ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు సజీవం
మార్కెట్లో ఉరకలేసిన ఉత్సాహం
539 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
22 వేల స్థాయి పైకి నిఫ్టీ
రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్‌ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది.
క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం
క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment