record level income
-
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
శ్రీవారికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి శనివారం ఒక్కరోజులో రికార్డుస్థాయిలో ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు చెప్పారు. ప్రసాదాలు, దర్శనం టికెట్లు, సత్రాల గదుల అద్దెల ద్వారా ఒక్కరోజులో మొత్తం రూ.16,20,226 లభించిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గతంలో ఇంత ఆదాయం లభించలేదన్నారు. వేసవి సెలవులు, వివాహాలు అధికంగా జరగడంతో క్షేత్రానికి వచ్చిన భక్తుల ద్వారా ఇంత ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. -
ఒకేరోజు.. 50 లక్షలు!
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : దాదాపు పక్షం రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడాయి. డాక్యుమెంట్ రైటర్ల సమ్మె కారణంగా క్రయ, విక్రయ దస్తావేజులు సిద్ధం చేసే పని నిలిచిపోయి కళావిహీనంగా కనిపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిసరాలు సోమవారం జన, వాహన సంచారంతో నిండిపోయాయి. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం విపరీతమైన రద్దీ నెలకొంది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మీ-సేవ కేంద్రాలకు బదలాయించాలనే ప్రభుత్వ యోచనకు నిరసనగా ఈ నెల 16 నుంచి డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మెకు దిగగా, అంతకుముందు నుంచే (11వ తేదీ) సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది. ఒక్కరోజునే 150 రిజిస్ట్రేషన్లు... సేవలు తిరిగి అందుబాటులోకి రావడంతో సోమవారం ఒక్కరోజే దాదాపు 150 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వానికి సుమారుగా *50 లక్షల దాకా ఆదాయం వచ్చినట్టు అంచనా. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం రికార్డుగా భావిస్తున్నా రు. గత రెండు, మూడు నెలల సగటును పరిశీలిస్తే ప్రతి రోజు 20 నుంచి 25 రిజి స్ట్రేషన్ల వరకే జరిగేవి. సీజన్లో చూసినా 50నుండి 60 వరకు రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. ఈ యేడాది జనవరి నెలలో 26వ తేదీ వరకు 696 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొంతకాలంగా నిలిచిపోయినందునే.. కొద్దికాలంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో సోమవారం భారీగా తరలివచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు పనులు చేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దస్థాయిలో ఒకేరోజు రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే ప్రథమం. - గులాం దస్తగిరి, సబ్ రిజిస్ట్రార్ నల్లగొండ