాలను పెంచుకోవడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోంది. ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... భారత్‌లో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీనే. ఈ జీవిత బీమా దిగ్గజం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఈ ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లోని టాప్ 200 కంపెనీల్లో ఎల్‌ఐసీకున్న వాటాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 7,700 కోట్ల డాలర్లకు ఎగసిందని అంచనా. సెప్టెంబర్ నుంచి చూస్తే, మార్కెట్ 12 శాతం మేర పెరిగింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగాయి. వీటి విలువ ప్రస్తుతం 8,600 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.6.45 లక్షల కోట్లు) పెరిగి ఉండొచ్చని అంచనా. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. దీంతో 2018 మార్చినాటి 8,400 కోట్ల డా లర్ల అత్యధిక ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ బ్రేక్ అయినట్లే. ఆర్నెల్లలో 40 శాతం అప్... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ బాగా నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 5,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఆశాజనక వార్తలు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ప్రస్తుతం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రికవరీ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 40 శాతం (2,200 కోట్ల డాలర్లు–లక్షన్నర కోట్లకు మించి)ఎగసి 7,700 కోట్ల డాలర్లకు(రూ.5.7 లక్షల కోట్లకు )చేరింది. కంపెనీల్లో ఎల్ఐసీ వాటా పెరగడం, కంపెనీల్లో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. జూన్ 30 నాటికి ఎల్ఐసీకి దాదాపు 329 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం షేర్లలో 96 శాతం సానుకూల రాబడులనిచ్చాయి. ఎల్ఐసీ...మంచి కాంట్రా ప్లేయర్! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షేర్లలో ఇప్పటివరకూ రూ.55,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఎల్ఐసీ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి రూ. 32,800 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎల్ఐసీకి మంచి కాంట్రా ప్లేయర్ అనే పేరు ఉంది. అంటే మార్కెట్ పతనసమయంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరుగుతున్న సమయంలో అమ్మేసి లాభాలు చేసుకుంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ 40% పతనం కావడం, వెంటనే రికవరీ కావడం కూడా ఎల్ఐసీకి కలసివచ్చింది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చూస్తే రూ.10,000 కోట్ల లాభం ఆర్జించామని ఎల్ఐసీ చైర్మన్ ఎమ్ఆర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులోనే వెల్లడించారు. ఇక ఇప్పుడు స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతుండటంతో ఎల్ఐసీకి భారీ లాభాలు వచ్చి ఉంటాయని నిపుణుల అంచనా. బీమా కంపెనీలకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమని నిపుణుల అభిప్రాయం. అందుకే నాణ్యత గల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోందని వారంటున్నారు. తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి ఎల్ఐసీ తన వాటాలను తగ్గించుకుంటోంది. అధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతోంది. 1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న 33 కంపెనీల నుంచి వైదొలగింది. గతంలో యస్‌బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా 8 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆరంభమైందో, ఆ బ్యాంక్‌లో తన వాటాను ఎల్ఐసీ 1.64%కి తగ్గించుకుంది. యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐతో సహా మరిన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు పెట్టుబడులు పెట్టడంతో మళ్లీ యస్‌బ్యాంక్‌లో వాటాను 4.99%కి పెంచుకుంది. మరోవైపు మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సూమర్, శ్రీ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల్లో తన వాటాను మరింతగా పెంచుకుంది. మెగా ఐపీఓకు రంగం సిద్ధం... భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా దాదాపు 76%. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఎల్ఐసీ ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఎల్ఐసీ విలువ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల రేంజ్లో ఉం డొచ్చని భావిస్తున్నారు. -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లను ఆర్జించి 12,859 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రికవరీ, ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం తదితర మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కలిసొచ్చింది. చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 413 పాయింట్ల వరకు ఎగసి 44,013 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 12,892 – 12,771 రేంజ్లో కదలాడింది. మీడియా, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3860.78 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రిలయన్స్ షేరుకు నాలుగో నష్టాలే... రిలయన్స్ షేరు వరుసగా నాలుగో రోజూ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మేందుకే మొగ్గు చూపడంతో ఒక దశలో 4% నష్టపోయి రూ.1895 వద్ద రూ.1895 కనిష్టాన్ని తాకింది. చివరికి 3.50% క్షీణించి రూ.1899 వద్ద స్థిరపడింది. ఇండస్ టవ ర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ టవర్ల వ్యాపార విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించడంతో ఎయిర్టెల్ షేర్లు 3% లాభంతో రూ.483.50 వద్ద ముగిసింది. గ్లాండ్ ఫార్మా లిస్టింగ్... గ్రాండ్! ముంబై: ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ మార్కెట్ అరంగ్రేటం అదిరిపోయింది. ఇష్యూ ధర (రూ.1,500)తో పోలిస్తే బీఎస్ఈలో 13 శాతం లాభంతో రూ.1,701 వద్ద లిస్ట్య్యింది. కరోనా రాకతో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజక్టబుల్ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఆçసక్తి చూపారు. ఒక దశలో 23 శాతం పెరిగి రూ.1,850 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరికి 21 లాభంతో రూ.1,820 వద్ద ముగిశాయి. హైదరాబాద్ ఆధారిత ఈ గ్లాండ్ ఫార్మా కంపెనీ రూ. 1,500 ధరతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,480 కోట్లను సమీకరించింది. -
మార్కెట్‌కు బైడెన్ జోష్
ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆరుశాతం పెరిగిన ఎస్బీఐ షేరు ఎస్బీఐ షేరు గురువారం బీఎస్ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్ సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది. -
పండుగ సీజన్ టేకాఫ్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నేపథ్యంలో జూలై వరకు రిటైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను చవిచూసింది. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఆగస్టు నుంచి క్రమంగా మార్కెట్లో కదలిక వచ్చింది. ఏడాదిలో 30–40 శాతం దాకా విక్రయాలను అందించే పండుగల సీజన్ ఈసారి మహమ్మారి కారణంగా ఎలా ఉంటుందో అన్న ఆందోళన వర్తకుల్లో వ్యక్తం అయింది. అయితే అందరి అంచనాలను మించి ఆఫ్లైన్లోనూ అమ్మకాలు జరగడం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ నుంచి పుంజుకున్న సేల్స్‌కు ఫెస్టివ్ జోష్ తోడైంది. దీంతో దసరాకు ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, అపారెల్, ఆటోమొబైల్ వంటి రంగాలు మెరిశాయి. దసరా టేకాఫ్ అదిరిందని, దీపావళికి సైతం ఈ ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. పెరిగిన నగదు కొనుగోళ్లు.. ఆన్లైన్ క్లాసుల మూలంగా పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్స్ విక్రయాలు సాగాయి. కొత్త మోడళ్ల రాక జోష్‌ను నింపింది. మహమ్మారి కారణంగా పండగల సీజన్లోనూ మందగమనం ఉంటుందని భావించామని సెల్ పాయింట్ ఎండీ పి.మోహన్ ప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘గతేడాదితో పోలిస్తే ఈ దసరాకు మొబైల్ ఫోన్ల విక్రయాలు 5 శాతం వృద్ధి సాధించాయి. ఈఎంఐల వాటా సగానికి తగ్గి 25 శాతానికి వచ్చింది. అయినప్పటికీ కస్టమర్లు నగదుతో కొనుగోళ్లు జరిపారు. నగదు కొనుగోళ్లు 15 నుంచి 40 శాతానికి చేరాయి. దీపావళి సేల్స్ 10 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని చెప్పారు. ధర పెరగకపోవడంతో.. ప్యానెళ్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధర 5–7 శాతం వరకు అధికమవుతుందని అందరూ భావించారు. ఈ సీజన్లో ధర పెరగకపోవడం కస్టమర్లకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్ వరకు వీటి విక్రయాలు పరిశ్రమలో 50 శాతమే. గతేడాదితో పోలిస్తే దసరాకు 90 శాతం సేల్స్ జరిగాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్ట్నర్ పి.భాస్కర మూర్తి తెలిపారు. దీపావళి గతేడాది స్థాయిలో ఉంటుందని అన్నారు. కంపెనీలు క్యాష్ బ్యాక్, బహుమతులు, ఇతర ఆఫర్లను అందిస్తున్నాయని వివరించారు. దిగుమతులపై ఆధారపడ్డ చాలా మోడళ్ల కొరత ఉందని వెల్లడించారు. అటు వస్త్ర పరిశ్రమ 90 శాతం వరకు పుంజుకుందని సమాచారం. వివాహాలు కూడా ఉండడంతో డిసెంబర్ దాకా మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని లినెన్ హౌజ్ డైరెక్టర్ వొజ్జ తిరుపతిరావు అన్నారు. దూసుకెళ్లిన వాహనాలు.. అక్టోబర్‌లో దాదాపు అన్ని కంపెనీలు ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాల్లో వృద్ధిని సాధించాయి. 2019తో పోలిస్తే ఈ దసరాకు ద్విచక్ర వాహన అమ్మకాలు తెలంగాణలో 10 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం అధికమయ్యాయి. కార్లు తెలంగాణలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 22 శాతం ఎక్కువయ్యాయి. దీపావళికి కార్లు, ద్విచక్ర వాహనాల సేల్స్ ఇరు రాష్ట్రాల్లో 10–15 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.రామ్ తెలిపారు. కరోనా విస్తృతి వేళ ఈ స్థాయి అమ్మకాలనుబట్టి చూస్తే పెద్ద రికవరీ జరిగిందని ఆయన అన్నారు. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.4,600 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్ క్వార్టర్లో అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్‌ను బంధన్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్ నష్టం(ఈసీఎల్) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్డీఎఫ్సీ వైస్–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల... కేవలం మార్ట్గేజ్ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్డీఎఫ్సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.754 కోట్లు. హెచ్డీఎఫ్సీ షేరు సోమవారం బీఎస్ఈలో 6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ..
ముంబై: ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలను ప్రతిబింబిస్తూ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లు నెలకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కూడా ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా సూచీల మూడురోజుల నష్టాలకు సోమవారం చెక్ పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద నిలిచింది. లాక్డౌన్ తర్వాత తొలిసారి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లను దాటడంతో పాటు ఇదే నెలలో ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండింతల వృద్ధిని సాధించాయి. దీంతో వ్యవస్థలో తిరిగి డిమాండ్ ఊపందుకుందనే సంకేతాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మరోవైపు ప్రపంచమార్కెట్లు నెలరోజుల కనిష్టం నుంచి కోలుకోవడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. చైనాతో పాటు ఐరోపా దేశాలు మెరుగైన తయారీ రంగ గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ 11,726– 11,557 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రూ.లక్ష కోట్లకు పైగా రిలయన్స్ సంపద ఆవిరి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9 శాతం పతనంతో కంపెనీ రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో షేరు 9.50 శాతం నష్టపోయి రూ.1,860 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. చివరికి 9% నష్టంతో రూ.1,877 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంలో కంపెనీ రూ.1.19లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్‌ను నష్టపోయింది. ఆరుశాతం పెరిగిన ఐసీఐసీఐ షేరు రెండో త్రైమాసికంలో ఐసీసీఐసీఐ నికరలాభం నాలుగు రెట్లు పెరగడంతో బ్యాంకు షేరు సోమవారం 6శాతం లాభంతో రూ.417 వద్ద ముగిసింది. దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు సోమవారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కరోనా సంబంధిత కేటాయింపులు తక్కువగా ఉండడంతో పాటు ఆదాయ వృద్ధి పెరగడంతో ఈ ద్వితియా క్వార్టర్లో కంపెనీ రూ.4,882 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.16,957 కోట్లు పెరిగి రూ.2,87,668 వద్ద స్థిరపడింది. నిరాశపరిచిన ఈక్విటాస్ లిస్టింగ్... ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపరచింది. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 6 శాతం తక్కువగా రూ.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 9 శాతం నష్టపోయి రూ.30.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ తర్వాత బ్యాంకింగ్ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతులో భాగంగా నష్టాలను తగ్గించుకోగల్గింది. చివరికి 1 శాతం నష్టంతో రూ.32.75 వద్ద స్థిరపడింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 32 పైసలు పతనంతో 74.42 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో రూపాయి ఇంత తక్కువ స్థాయిని చూడలేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ల కోసం డిమాండ్ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో వృద్ది నమోదైంది. దీంతో మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో భారీగా లాభపడిన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు) ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు) గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 720 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 720 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 30 శాతం తగ్గింది. కొన్ని ఉత్పత్తులను అవుట్–లైసెన్సింగ్ చేయడం, పన్నుపరమైన ప్రయోజనాలు వంటివి కూడా గతంలో కలిపి చూపించిన నేపథ్యంలో .. దానితో పోల్చితే తాజా క్యూ2లో లాభం తగ్గిందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమేన్ చక్రవర్తి తెలిపారు. ఉత్పాదకత మెరుగుపడటం, సానుకూల విదేశీ మారక రేట్ల ఊతంతో స్థూల లాభాల మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉత్పత్తులతో పాటు కోవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు ఉన్న పలు ఔషధాలపై తమ పరిశోధన బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఆర్ఎల్ సహ చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. n కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర అంశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,980 కోట్లుగా నమోదైంది. n ఉత్తర అమెరికా మార్కెట్ 28% పెరిగి రూ. 1,830 కోట్లకు చేరింది. విదేశీ మారకం రేటు అనుకూలత, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడింది. n యూరప్ ఆదాయాలు 36% పెరిగి రూ. 380 కోట్లకు చేరాయి. కొత్తగా ఆస్ట్రియా మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 4% వృద్ధితో రూ. 860 కోట్లకు చేరింది. రూబుల్ బలహీనపడటం రష్యాలో ఆదాయంపై ప్రభావం చూపింది. n భారత్ మార్కెట్లో ఆదాయం 21 శాతం వృద్ధి చెంది రూ. 910 కోట్లకు చేరింది. వొకార్డ్ వ్యాపారం కొనుగోలు, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు తోడ్పడ్డాయి. n ఫార్మాసూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 850 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 4,950 వద్ద క్లోజయ్యింది. సైబర్ దాడి ప్రభావమేమీ లేదు అక్టోబర్ 22న కంపెనీ సర్వర్లపై సైబర్ దాడులు చోటుచేసుకోవడంపై చక్రవర్తి స్పందించారు. దీనిపై సత్వరం బైటి సైబర్ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నామని, కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడ్డామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకానైతే తమ విచారణలో డేటా చౌర్యం వంటివేమీ జరిగిన దాఖలాలేమీ బైటపడలేదని చక్రవర్తి వివరించారు. కోవిడ్–19 టీకా స్పుత్నిక్ వి రెండో దశ ట్రయల్స్ డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పరిస్థితులను బట్టి మూడో దశ పరీక్షలు మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. మరోవైపు, సౌమేన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎఫ్‌వోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 1న అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. -
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి. పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్.. నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి. ‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్.. మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్ అయినా లాభాలే
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు సూచీలను లాభాల బాట పట్టించాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 40,707 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లను ఆర్జించి 11,938 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 4వ రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 826 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 242 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. ఆరంభం ఆదిరింది... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతను అందుకున్న మార్కెట్ భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 40,767 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,958 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ రావచ్చనే అంచనాలతో ఉదయం సెషన్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,976 వద్ద, నిఫ్టీ 12,000 మార్కును అందుకొని 12,019 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మిడ్‌సెషన్‌లో అమ్మకాల సునామీ... మిడ్‌సెషన్ వరకు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో టీసీఎస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో సెనెక్స్ గరిష్టస్థాయి 40,976 నుంచి ఏకంగా 826 పాయింట్లను కోల్పోయి 40,150 కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టస్థాయి 12,018 నుంచి 242 పాయింట్లు నష్టపోయి 11,776 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. -
మార్కెట్ మళ్లీ లాభాల బాట...
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్ 449 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. పడిపోయిన క్రూడాయిల్ ధరలు కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. మరోవైపు అటో, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది. పీఎస్‌యూ షేర్లకు బైబ్యాక్ బూస్టింగ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఇంజనీరింగ్స్ ఇండియాతో సహా మొత్తం 8 కంపెనీలను బైబ్యాక్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్రం కోరినట్లు వచ్చిన వార్తలతో ఇంట్రాడేలో పీఎస్‌యూ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గెయిల్ 4 శాతానికి పైగా లాభపడింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు 3 నుంచి 2 శాతంతో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో పీఎస్‌యూ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో ముగిసింది. ఎగసి‘పడిన’ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు... మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో భారీ లాభంతో మొదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మార్కెట్ ముగిసేసరికి 0.35% స్వల్ప లాభంతో రూ.1203.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు... చైనా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. కరోనా పతనం నుంచి వేగంగా రికవరీని సాధిస్తూ ఈ త్రైమాసికపు ఆర్థిక వృద్ధి 4.9%గా నమోదైంది. ఫలితంగా సోమవారం ఆసియా మార్కెట్లు 1.5% పైగా లాభంతో ముగిశాయి. అయితే చిత్రంగా చైనా మార్కెట్ అరశాతం నష్టపోయింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు. షేరు డౌన్..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వేతనాల పెంపు.. అక్టోబర్ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు.