Stock indexes
-
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్‌సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్‌వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్‌వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్‌పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్‌పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్‌యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్‌లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్‌ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. -
మార్కెట్ చూపు ఫెడ్ వైపు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య కమిటీ విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్, భారత్ బాండ్లపై రాబడులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే వచ్చే వారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్లాట్‌ఫామ్ నార్తెర్న్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓల సబ్‌స్క్రిబ్షన్‌తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయ ఆగస్టు టోకు ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఫెడ్ కమిటీ ఆర్థిక అంచనాలు, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్స్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం విడుదల కానుంది అదే రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. క్రూడాయిల్ ధరలూ కీలకం ద్రవ్యోల్బణంతో పాటు ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే క్రూడాయిల్ ధరలూ ఈ వారం కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ధరలు 14 నెలల కనిష్టం వద్ద ట్రేడవుతున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71.61 డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే దేశమైన భారత్‌కు ఇది సానుకూల అంశంగా మారింది.ఫెడ్ నిర్ణయాలపై దృష్టివడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళవారం(సెపె్టంబర్ 17న) మొదలవుతాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రథమార్థంలో రూ.27,856 కోట్లుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ ప్రథమార్థం(1–15న) విదేశీ ఇన్వెస్టర్లు రూ.27,856 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–13 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,525 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
మార్కెట్ స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో స్థిరీకరణకు గురికావొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పట్టికే భారీ కొనుగోళ్లు జరిగినందున, ఇన్వెస్టర్లు కొంతమేర లాభాలు స్వీకరించే వీలుందంటున్నారు. ‘పతనమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల నష్టాలు సైతం అధికంగా ఉండకపోవచ్చంటున్నారు. సాంకేతికంగా ‘‘నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,400–24,500 శ్రేణిని చేధించాల్సి ఉంటుంది. దిగువ 24,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు.ఈ వారం ప్రభావిత అంశాలు→ అంతర్జాతీయంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్ ద్రవ్యోల్బణ డేటా, బ్రిటన్ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. → ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్ 11న (గురువారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2024–2025) తొలి తైమాసికపు ఫలితాలు వెల్లడించి దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్‌ను షురూ చేయనుంది. శుక్రవారం హెచ్‌సీఎల్ టెక్(జూలై 12), అవెన్యూ సూపర్ మార్ట్శనివారం), ఐఆర్ఈడీఏ(జూలై 13న) కంపెనీలు సైతం ఇదే వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో కదిలికలు, స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చు. → వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ జూన్ రిటైల్ ద్రవ్యోల్బణ, మే పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ వృద్ధి గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజున ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు, బ్యాంకుల రుణ, డిపాజిట్ల వృద్ధి డేటాను ప్రకటించనుంది. → వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సమగ్ర బడ్జెట్(జూలై 23న)పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. → గత వారంలో పబ్లిక్ ఇష్యూలు పూర్తి చేసుకున్న ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ బన్సాల్ ఫార్మా షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: వారాంతాపు రోజున ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు కోల్పోయి 80వేల దిగువన 79,997 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 24,363 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 24,314 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో విక్రయాల ప్రభావంతో భారీగా పతనమైన సూచీలను రిలయన్స్ (2%) ఎస్బీఐ (2.50%) రాణించడంతో సూచీలు రికవరీ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయ ల్, విద్యుత్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్ గణాంకాలు, బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. → జియో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2% పెరిగి రూ.3180 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 3% ఎగసి రూ.3198 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పెరిగి రూ.21.51 లక్షల కోట్ల చేరింది.రూ.450 లక్షల కోట్లు సూచీలు ఫ్లాట్‌గా ముగిసినా, ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 2.58 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ.450 లక్షల కోట్లకు చేరింది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్‌బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్‌లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
77,000 స్థాయి తాకి.. వెనక్కి
ముంబై: సరికొత్త రికార్డుల వద్ద ఐటీ, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారంతో ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 77,000 స్థాయిపై 77,079 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 23,412 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి.తదుపరి ఐటీ, ఫైనాన్స్ మెటల్, ఇంధన షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పతనమై 76,490 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 23,259 వద్ద నిలిచాయి. సరీ్వసెస్, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, పారిశ్రామికోత్పత్తి రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.04%, 0.56% చొప్పున రాణించాయి. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.136)తో పోలిస్తే 21% ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయ్యింది. ఆఖరికి 17% లాభంతో రూ.159 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.591.25 కోట్లుగా నమోదైంది. డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్ఎస్ఈకాగా, డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్సే్చంజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డ్ మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు యంఫీ వెల్లడించింది. -
అయిదు రోజుల అమ్మకాలకు బ్రేక్
ముంబై: దేశీయ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నేడు(శనివారం) ఎగ్జిట్ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 73,961 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 22,530 వద్ద నిలిచింది. దీంతో సూచీల అయిదురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల వరుస పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్ ఇంధన, కన్జూమర్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 593 పాయింట్లు బలపడి 74,479 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. నెలాఖరున డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఆరంభ నష్టాలు కోల్పోయింది. అమెరికా బ్రోకేరేజ్ సంస్థ జెప్ఫారీస్ ‘బై’ రేటింగ్‌తో అదానీ షేర్లు భారీగా పెరిగాయి. డాలర్ మారకంలో 13 పైసలు బలహీనపడింది 83.42 స్థాయి వద్ద స్థిరపడింది. -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది. -
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు. -
సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
లాభాల్లోంచి నష్టాల్లోకి
ముంబై: బ్యాంకింగ్ షేర్ల భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో స్టాక్ సూచీలు నాలుగోరోజూ నష్టాలు చవిచూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీతో ఉదయం లాభాలతోనే మొదలయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో 1,107 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 455 పాయింట్లు నష్టపోయి 72,489 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 72,366 వద్ద కనిష్టాన్ని 73,473 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 365 పాయింట్లు శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 152 పాయింట్లు కోల్పోయి 21,996 వద్ద నిలిచింది. రోజంతా 21,962 – 22,327 పాయింట్ల మధ్య ట్రేడైంది. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.39%, 0.06 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌పీఐలు రూ.4,260 ఈక్విటీలను విక్రయించగా, డీఐఐలు రూ.2,286 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.50%– ఒకశాతం వరకు లాభపడ్డాయి. ► సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 2,549 పాయింట్ల(3.39%) పతనంతో బీఎస్ఈలో రూ.9.30 లక్షల కోట్లు మాయమ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.392 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 డెరివేటివ్స్ ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచి్చనట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు. -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్ బై...
ముంబై: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు బలపడి 22,516 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో బలహీనతల కారణంగా ఆఖర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ దాదాపు ఒకశాతం లాభపడటంతో బీఎస్ఈలో రూ.3.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ (0.50%), రిలయన్స్ (0.37%), హెచ్‌సీఎల్ (0.26%), టెక్ మహీంద్రా (0.25%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. ► బీఎస్ఈ, నిఫ్టీలు ఎంపిక చేసుకున్న షేర్లలో బీటా వెర్షన్ టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభించాయి. తొలి రోజున రెండు ఎక్స్ఛేంజిల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. నేడు ఎక్స్ఛేంజిలకు గుడ్‌ఫ్రైడే సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు రోజులు కావడంతో ట్రేడింగ్ సోమవారం ప్రారంభం అవుతుంది. ర్యాలీ ఎందుకంటే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(ఏఐఎఫ్)లో రుణదాతల పెట్టుబడులపై గతంలో కఠిన ఆంక్షల విధించిన ఆర్బీఐ తాజాగా నిబంధనలను సులభతరం చేయడంతో అధిక వెయిటేజీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ రంగాల షేర్లు రాణించాయి. మోర్గాన్ స్టాన్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అవుట్‌లుక్‌ను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది. ఇటీవల ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల పట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా సూచీలు రికార్డు స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.5% పెరిగాయి. 2023– 24లో రూ.128 లక్షల కోట్ల సృష్టి దేశీయ స్టాక్ మార్కెట్ 2023–24లో గణనీయమైన లాభాలు పంచింది. సెన్సెక్స్ 14,660 పాయింట్లు (25%) ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ ఏడాది వ్యవధిలో 128 లక్షల కోట్ల పెరిగి రూ.387 లక్షల కోట్లు చేరింది. సెన్సెక్స్ మార్చి 7న 74,245 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్చి 2న ఇన్వెస్టర్ల సంపద సైతం రూ.394 లక్షల వద్ద ఆల్‌టైం హైని తాకింది. ఇదే కాలంలో నిఫ్టీ 4,967 పాయింట్లు(29%) పెరిగింది. మార్చి 11న 22,526 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2022–23లో 423 పాయింట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కార్వికి సెబీ మరో షాక్ కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు సెబీ మరో షాక్ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మర్చంట్ బ్యాంకర్ రిజి్రస్టేషన్‌ను రద్దు చేసింది. 2023 మార్చి 15–17 తేదీల్లో కార్వీ ఇన్వెస్టర్ సర్విసెస్‌ను సెబీ బృందం తనిఖీల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సెబీ కార్వీపై పలు చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ స్టాక్ ఎక్స్ఛేంజిల నుంచి డీలిస్ట్ చేసేందుకు 72 శాతం వాటాదారులు అనుమతించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా వెల్లడించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. డీలిస్టింగ్ తదుపరి మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనంకానున్నట్లు తెలియజేసింది. డీలిస్టింగ్ పథకంలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాటాదారులు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 67 ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను పొందనున్నట్లు వెల్లడించింది. -
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు
ముంబై: వాల్యూయేషన్ ఆందోళనలను విస్మరిస్తూ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య స్థాయి షేర్లను కొనేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్ సూచీ లు గురువారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 73 వేల స్థాయి పైన 73,097 వద్ద నిలిచింది. నిఫ్టీ 149 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,146 వద్ద ముగిసింది. సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4 నెలల కనిష్టానికి దిగివచి్చనట్లు డేటా వెల్లడి కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు దిగువ స్థాయి లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. ఒక దశలో సె న్సెక్స్ 602 పాయింట్లు పెరిగి 73,364 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు బలపడి 22,205 వద్ద గరి ష్టాలను అందుకున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఫై నాన్స్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీ య ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవు తున్నాయి. ► కనిష్ట స్థాయిల్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 3.11%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.28% చొప్పున రాణించాయి. రంగాల వారీగా సరీ్వసెస్, టెలికం సూచీలు 4%, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, పారిశ్రామిక ఇండెక్స్‌లు 3%, కమోడిటీ సూచీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► భారత సైన్యం, తీర రక్షక దళం కోసం 34 తేలికపాటి హెలికాప్ట్టర్లు, అనుబంధ పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8,073 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ షేరు 4.2% లాభపడి రూ.3,167 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ 335 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో రూ.7.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపద బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. ► అదానీ గ్రూప్ షేర్లూ ముందడుగేశాయి. ఆదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ సొల్యూషన్స్ 11%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లు 4%, అదానీ పవర్ 2% రాణించాయి. గ్రూప్‌లో కంపెనీల మార్కెట్ క్యాపిటలేషన్ రూ.15.66 లక్షల కోట్లు పెరిగింది. గోపాల్ స్నాక్స్ లిస్టింగ్ మెప్పించలేదు. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.401)తో పోలిస్తే 13% డిస్కౌంట్‌తో రూ.350 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. దాదాపు 15% క్షీణించి రూ.342 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.342 వద్ద ముగిసింది. -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి. ‘‘స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు. రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు. 3 ఐపీఓలు రూ.1,325 కోట్లు ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్‌కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి. -
నాలుగో రోజూ లాభాలు
ముంబై: ఐటీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు సెంటిమెంట్‌ను మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 22 వేల స్థాయిపై 22,041 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. భారత వాణిజ్య లోటు 9 నెలల కనిష్టానికి దిగిరావడంతో క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల ర్యాలీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,218 వద్ద కనిష్టాన్ని, 72,545 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,969 – 22,069 శ్రేణిలో ట్రేడైంది. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.68%, 0.78 % చొప్పున రాణించాయి. ► ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.1,258)తో పోలిస్తే 1% డిస్కౌంట్‌తో రూ.1245 వద్ద లిస్టయ్యింది. 9.22 % నష్టపోయి రూ.1142 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.50% క్షీణించి రూ.1149 వద్ద ముగిసింది. ► వరుస పతనాల నుంచి పేటీఎం షేరు కోలు కుంది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 5% ఎగసి రూ. 341.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
ఆర్బీఐ పాలసీ అప్రమత్తత
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి (నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 621 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72,152 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 71,938 వద్ద కనిష్టాన్ని, 72,559 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 22,053 – 21,860 రేంజ్ లో కదలాడింది. చివరికి ఒక పాయింటు లాభపడి 21,930 వద్ద నిలిచింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, 0.38% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,691 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,096 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, ఇండోనేíసియా, చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.10% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 0.25% లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పాటు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా 2.31%, ఇన్ఫోసిస్ 2%, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ► పేటీఎం రికవరీ ప్రయాణం బుధవారం కొనసాగింది. బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభంలో 10% పెరిగి రూ.496 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి లాకైంది. రెండు రోజుల్లో షేరు 13% బౌన్స్‌బ్యాక్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,720 కోట్లు పెరిగి రూ.31,548 కోట్లకు చేరింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటా కొనుగోలుకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో యస్‌బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వరుసగా 17%, 7% చొప్పున లాభపడ్డాయి. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
బీజేపీకి జై..సూచీలు రయ్
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు. ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది. ► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు వరుస ర్యాలీతో పాటు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఫెడ్ రిజర్వ్) ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటునన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు, స్థూల ఆర్థిక గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని చెబుతున్నారు. వినాయక చవితి సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు ఉదయం సెషన్లో మాత్రమే సెలవు పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సదస్సు విజయవంతం, అంచనాలకు తగ్గట్లు ద్రవ్యల్బోణ డేటా నమోదుతో సూచీలు వరుసగా మూడోవారమూ లాభాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1240 పాయింట్లు, నిఫ్టీ 372 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. వారాంతపు రోజైన శుక్రవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ‘‘లార్జ్‌క్యాప్ షేర్ల రాణించే వీలున్నందున మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ కొనసాగొచ్చు. విస్తృత మార్కెట్లో కొనుగోళ్ల ప్రాధాన్యత రంగాల వారీగా మారొచ్చు. ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాల వెల్లడి ముందు అప్రమత్తత నేపథ్యంలో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువును 20,050 – 20,000 శ్రేణిలో తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 20,200 – 20,250 పాయింట్ల పరిధిలో కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల నిర్ణయ ప్రభావం రెండురోజుల పాటు జరిగే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్రల్ రిజర్వ్ కమిటీ సమావేశం నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. ఇదే సందర్భంగా ఫెడ్ రిజర్వ్ యూఎస్ ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ సర్వే వెల్లడించనుంది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకే ఫెడ్ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తల భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు జరిగితే ఈక్విటీ మార్కెట్లు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(గురువారం), బ్యాంక్ ఆఫ్ జపాన్(శుక్రవారం)లూ ఇదే వారంలో వడ్డీరేట్లు వెల్లడించనున్నాయి. అమెరికా ఎస్అండ్పీ తయారీ, సేవారంగ పీఎంఐ, నిరుద్యోగ డేటా, ఇంగ్లాండ్, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, జపాన్ వాణిజ్య లోటు గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబింజేసే ఈ స్థూల గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఐపీఓ మార్కెట్‌పై దృష్టి గతవారంలో మొదలైన సంహీ హోటల్స్, జాగిల్‌ప్రీపెయిడ్ ఓషన్ సరీ్వసెస్ ఐపీఓలు సోమవారం(సెపె్టంబర్ 18న), యాత్రా ఆన్లైన్ ఐపీఓ బుధవారం(సెపె్టంబర్ 20న) ముగియనున్నాయి. ఇక సాయి సిల్క్స్ కళామందిర్, సిగ్నేచర్‌గ్లోబల్ ఇండియా పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై, శుక్రవారం ముగియనున్నాయి. వైభవ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓ ఈ నెల 22–26 తేదీల మధ్య జరగనుంది. ప్రథమార్ధంలో రూ.4,800 కోట్ల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఈ సెపె్టంబర్ ప్రథమార్ధంలో దాదాపు రూ. 4,800 కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. డాలర్ విలువ బలపడుతోంది. ప్రపంచ ఆర్థికవృద్ధిపై ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఎఫ్ఐఐలు అమ్మకాలకు పాల్పడుతున్నారు. భారత మార్కెట్లు రికార్డు స్థాయిలో ర్యాలీ చేయడం, వాల్యూయేషన్లు ఎక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో విక్రయాలు కొనసాగే వీలుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెప్పారు. -
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్‌నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్డీఎఫ్సీ వీలినం, గిఫ్ట్‌నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్డీఫ్సీ–హెచ్డీఫ్సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్‌లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్‌లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్ దిగ్గజం ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.80 వద్ద లాకయ్యింది. ► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది. -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్చి నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ ట్రేడింగ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదయం సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 57,752 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 455 పాయింట్ల పరిధిలో 57,495 వద్ద కనిష్టాన్ని, 57,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 40 పాయింట్ల నష్టంతో 57,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,032 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 16,914 –17,062 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 34 పాయింట్లు పతనమై 16,952 వద్ద ముగిసింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.79%, 0.42 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1531 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను విక్రయించారు. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 82.16 స్థాయి వద్ద స్థిరపడింది. వేదాంతా డివిడెండ్ రూ. 20.5 వేదాంతా లిమిటెడ్ వాటాదారులకు ఐదో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 20.5 చొప్పున చెల్లించనుంది. ఇందుకు ఏప్రిల్ 7 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం రూ. 7,621 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
సూచీలకు స్వల్పలాభాలు
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్పలాభాలతో గట్టెక్కాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 58,245 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభంతో 17,177 వద్ద ప్రారంభమయ్యాయి. తొలి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 344 పాయింట్లు ఎగసి 58,418 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు బలపడి 17,207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 140 పాయింట్ల స్వల్పలాభంతో 58,215 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 17,152 వద్ద నిలిచింది. ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ కమోడిటీ షేర్లు రాణించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.18 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, మీడియా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
నాలుగు నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది. -
Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ – అదానీ గ్రూప్ పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్ ఇండెక్స్ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది. ‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్ సంక్షోభం పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ కన్స్ట్రక్షన్ పీఎంఐ డేటా, బ్రిటన్ సీఐపీఎస్ కన్స్ట్రక్షన్ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఆర్బీఐ ఎంసీపీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గతేడాది జూన్ తర్వాత ఒక నెలలో ఎఫ్ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్లో షార్ట్ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. -
దలాల్ స్ట్రీట్ ఢాం
ముంబై: ఉక్రెయిన్‌లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. గత రెండేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో మార్కెట్లో మహా ఉత్పాతం సంభవించింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాల ఊచకోత జరగడంతో యుద్ధానికి మించిన రక్తపాతం జరిగింది. యుద్ధ భయాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన స్టాక్ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. వెరసి స్టాక్ మార్కెట్లకు ఈ గురువారం ‘‘టెర్రిబుల్ థర్స్డే’’గా నిలిచిపోయింది. సెన్సెక్స్ 2,702 పాయింట్లు నష్టపోయి 54,530 వద్ద ముగిసింది. నిఫ్టీ 815 పాయింట్లు క్షీణించి 16,248 వద్ద నిలిచింది. తొలి దశ కోవిడ్ లాక్డౌన్ విధింపు ప్రకటన(2020 మార్చి 23)తర్వాత జరిగిన సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా ఆరుశాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోనూ ఏ ఒక్క షేరు లాభపడలేదు. ఇండెక్సుల్లో దిగ్గజాలైన ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ షేర్లు ఏడుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,448 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.7,668 కోట్లను కొన్నారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ ఇలా... ఉదయం సెన్సెక్స్ 1,814 పాయింట్ల భారీ పతనంతో 55,418 వద్ద మొదలైంది. నిఫ్టీ 514 పాయింట్ల క్షీణించి 16,549 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమ్మకాల సునామీ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 2,850 పాయింట్లు క్షీణించి 54,383, నిఫ్టీ 860 పాయింట్లు 16,203 వద్ద కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఇన్వెస్టర్లు భయాలను ప్రతిబింబించే వొలటాలిటి ఇండెక్స్ వీఐఎక్స్ 30.31 శాతం ఎగిసి 31.98 స్థాయికి చేరింది. ► బీఎస్ఈ ఎక్సే్ఛంజీలోని నమోదైన మొత్తం కంపెనీల షేర్లలో 3,160 షేర్లు నష్టాన్ని, 232 షేర్లు స్టాకులు లాభపడ్డాయి. 86 షేర్లులో ఎలాంటి మార్పులేదు. ఇందులో 279 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. ► ఇదే ఎక్సే్ఛంజీల్లో వివిధ రంగాలకు ప్రాతినిథ్యం వహించే మొత్తం 19 రంగాల ఇండెక్సులన్నీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు 6% క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీల్లో ఒక్క షేరు లాభపడలేదు. రూ.13.57 లక్షల కోట్లు ఆవిరి రష్యా సైనిక చర్య ప్రభావంతో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ రెండేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.13.57 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242.20 లక్షల కోట్లకు దిగివచ్చింది. గతేడాది(2021) అక్టోబర్ 18న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.274.69 లక్షల కోట్లకు చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. నాటితో పోలిస్తే నాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.32 లక్షల కోట్లను కోల్పోయారు. బంగారం భగభగ పెట్టుబడులకు ‘పసిడి’ కవచం అంతర్జాతీయ మార్కెట్లో 2,000 డాలర్లకు చేరువ... దేశీయంగా ఒకేరోజు రూ. 2,000 అప్ న్యూఢిల్లీ: యుద్ధ తీవ్రత నేపథ్యంలో ఇన్వెస్టర్లు తక్షణం తమ పెట్టుబడులకు బంగారాన్ని ఆశ్రయించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో గత ముగింపుతో పోల్చితే 20 డాలర్లు లాభంతో 1930 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా చూసింది. అంతర్జాతీయ మార్కెట్లో 52 వారాల కనిష్టం 1,682 డాలర్లు. కోవిడ్–19 తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో 2020 ఆగస్టులో పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టం 2,152 డాలర్లను తాకింది. వ్యాక్సినేషన్, కరోనా భయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో ధర క్రమంగా దిగివస్తూ, 2021 ఆగస్టునాటికి 1,682 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఈ స్థాయి కొనుగోళ్ల మద్దతుతో తిరిగి క్రమంగా 1,800 డాలర్ల స్థాయికి చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు తిరిగి పసిడిని కీలక అవరోధం 1,910 డాలర్ల పైకి చేర్చాయి. దేశీయంగా భారీ జంప్ ఇక అంతర్జాతీయంగా చరిత్రాత్మక ధరకు చేరిన సందర్భంలో దేశీయంగా పసిడి ధర 10 గ్రాములకు ధర మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్) రూ.56,191కి చేరింది. వార్షికంగా ఇది దాదాపు 45% పెరుగుదల. అటు తర్వాత క్రమంగా రూ.45 వేల దిగువకు దిగివచ్చిన పసిడి ధర, ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రూ.51,540 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోల్చితే ఇది రూ.1,160 పెరుగుదల. ట్రేడింగ్ ఒక దశలో ధర రూ.52,797కు చేరడం గమనార్హం. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర గురువారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత 2,491 పెరిగి రూ. 52,540 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.2,481 ఎగసి రూ.52,330కి చేరింది. వెండి కేజీ ధర రూ. 3,946 ఎగసి రూ.68,149 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రాతిపదికన పసిడి తదుపరి కదలికలు ఉంటాయని భావిస్తున్నారు. అయ్యో.. రూ‘పాయే’... 99 పైసలు నష్టంతో 75.60 కు డౌన్ భారత్ కరెన్సీ రూపాయిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 99 పైసలు బలహీనపడి, 75.60 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, దీనితో మార్కెట్ పతనం, క్రూడ్ ధరల తీవ్రత వంటి అంశాలు రూపాయిని బలహీనపరిచాయి. ట్రేడింగ్‌లో విలువ 75.02 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.75కు పతనమైంది. ఆయిల్ దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఆసియా దేశాల కరెన్సీల్లో రూపాయి తీవ్రంగా నష్ట పోయింది. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 1.30 శాతం లాభంతో 97.35 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నష్టాలకు కారణాలివే... ► యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆంక్షల బెదిరింపులను లెక్కచేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై ‘‘వార్’’ ప్రకటించడం మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. రష్యా సేనలు గురువారం ఉదయం తూర్పు ఉక్రెయిన్‌పై దాడికి దిగాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ► క్రూడాయిల్ కష్టాలు ఉక్రెయిన్ – రష్యా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ప్రపంచ క్రూడ్ ఎగుమతుల్లో పదిశాతం వాటాను కలిగి ఉన్న రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. ► ఎఫ్అండ్ఓ ముగింపు అమ్మకాలు ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు స్కేయర్ ఆఫ్ చేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కూడా గురువారమే కావడంతో ఇన్వెస్టర్లు విక్రయాలకు తెగబడ్డారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయోచ్చనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. యుద్ధ భయాలతో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు ఆకాశానికి చేరుకోవడంతో పాటు, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల పతానికి కారణమయ్యాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా, తైవాన్ సూచీలు మూడు శాతం నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయాయి. జపాన్, చైనా ఇండోనేషియా దేశాలు 2% క్షీణించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ‘‘వార్’’ జరుగుతున్న ఐరోపా ప్రాంతాల్లోనూ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అక్కడి ప్రధాన మార్కెట్లైన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు నాలుగు నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల రెండున్నర శాతం నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలానికి కారణమైన రష్యా ప్రధాన స్టాక్ సూచీ ఆర్టీఎస్ 38 శాతం క్షీణించింది. మరో సూచీ ఎంఓఈఎక్స్ 45 శాతం మేర పతనమైంది. డాలర్ మారకంలో రష్యా దేశ కరెన్సీ రూబుల్ 45% పతనమైంది. -
ఒడిదుడుకులు... అయినా లాభాల్లోనే!!
ముంబై: దేశీయ ప్రధాన స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 40,510 వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత కొనసాగిన లాభాల స్వీకరణతో కనిష్టంగా 40,337 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం మళ్లీ కోలుకుని గరిష్టంగా 40,646 పాయింట్లకు చేరినప్పటికీ.. నిరాశపరిచిన ఇటీవలి క్యూ2 జీడీపీ గణాంకాల నేపథ్యంలో ప్రీమియం వాల్యుయేషన్స్ వద్ద మార్కెట్ నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయనే అనుమానాలు లాభాల స్వీకరణకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద ముగిశాయి. 7.5 శాతం పెరిగిన వీఐఎక్స్ మార్కెట్లో రానున్న 30 రోజుల ఒడిదుడుకులను ప్రతిబింబించే ఇండియా వీఐఎక్స్ సూచీ సోమవారం ఒక్కసారిగా 7.5 శాతం పెరిగి 14.59 స్థాయికి చేరుకుంది. ఈ సూచీ కదలికల ఆధారంగా రానున్న రోజుల్లో ఒడిదుడుకులకు మరింత ఆస్కారం ఉందని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేíషించారు. బలపడిన రూపాయి.. ఐటీ షేర్లు డీలా డాలరుతో రూపాయి బలపడిన కారణంగా నిఫ్టీ ఐటీ 0.87 శాతం నష్టపోయింది. ఈ సూచీలోని టీసీఎస్ షేరు అత్యధికంగా 2.99 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.62 శాతం, టెక్ మహీంద్ర 0.86 శాతం నష్టపోయాయి. మరోవైపు హెక్సావేర్, ఎన్ఐఐటీ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.73 శాతం లాభం.. మారుతీ సుజుకీ నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని 4.33 శాతం పెంచినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ కంపెనీ షేరు 2 శాతం మేర లాభపడింది. ఈ సానుకూల అంశంతో ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎంఆర్ఎఫ్, ఆశోక్ లేలాండ్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో షేర్లు 0.45 శాతం నుంచి 1.41 శాతం మధ్యలో లాభపడ్డాయి. వోడాఫోన్ ఐడియా 5.80 శాతం డౌన్ ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా చేసిన వ్యాఖ్యలతో ఈ కంపెనీ షేరు 5.8 శాతం నష్టంతో రూ. 6.50 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.75 శాతం నష్టపోగా.. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 7.88 శాతం నష్టపోయింది. డిష్ టీవీ 6.37 శాతం అప్ అంతర్గత సమీకరణల ద్వారా తన అప్పులలో అధిక భాగాన్ని చెల్లిస్తామని డిష్ టీవీ ప్రకటించటంతో ఈ కంపెనీ షేరు 6.37 శాతం లాభపడింది. ఆకర్షణీయ రెవెన్యూ గైడెన్స్‌తో వా టెక్ వాబాగ్ 15.38 శాతం లాభపడింది. కాగా నిఫ్టీ–50 షేర్లలో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఆదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 2 శాతం మేర లాభపడ్డాయి. -
32,000పైన సెన్సెక్స్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభావం ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు శుక్రవారం పటిష్టంగా ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు ఎగిసి, తిరిగి 32,000 పాయింట్లస్థాయిపైన 32,029 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,900 స్థాయిని అధిగమించి 42 పాయింట్ల పెరుగుదలతో 9,915 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తీవ్ర హెచ్చుతగ్గులు...: క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాల్ని ఆర్ఐఎల్ వెల్లడించడంతో శుక్రవారం ఈ షేరుతో పాటు సూచీలు కూడా గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. అయితే అటుతర్వాత ఐటీ మినహా ఇతర రంగాల షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకూ నష్టపోయి 31,800 పాయింట్ల వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం 9,838 పాయింట్ల స్థాయికి క్షీణించింది. అయితే అటుతర్వాత రిలయన్స్ ఏజీఎంలో ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 1ః1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన చేసిన తర్వాత ఆర్ఐఎల్ షేరు 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,590 వద్దకు చేరడం...కనిష్టస్థాయిల వద్ద ఇతర షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్ తిరిగి వేగంగా కోలుకుంది.జియో విస్తరణ, వినూత్న ప్రణాళికల్ని ప్రకటించడంతో మార్కెట్లో ఉత్తేజం కలిగిందని, ఐటీ షేర్లు, ప్రైవేటు బ్యాంకు షేర్లలో జరిగిన కొనుగోళ్లతో ఒడుదుడుకుల నుంచి సూచీలు కోలుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
నష్టంతో ముగిసిన మార్కెట్ ముంబై: నిరుత్సాహకర జీడీపీ డేటాకు స్పందనగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో గురువారం స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై, చివరకు కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి. 31,213–31,062 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 8.21 పాయింట్ల నష్టంతో 31,138 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,634–9,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన గణాంకాల ప్రకారం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ డేటా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని, దాంతో రోజంతా సూచీలు స్వల్పశ్రేణిలో కదిలాయని, అయితే వచ్చేనెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో మార్కెట్ నష్టాలు తక్కువగా వున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ డౌన్... వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.58 శాతం నష్టపోయింది. కాగా ప్రధాన సూచీలు నీరసంగా ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు జోరుగా పెరగడంతో ఈ సూచీలు మంచి లాభంతో ముగిసాయి. -
ఇన్వెస్టర్ల ముందుజాగ్రత్త
* డెరివేటివ్స్ ముగింపు, పార్లమెంట్ సమావేశాల నేపథ్యం * 44 పాయింట్ల నష్టంతో 25,776 పాయింట్లకు సెన్సెక్స్ దశ, దిశ లేకుండా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా రెండో రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టపోయి 25,776 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 7,832 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, ఇన్ఫ్రా, వాహన , కొన్ని బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను పడగొట్టాయి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, నేడు(బుధవారం) గురునానక్ జయంతి సందర్భంగా సెలవు, రేపు(గురువారం) నవంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగియనుండడం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడం, వచ్చే వారం ఆర్బీఐ పాలసీ ప్రకటన వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు ఆచి, తూచి ట్రేడింగ్ జరిపారు. బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్ రియల్టీ, ఆయిల్, గ్యాస్, ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లతో కొంచెం రికవరీ అయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగుతూ, చివరకు 44 పాయింట్ల నష్టంతో 25,776 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైజర్ 9 శాతం అప్ : అలెర్గాన్ కంపెనీని ఫైజర్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఫైజర్ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో ఈ షేర్ 8.6 శాతం లాభపడి రూ.2,648 వద్ద ముగిసింది. క్రెడిట్ సూసీ సంస్థ సన్ ఫార్మాకు తటస్థం రేటింగ్‌ను కొనసాగిస్తామని పేర్కొనడంతో ఆ కంపెనీ షేర్ 1.5 శాతం పతనమైంది. మారుతీ సుజుకీ 2 శాతం క్షీణించింది. సెన్సెక్స్ బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఎల్ అండ్ టీ 1.9 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, బజాజ్ ఆటో, విప్రో, ఎన్టీపీసీ షేర్లు 1-2 శాతం రేంజ్లో పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనిలివర్, లుపిన్, భారతీ ఎయర్‌టెల్ 1-2 శాతం రేంజ్లో పెరిగాయి. 1,475 షేర్లు లాభాల్లో, 1,182 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇతర ప్రాంతాల మార్కెట్ల తీరు... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, రష్యా యుద్ధ విమానాన్ని సిరియా సరిహద్దుల్లో టర్కీ దేశం కూల్చివేయడంతో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోప్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్‌కామ్ 9 శాతం అప్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ 9.2 శాతం లాభంతో రూ.71 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,506 కోట్లు పెరిగింది. తన టవర్ల విభాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో మొత్తం వాటాను ఆర్‌కామ్ విక్రయించనున్నదని, దీనికి సంబంధించి ఒప్పందం తుది దశకు చేరిందని, పది రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఆర్‌కామ్‌కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో 96 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వల్ల ఆర్‌కామ్‌కు రూ.22,000 కోట్లు వస్తాయని అంచనా. దీంతో రూ.38,000 కోట్లుగా ఉన్న ఆర్‌కామ్ రుణభారం గణనీయంగా తగ్గుతుంది. కాగా టవర్ల విక్రయ వార్తలపై స్పందించడానికి ఆర్‌కామ్ నిరాకరించింది. నేడు సెలవు గురు నానక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. -
స్వల్ప లాభాలతో సరి
* ప్లస్ 217 నుంచి ప్లస్ 27కు పరిమితమైన సెన్సెక్స్ లాభం * 25,868 వద్ద ముగింపు ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో స్టాక్ సూచీలు గట్టెక్కాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో ఉండటానికి తోడు దేశీయంగా కొనుగోళ్లు జోరందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడింది. 26 వేల పాయింట్లను దాటింది. కానీ చివరి గంటలో అమ్మకాల కారణంగా ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఐటీ, కొన్ని ఆయిల్, గ్యాస్, వాహన షేర్ల మద్దతుతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరలో బ్యాంక్, ఆర్థిక సేవల షేర్లలో అమ్మకాల కారణంగా స్వల్పలాభాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ వారంలో సెన్సెక్స్ 258 పాయింట్లు (1 శాతం), నిఫ్టీ 94 పాయింట్లు(1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి. గత నాలుగు వారాల్లో లాభాల్లో ముగిసిన వారం ఇదే. డిసెంబర్లోనే వడ్డీరేట్లను పెంచడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమవుతున్నప్పటికీ, ఈ పెరుగుదల దశలవారీగానే ఉంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. వేతన సంఘం సిఫారసు చేయడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.ప్రారంభంలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయిన సెన్సెక్స్, బ్లూ చిప్‌ల్లో కొనుగోళ్లతో తేరుకుంది. కాగా ఐపీఓ కోసం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో మహానగర్ గ్యాస్ కంపెనీలో 49.75 శాతం వాటా ఉన్న గెయిల్ 10 శాతం లాభపడి రూ.350 వద్ద ముగిసింది.