![Sensex ends down 450points, Nifty at 21,995 points - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/19/SENSEX-NIFTY.jpg.webp?itok=T_Mky-uT)
మిడ్ సెషన్‌లో ఒక్కసారిగా అమ్మకాలు
సూచీలు నాలుగో రోజూ నేలచూపులు
సెన్సెక్స్ 455 పాయింట్లు పతనం
22,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంకింగ్ షేర్ల భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో స్టాక్ సూచీలు నాలుగోరోజూ నష్టాలు చవిచూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీతో ఉదయం లాభాలతోనే మొదలయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో 1,107 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 455 పాయింట్లు నష్టపోయి 72,489 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో 72,366 వద్ద కనిష్టాన్ని 73,473 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 365 పాయింట్లు శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 152 పాయింట్లు కోల్పోయి 21,996 వద్ద నిలిచింది. రోజంతా 21,962 – 22,327 పాయింట్ల మధ్య ట్రేడైంది. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.39%, 0.06 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌పీఐలు రూ.4,260 ఈక్విటీలను విక్రయించగా, డీఐఐలు రూ.2,286 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.50%– ఒకశాతం వరకు లాభపడ్డాయి.
► సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 2,549 పాయింట్ల(3.39%) పతనంతో బీఎస్‌ఈలో రూ.9.30 లక్షల కోట్లు మాయమ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.392 లక్షల కోట్లకు దిగివచి్చంది.
ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 డెరివేటివ్స్
ఎన్‌ఎస్‌ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచి్చనట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్‌పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment