
సూచీలకు స్వల్పలాభాల ముగింపు
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి జీఎస్‌టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.