
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలు చెక్ చెప్పడంతోపాటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ రికార్డుల మోత మోగింది. కీలక సూచీ సెన్సెక్స్ 40,600, నిఫ్టీ 12వేల పాయింట్ల స్థాయిని టచ్ చేసాయి. సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 40470 వద్ద రికార్డు ముగింపునిచ్చింది. నిఫ్టీ కూడా 49పాయింట్ల ఎగిసి 11967 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్,బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. అయితే ఆరోపణలపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వివరణ ఇవ్వడంతో ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెడ్‌ఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు లాభపడగా, టైటన్, భారతిఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతి సుజుకి నష్టపోయాయి.