ఎగ్జిట్ పోల్స్ వైపు ఇన్వెస్టర్ల చూపు
స్వల్ప లాభాలతో గట్టెక్కిన సూచీలు
ముంబై: దేశీయ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నేడు(శనివారం) ఎగ్జిట్ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 73,961 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 22,530 వద్ద నిలిచింది. దీంతో సూచీల అయిదురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
ఇటీవల వరుస పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్ ఇంధన, కన్జూమర్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 593 పాయింట్లు బలపడి 74,479 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. నెలాఖరున డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఆరంభ నష్టాలు కోల్పోయింది. అమెరికా బ్రోకేరేజ్ సంస్థ జెప్ఫారీస్ ‘బై’ రేటింగ్‌తో అదానీ షేర్లు భారీగా పెరిగాయి.
డాలర్ మారకంలో 13 పైసలు బలహీనపడింది 83.42 స్థాయి వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment