Sensex Down
-
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: వారాంతాపు రోజున ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు కోల్పోయి 80వేల దిగువన 79,997 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 24,363 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 24,314 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో విక్రయాల ప్రభావంతో భారీగా పతనమైన సూచీలను రిలయన్స్ (2%) ఎస్బీఐ (2.50%) రాణించడంతో సూచీలు రికవరీ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయ ల్, విద్యుత్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్ గణాంకాలు, బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. → జియో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2% పెరిగి రూ.3180 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 3% ఎగసి రూ.3198 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పెరిగి రూ.21.51 లక్షల కోట్ల చేరింది.రూ.450 లక్షల కోట్లు సూచీలు ఫ్లాట్‌గా ముగిసినా, ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 2.58 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ.450 లక్షల కోట్లకు చేరింది. -
మార్కెట్‌కు ఎన్నికల కలవరం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి. → సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి. → మార్చి క్వార్టర్లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
లాభాల్లోంచి నష్టాల్లోకి
ముంబై: బ్యాంకింగ్ షేర్ల భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో స్టాక్ సూచీలు నాలుగోరోజూ నష్టాలు చవిచూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీతో ఉదయం లాభాలతోనే మొదలయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో 1,107 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 455 పాయింట్లు నష్టపోయి 72,489 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 72,366 వద్ద కనిష్టాన్ని 73,473 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 365 పాయింట్లు శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 152 పాయింట్లు కోల్పోయి 21,996 వద్ద నిలిచింది. రోజంతా 21,962 – 22,327 పాయింట్ల మధ్య ట్రేడైంది. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.39%, 0.06 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌పీఐలు రూ.4,260 ఈక్విటీలను విక్రయించగా, డీఐఐలు రూ.2,286 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.50%– ఒకశాతం వరకు లాభపడ్డాయి. ► సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 2,549 పాయింట్ల(3.39%) పతనంతో బీఎస్ఈలో రూ.9.30 లక్షల కోట్లు మాయమ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.392 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 డెరివేటివ్స్ ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచి్చనట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు. -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. అమెరికా వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా ఆందోళనలతో ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఫలితాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 454 పాయింట్లు పతనమై 72,643 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 123 పాయింట్లు నష్టపోయి 22,024 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 612 పాయింట్లు క్షీణించి 72,485 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.849 కోట్ల షేర్లను విక్రయించారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, వినిమయ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.682 కోట్ల షేర్లు అమ్మేశారు. వారం మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ 2% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 6%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4% క్షీణించాయి. -
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
మార్కెట్‌కు మళ్లీ నష్టాలు
ముంబై: స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 502 పాయింట్లు పతనమై 58,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు క్షీణించి 17,322 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్ 545 పాయింట్లు నష్టపోయి 59,411 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 17,306 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,771 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,129 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.60 స్థాయి వద్ద స్థిరపడింది. అధిక ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగొచ్చనే ఆందోళనల మధ్య వడ్డీరేట్లు మరింత పెరుగుతాయనే భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగొచ్చని ఇటీవల విడుదలైన ఆ దేశపు స్థూల ఆర్థిక డేటా సూచించడంతో పదేళ్ల బాండ్లపై రాబడి నాలుగుశాతం మించి నమోదైంది. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఎఫ్ఐఐలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లలో నికర విక్రయదారులుగా నిలిచారు. లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అదానీ షేర్లలో రెండోరోజూ ర్యాలీ అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకోవడంతో ఈ గ్రూప్ షేర్లలో రెండోరోజూ ర్యాలీ కొనసాగింది. మరోవైపు హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఐదు శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ పోర్ట్స్ 3.5%, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 3%, ఏసీసీ సిమెంట్స్ ఒకటిన్నర శాతం పెరిగాయి. గత రెండురోజుల్లో రూ.70,302 కోట్ల సంపద సృష్టి జరిడంతో గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. -
అయిదు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బుధవారం దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ బేర్ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించడంతో బెంచ్‌మార్క్ సూచీలు అయిదు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సెన్సెక్స్ 928 పాయింట్లు నష్టపోయి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఒక్క ఐటీసీ(0.41%) మాత్రమే లాభంతో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో నాలుగు షేర్లు మాత్రమే నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 11 శాతం పెరగడంతో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.580 కోట్ల షేర్లను అమ్మేశారు. డీఐఐలు రూ.372 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఈ ఏడాదిలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బుధవారం ఆసియా మార్కెట్లు రెండుశాతం, యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా ఉదయం సెన్సెక్స్ 281 పాయింట్ల పతనంతో 60391 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 17,755 వద్ద మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒకదశలో సెన్సెక్స్ 992 పాయింట్లు క్షీణించి 59,681 వద్ద, నిఫ్టీ 297 పాయింట్లు నష్టపోయి 17,529 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించిన కొన్ని గంటలకే అణు ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంటుందని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగాయి. ఫెడ్ మినిట్స్ వెల్లడికి ముందు అప్రమత్తత, వడ్డీ రేట్ల పెంపు భయాలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయంగా ఆర్బీఐ మినిట్స్ వెల్లడి (మార్కెట్ ముగింపు తర్వాత), ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(నేడు) నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల పరంపర ఒత్తిడిని మరింత పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా నాలుగోరోజూ అమ్మకాలు పాల్పడ్డారు. ఈ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ‘‘గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బేర్స్‌కు ఎదురొడ్డి నష్టాలను పరిమితం చేసిన బుల్స్ బుధవారం చేతులెత్తేశారు. కోవిడ్, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాల నుంచి మార్కెట్ రికవరీ అవుతున్న తరుణంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రచ్ఛన్న యుద్ధం సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ప్రస్తుతానికి నిఫ్టీకి 17,500 వద్ద మద్దతు ఉంది. ఈ కీలక స్థాయిని కోల్పోతే మరో దఫా లాభాల స్వీకరణ జరిగే వీలుంది. దిగువ స్థాయిలో 17,350 వద్ద మరో మద్దతు ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 4 రోజుల్లో రూ. 7 లక్షల కోట్ల నష్టం గడచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1530 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో స్టాక్ మార్కెట్లో దాదాపు రూ. 7 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. బుధవారం ఒక్కరోజే రూ.3.87 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెన్సెక్స్ కీలకమైన 60 వేల స్థాయిని కోల్పోయి మూడువారాల కనిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ 17,500 స్థాయికి చేరువలో నెల కనిష్టం వద్ద స్థిరపడింది. ► ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ బ్యాంక్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయి సూచీల భారీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ► వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మాంద్య భయాలతో రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు మూడుశాతం నష్టపోయాయి. శోభ, ఓబెరాయ్ రియల్టీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేర్లు 1–2% చొప్పున పతనమయ్యాయి. మైండ్‌స్పేస్ రీట్, బ్రూక్‌ఫీల్డ్ రీట్ షేర్లు అరశాతం చొప్పున నష్టపోయాయి. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు బుధవారం ఆరంభ లాభాల్ని కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. అలాగే డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపునకు ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించడం ప్రతికూలంగా మారింది. ఇంట్రాడేలో 239 పాయింట్లు పెరిగి 56,198 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్ల నష్టంతో 55,944 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 87 పాయింట్లు ఎగసి 16,712 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి పది పాయింట్ల స్వల్ప లాభంతో 16,635 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఈ ముగింపు స్థాయిలు కొత్త గరిష్టాలు కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 298 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1072 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.151 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఐదు పైసలు క్షీణించి 74.24 వద్ద స్థిరపడింది. కోవిడ్ వ్యాక్సిన్ అనుమతులు లభించడంతో పాటు జాక్సన్ హోల్ వార్షిక సమావేశం యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. టీసీఎస్ @ రూ.13.50 లక్షల కోట్లు ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ మార్కెట్ విలువ బుధవారం రూ.13.50 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ టీసీఎస్యే. బీఎస్ఈలో ఈ షేరు రూ. 3,613 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 2.5% లాభపడి రూ.3,697 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి ఒకశాతం లాభంతో రూ.3659 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.13.53 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే మార్కెట్ విలువ పరంగా ఐటీ రంగానికే చెందిన ఇన్ఫోసిస్ మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ.7.4 లక్షల కోట్లు) క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ మార్కెట్లు క్రాష్!
ముంబై: కరోనా కేసులు, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలు మరోసారి తెరపైకి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. భారత్‌తో సహా పలు దేశాల్లో కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తున్నట్లు నివేదికలు తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ సన్నగిల్లింది. అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణం భయాలు కూడా ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు క్షీణించి 74.88 వద్ద ముగిసింది. గత వారాంతాన కార్పొరేట్లు వెల్లడించిన తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. సూచీలు జీవితకాల రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఈ ప్రతికూలతలతో సోమవారం సెన్సెక్స్ 587 పాయింట్లను కోల్పోయి 53 వేల స్థాయి దిగువన 52,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు పతనమై 15,752 వద్ద నిలిచింది. ఏప్రిల్ 30 తేదీ తర్వాత ఇరు సూచీలకు ఇదే అతిపెద్ద నష్టం. ఫార్మా, రియల్టీ షేర్లకు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,199 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,048 కోట్లను కొన్నారు. ఇటీవల రాణిస్తున్న మధ్య, చిన్న తరహా షేర్ల అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం క్షీణించాయి. సూచీలు ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.1.16 లక్షల కోట్లను కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల విలువ రూ.234.46 లక్షల కోట్లకు దిగివచ్చింది. తొలి నుంచీ తుది దాకా అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 53 వేల దిగువును 533 పాయింట్ల నష్టంతో 52,607 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 15,754 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత శనివారం క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. రెండో దశ కరోనాతో ఆస్తుల నాణ్యత క్షీణించినట్లు ప్రకటించింది. ఈ ప్రతికూల ప్రభావం బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీ రంగాలకు విస్తరించి ఉండొచ్చనే అంచనాలతో సంబంధిత రంగాలైన ఆర్థిక, బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా, ద్రవ్యోల్బణ భయాలతో మెటల్, ఆటో షేర్లు నష్టపోయాయి. గతవారంలో రాణించిన ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఒక దశలో సెన్సెక్స్ 734 పాయింట్లను కోల్పోయి 52,406 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 15,707 స్థాయిల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అమెరికా, యూరప్ సూచీలు 2% పైగా డౌన్ కోవిడ్ డెల్టా వేరియంట్ కేసులు విజృంభణతో ప్రపంచ మార్కెట్లు వారం ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూశాయి. ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కేసుల కట్టడికి స్థానిక ప్రభుత్వాలు ఆంక్షలు విధింపుతో ఆర్థిక వృద్ధి నీరసిస్తుందనే అంచనాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆసియాలో చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టంతో ముగిశాయి. అత్యధికంగా హాంకాంగ్ సూచీ రెండు శాతం నష్టపోయింది. అలాగే యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం క్షీణించాయి. ఇక అమెరికాకు చెందిన డౌజోన్స్ సూచీ ఈ ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సోమవారం రాత్రి వార్త రాసే సమయానికి 850 పాయింట్లు(రెండున్నర శాతం) నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఎస్అండ్పీ సూచీ కూడా రెండు శాతం, నాస్డాక్ ఇండెక్స్ ఒక శాతం పతనంతో కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు n తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడుశాతానికి పైగా నష్టపోయి రూ.1,471 వద్ద ముగిసింది. నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు), రీస్ట్రక్చరల్ రుణాలు పెరగడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. n రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెజారిటీ వాటాను విక్రయించడంతో జస్ట్ డయల్ కంపెనీ షేరు ఐదుశాతం నష్టంతో రూ.1025 వద్ద స్థిరపడింది. n క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించినా ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.91 వద్ద నిలిచింది. -
సెన్సెక్స్ నష్టం 155 పాయింట్లు
ముంబై: స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టంతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు లాక్డౌన్లను విధిస్తున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం అయిదోరోజూ కొనసాగింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 39 పాయింట్లను కోల్పోయి 14,835 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు ముగింపు పడింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధింపుతో ఆస్తుల నాణ్యత తగ్గవచ్చనే అందోళనలతో ప్రైవేట్ బ్యాంకు షేర్లలో అమ్మకాలు జరిగాయి. కొంతకాలంగా ర్యాలీ చేస్తున్న మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అలాగే ఆటో, రియల్టీ షేర్లలో కూడా విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకి రావడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. ఎఫ్ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ నికర అమ్మకందారులుగా మారారు. ఎఫ్ఐఐలు రూ.645 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.271 కోట్ల షేర్లను విక్రయించారు. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 49,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14,882 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఫార్మా, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించడంతో లాభాల్లోకి మళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49,907 వద్ద, నిఫ్టీ 14,918 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్ తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీల లాభాలన్ని మళ్లీ మాయమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి(49,907) నుంచి 446 పాయింట్లు నష్టపోయి 49,461 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం (14,918) నుంచి 133 పాయింట్లు కోల్పోయి 14,785 స్థాయికి చేరుకుంది. చివర్లో ఎఫ్ఎంసీజీ షేర్లు ఆదుకోవడంతో సెన్సెక్స్ 154 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్‌లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్‌కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్‌తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మార్కెట్‌ను మెప్పించని ప్యాకేజీ
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు వంటి ప్రతికూల పరిస్థితులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 43,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లను కోల్పోయి 12,691 వద్ద నిలిచింది. సూచీలు నష్టాల ముగింపుతో ఎనిమిది రోజుల వరుస, మూడురోజుల రికార్డు ర్యాలీలకు ముగింపు పడినట్లైంది. ఫైజర్ వ్యాక్సిన్ తయారీ పరీక్షలు విజయవంతమైనా.., భారత్‌లో వ్యాక్సిన్ నిలువ, సరఫరా సమస్యలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. మార్కెట్ ఎనిమిదిరోజుల సుదీర్ఘ ర్యాలీతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడం సూచీలపై ఒత్తిడిని పెంచాయి. అయితే కేంద్రం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా ప్రయోజనాలను పొందే ఎఫ్ఎంసీజీ, రియల్టీ, మీడియా, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల గరిష్టాన్ని.., 43,128 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 12,741– 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు క్షీణించి 74.64 వద్ద స్థిరపడింది. ఉద్దీపన ప్యాకేజీలో రియల్టీ రంగానికి ఊతమిచ్చే అంశాలు ఉండడంతో ఈ షేర్లు రాణించాయి. డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల ఆదాయపన్నులో ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐబీరియల్ ఎస్టేట్, ఒబెరాయ్ రియల్టీ గోద్రేజ్ ప్రాపర్టీ షేర్లు 13 శాతం నుంచి 3 శాతం లాభపడ్డాయి. -
మార్కెట్‌పై బేర్ ఎటాక్!
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బాగా క్షీణించడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటం, కరోనా కేసులు పెరుగుతుండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 73.14కు చేరినా మన మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనమై 38,357 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు క్షీణించి 11,334 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్ 1.63 శాతం, నిఫ్టీ 1.68 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 1,110 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలు.. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా ఈ నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 741 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లమేర నష్టపోయాయి. లోహ, విద్యుత్తు, టెలికం, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని విశేషాలు.. ► సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క మారతీ సుజుకీ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ 4 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగాషేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వొడాఫోన్ ఐడియా,అదానీ గ్యాస్, గ్రాన్యూల్స్ ఇండియా, వీఎస్టి టిల్లర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా మన దగ్గర కూడా ఐటీ షేర్లు నష్టపోయాయి. ► త్వరలో వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం ప్రకటించనున్నదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లు వరుసగా నాలుగో రోజూ లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఈ షేర్లతో పాటు మరో 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, మ్యాక్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2.23 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.23 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.154.63 లక్షల కోట్లకు తగ్గింది. అప్రమత్తంగా ఉండండి..: నిపుణులు కరోనా కేసుల జోరు, ప్రపంచ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, మన మార్కెట్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటం.. ఇవన్నీ కీలకమైన రిస్క్ అంశాలని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పతనానికి ప్రధాన కారణాలు అమెరికా స్టాక్ సూచీల పతనం: గత రెండు నెలల్లో భారీగా ఎగసిన టెక్నాలజీ షేర్లలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికా స్టాక్ సూచీలు 3–5 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాంక్ షేర్ల పతనం..: మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు విషయమై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. హెవీ వెయిట్స్‌కు నష్టాలు..: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు..: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. -
సెన్సెక్స్ 414 మైనస్
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక రికవరీపై సంశయాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, సోమవారం మొదలైన లాభాల స్వీకరణ మంగళవారం కూడా కొనసాగడంతో మన మార్కెట్లో నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,100 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మహా మహా మాంద్యం తప్పదని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 414 పాయింట్ల నష్టంతో 33,957 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 10,047 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలకు గత 3 వారాల్లో ఇదే అతిపెద్ద పతనం. 930 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలైనా, అరగంటలోనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ అరగంటలోనే లాభాల్లోకి వచ్చాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలవడంతో మన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఒక్క ఢిల్లీ నగరంలోనే జూలై చివరికల్లా కరోనా కేసులు 5.5 లక్షలకు చేరగలవని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా వ్యాఖ్యానించడంతో ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక దశలో 440 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 490 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 930 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 855 పాయింట్లు పతనమైంది. జపాన్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో మొదలై, నష్టాల్లోనే ముగిశాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 3 శాతం నష్టంతో రూ.349 వద్ద ముగిసింది. ► సెకండరీ మార్కెట్ ద్వారా ప్రమోటర్లు మరిన్ని షేర్లను కొనుగోలు చేయనున్నారన్న వార్తల కారణంగా ఇండసఇండ్ బ్యాంక్ షేర్ 2.7 శాతం లాభంతో రూ. 464వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 60కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ముత్తూట్ ఫైనాన్స్, అదానీ గ్రీన్, సన్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఆరు రోజుల లాభాలకు బ్రేక్
ఆరు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ పతనమైంది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, మన దగ్గర కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ తదితర బ్లూ చిప్ షేర్లు పెరగడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్ కీలకమైన 34,000 పాయింట్లపైన నిలదొక్కుకోలేకపోయినా, నిఫ్టీ మాత్రం 10,000 పాయింట్లపైననే ముగిసింది. రోజంతా 599 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 129 పాయింట్ల పతనమై 33,981 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కార ణంగా సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలన్న పిటీషన్‌పై ఆర్థిక శాఖ వివరణను సుప్రీం కోర్టు కోరింది. దీంతో బ్యాంక్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్, ఆర్థిక రంగ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ► ఏషియన్ పెయింట్స్ షేర్ 5% నష్టంతో రూ.1,633 వద్ద ముగిసింది. ► రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్ షేర్ 2.4% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని(10.68 లక్షల కోట్లు) దాటింది. ► అమెజాన్ సంస్థ 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో భారతీ ఎయిర్టెల్ షేర్ 4% లాభంతో రూ. 573వద్ద ముగిసింది. ► హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 2 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల ఈక్విటీ షేర్లను ఇంగ్లాండ్‌కు చెందిన స్డాండర్డ్ లైఫ్ రూ.1,985 కోట్లకు బహిరంగ మా ర్కెట్ లావాదేవీల్లో విక్రయించింది. బీఎస్ఈలో ఈ షేరు 3.2% లాభంతో రూ.518 వద్ద ముగిసింది. -
మార్కెట్లు మళ్లీ మునక!
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం, లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం...ప్రతికూల ప్రభావమే చూపించాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా, మన మార్కెట్లో మాత్రం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 30,029 వద్ద, నిఫ్టీ 314 పాయిం ట్లు నష్టపోయి 8,823 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. 1,280 పాయింట్ల రేంజ్లో... ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రికవరీ కనిపించినా, చివరి అరగంటలో అమ్మకాలు మరింతగా వెల్లువెత్తాయి. ఒక దశలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 1,130 పాయింట్లకు పడిపోయింది. మొత్తం మీద రోజంతా 1,280 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పాటు పొడిగించడంతో పొజిషన్లు తీసుకునే విషయమై ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆర్థిక, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 10 శాతం నష్టంతో రూ.377 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► బకాయిల చెల్లింపుల్లో విఫలమైనప్పటికీ, రుణగ్రస్తులపై ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్, ఆర్థిక రంగ, ఎన్బీఎఫ్సీ. హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 140కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ లీజర్, షాపర్స్ స్టాప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలెంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్... ఈ రెండు షేర్లు మాత్రమే ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. స్పైస్‌జెట్, ఎన్బీసీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోందన్న వార్తలతో జెన్ టెక్నాలజీస్ షేర్ 10% లాభంతో రూ.37 వద్ద ముగిసింది. ► బొగ్గు మైనింగ్‌లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పటివరకూ ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న కోల్ ఇండియా షేర్ 6 శాతం మేర నష్టంతో రూ. వద్ద ముగిసింది. ► రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడంతో రక్షణ రంగ కంపెనీలు లాభపడ్డాయి. రూ.3.65 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ. 3,65,470 కోట్ల మేర హరించుకుపోయి రూ.119 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే... ప్యాకేజీ.. పైన పటారం.. లోన లొటారం! ఆర్థిక ప్యాకేజీ 2.0... పైన పటారం... లోన లొటారం చందంగా ఉందని నిపుణులంటున్నారు. భారీగా నిధుల వరద పారేలా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలన్నీ తప్పాయని వారంటున్నారు. తక్షణం డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచేలా ఉద్దీపన చర్యలు లేకపోవడంతో సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. పేరుకే ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, వాస్తవంగా ప్రభుత్వానికి ఖర్చయ్యేది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని వారంటున్నారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీని... రూ.20 లక్షల కోట్ల మేర అందిస్తామని ప్రధాని ప్రకటించినా, వాస్తవిక ప్యాకేజీ ప్రకటించిన ప్యాకేజీలో 10 శాతం మేర ఉండటమే గమనించాల్సిన విషయం. లాక్డౌన్ పొడిగింపు... లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించడం ప్రతికూల ప్రభావమే చూపించింది. లాక్‌డౌన్‌ను పొడిగించడం ఇది మూడోసారి. లాక్డౌన్ 4.0లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మరింత జాప్యం కాగలదన్న భయాలతో అమ్మకాలు జోరుగా సాగాయి. కరోనా ఉగ్రరూపం భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 96వేలకు, మరణాలు 3,000కు పైగా పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు పైగా, మరణాలు 3.15 లక్షలకు చేరాయి. రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 75.61కు పడిపోయింది. 60 శాతం తగ్గిన ఎగుమతులు... గత నెలలో ఎగుమతులు 60% పతనమయ్యాయి. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ అభయం ఇచ్చారు. ఈ రెండు అంశాల కారణంగా సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 4–6% లాభాల్లో ముగియ గా, రాత్రి 11.30 సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 2–3% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
‘క్రూడ్’ నష్టాలు
ముడి చమురు ధరలు మొదటిసారిగా నెగెటివ్‌లోకి జారిపోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు నష్టపోయి 76.83కు చేరడం, అమెరికాకు ఇతర దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 1,011 పాయింట్లు పతనమై 30,637 పాయింట్ల వద్ద, నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 8,982 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.2 శాతం, నిఫ్టీ 3 శాతం మేర నష్టపోయాయి. ఫార్మా మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే.... సెన్సెక్స్. నిఫ్టీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్ల పతనంతో మొదలయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ, తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,270 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్ల మేర నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. టెలికం, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, బ్యాంక్, వాహన, లోహ, తదితర రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రూ.3.30 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ నష్టాల కారణంగా రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,30,409 కోట్లు హరించుకుపోయి రూ.120.42 లక్షల కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.... ► మార్కెట్ పతనంలోనూ కొన్ని షేర్లు మెరుపులు మెరిపించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ నాలుగేళ్ల గరిష్టానికి, రూ.4,046కు ఎగసింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.4,015 వద్ద ముగిసింది. ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–భారతీ ఎయిర్టెల్, హీరో మోటొకార్ప్, నెస్లే ఇండియాలు మాత్రమే లాభపడగా, మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 12 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే. ► బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ షేర్లు 6–9 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం నష్టంతో రూ.633 వద్ద ముగిసింది. ► హైదరాబాద్‌లోని ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ వీఏఐ(వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్)సర్టిఫికెట్ ఇవ్వడంతో అరబిందో ఫార్మా 20 శాతం(రూ.104 లాభం) అప్పర్ సర్క్యూట్‌తో రూ.644 వద్ద ముగిసింది. ఇతరషేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. దివీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 30కు పైగా ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ► సింగపూర్‌కు చెందిన ఆయిల్ట్రేడింగ్ కంపెనీ, హిన్ లియోన్ ట్రేడింగ్ పీటీఈ దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. ఈ కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర రుణం ఇవ్వడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 8% నష్టంతో రూ.332 వద్దకు చేరింది. -
ఆరంభ లాభాలు ఆవిరి
ఆరంభ లాభాల జోష్‌ను మన మార్కెట్ చివరి వరకూ కొనసాగించలేకపోయింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక స్థితిగతులు మరింత అధ్వానం కాగలవన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 1.9%కి తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ఠానికి పడిపోవడం, ముడి చమురు ధరలు 4% మేర పతనమవటం, లాక్‌డౌన్‌ను పొడిగించడం.... ప్రతికూల ప్రభావం చూపాయి. రోజంతా 1,346 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 310 పాయింట్ల నష్టంతో 30,380 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 267 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,925 వద్దకు చేరింది. సమృద్ధిగానేవర్షాలు.. తప్పని నష్టాలు...!! సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయని, ఎలాంటి లోటు ఉండదని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతానికి తగ్గింది. ఈ రెండు సానుకూలాంశాలతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో మధ్యాహ్నం తర్వాత మన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఈ ఏడాదే ఆర్థిక పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 468 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,188 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు 1–2 శాతం నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు›కూడా 3–4% నష్టాల్లో ముగిశాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.2 శాతం నష్టంతో రూ.1,173 వద్ద ముగిసింది. ► లాక్డౌన్ నుంచి వ్యవసాయ రంగ కార్యకలాపాలను మినహాయించడంతో సంబంధిత షేర్లు లాభపడ్డాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్ 11%, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 11%, చంబల్ ఫెర్టిలైజర్స్ 8 శాతం ఎగబాకాయి. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 76.44కి డౌన్ ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. అంతర్జాతీయంగా డాలరు బలపడటం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ బుధవారం గణనీయంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.44 వద్ద క్లోజయ్యింది. డాలర్ ఇండెక్స్ పటిష్టంగా ఉండటం .. రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. దీంతో పాటు ఇటు దేశీ, అటు ప్రపంచ ఎకానమీలపై కరోనా ఆందోళన కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా బలహీనంగా ఉన్నట్లు వివరించారు. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజీలో రూపాయి ట్రేడింగ్ గత ముగింపుతో పోలిస్తే పటిష్టంగా 76.07 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.99 గరిష్ట స్థాయితో పాటు 76.48 డాలర్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 76.44 వద్ద ముగిసింది. మే 3 దాకా లాక్డౌన్ కొనసాగించడంతో మరిన్ని సమస్యలు తప్పవనే భయాలు నెలకొనడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు (కమోడిటీ, కరెన్సీ) జతిన్ త్రివేది తెలిపారు. -
భారీ నష్టాలతో బోణి
కొత్త ఆర్థిక సంవత్సరం(2020–21) తొలి రోజు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. కరోనా మహమ్మారి విలయతాండవానికి అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ సూచీల్లో భారత వెయిటేజీకి సంబంధించిన మార్పులను ఎమ్ఎస్సీఐ మే నెలకు వాయిదా వేయడంతో బుధవారం మన మార్కెట్ కూడా భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,203 పాయింట్లు క్షీణించి 28,265 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 344 పాయింట్లు నష్టపోయి 8,254 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నేడు (గురువారం) శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కావడంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు బుధవారమే ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వారం కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు... బహుపరాక్....! సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. పావుగంటకే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,395 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోగా, యూరప్ మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాల్లో ఆరంభమయ్యాయి. ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గాయి. కాగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ షేర్లు బేర్ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా వివిధ కంపెనీల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని, ఫలితంగా బ్యాంక్‌ల మొండిబకాయిలు భారీగా పెరుగుతాయనే భయాందోళనలతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 8–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► టెక్ మహీంద్రా షేర్ 9.2% పడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో 4 షేర్లు–హీరో మోటో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ మాత్రమే లాభపడగా, మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. తొలి రోజే రూ.3.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.20 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.110.28 లక్షల కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు ► కొనసాగుతున్న కరోనా కల్లోలం...: భారత్‌లో కరోనా కేసులు 1,621కు, మరణాలు 42కు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 8.6 లక్షలకు, మరణాలు 42,000కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ► ఎమ్ఎస్సీఐ ‘వెయిటేజీ’ వాయిదా: ఎమ్ఎస్సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్)... తన గ్లోబల్ సూచీల్లో భారత వెయిటేజీ పెంచే నిర్ణయాన్ని మే నెలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ మార్పులు బుధవారం (ఏప్రిల్ 1)నుంచే అమల్లోకి రావాలి. దీనివల్ల భారత్‌లోకి 1,000 కోట్ల డాలర్లు(రూ.76,000 కోట్లు) వచ్చే చాన్స్ ఉంది. ► బలహీనంగా ఆసియా తయారీ డేటా: జపాన్, దక్షణి కొరియా దేశాల తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. ► తగ్గిన వాహన విక్రయాలు...: మార్చి నెలలో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. మారుతీ సుజుకీ మ్మకాలు 47 శాతం, అశోక్ లేలాండ్ విక్రయాలు 90 శాతం, ఐషర్ మోటార్స్ అమ్మకాలు 83 శాతం మేర పడిపోయాయి. వాహన విక్రయాలు ఈ స్థాయిలో క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పెట్టింది. ► ద్రవ్యలోటు లక్ష్యం మిస్... గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు(వ్యయానికి, ఆదాయానికి మధ్య వ్యత్యాసం) పూర్తి బడ్జెట్ అంచనాల్లో 135 శాతానికి (రూ.10,36,485 కోట్లు) చేరింది. ద్రవ్యలోటు లక్ష్యం పెద్ద మార్జిన్‌తో కట్టు తప్పడం.. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. నేడు సెలవు శ్రీరామ నవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
చివర్లో టపటపా..!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాలతో గురువారం కూడా స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది. వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 81 పైసలు పతనమై 75 మార్క్ ఎగువకు పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 501 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 581 పాయింట్ల నష్టంతో 28,288 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రోజంతా 742 పాయింట్ల రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 205 పాయింట్ల నష్టంతో 8,263 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. 2,656 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ప్రపంచ మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో మన మార్కెట్ కూడా భారీ నష్టాలతోనే మొదలయ్యింది. సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 406 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. అరగంటలోనే సెన్సెక్స్ 2,155 పాయింట్లు పతనమై 26,715 పాయింట్ల వద్ద, నిఫ్టీ 636 పాయింట్లు క్షీణించి 7,833 పాయింట్ల వద్ద ఇంట్రా డే కనిష్టాలను తాకాయి. ఆ తర్వాత నుంచి నష్టాలు తగ్గుతూ వచ్చాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు 1,000 పాయింట్ల మేర రికవరీ కావడంతో మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్ లాభాల్లోకి మళ్లాయి. అయితే అది స్వల్పకాలమే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 501 పాయింట్లు, నిఫ్టీ 106 పాయింట్ల మేర లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,656 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి రూ. 4,623 కోట్ల నికర అమ్మకాలను కూడా కలుపుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.47,897 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. పెట్టుబడులన్నింటినీ నగదుగా మార్చుకోవాలనే తపనతో ఇన్వెస్టర్లు పుత్తడితో సహా పలు ఇతర పెట్టుబడి సాధనాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో షేర్లు, బాండ్లు, పుత్తడి, కమోడిటీలు అన్నీ పతనమవుతూ ఉన్నాయి. ప్యాకేజీలున్నా.... పతనమే వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించిన ఉద్దీపన చర్యలు... ప్రపంచ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పి 8 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధికంగా పతనమైన సూచీ ఇదే. యూరప్ కేంద్ర బ్యాంక్ 75,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనా, ఆ త ర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు 1– 2% లాభాల్లో ముగిశాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ► దాదాపు 1,200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 10 శాతం నష్టంతో రూ.2,746 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. యాక్సిస్ బ్యాంక్ 9.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 9 శాతం, టెక్ మహీంద్రా 8 శాతం, ఓఎన్జీసీ 7 శాతం చొప్పున క్షీణించాయి. ► మరోవైపు ఐటీసీ 7 శాతం లాభంతో రూ.162 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు 7.5 శాతం మేర ఎగిశాయి. భారత్ వృద్ధి క్యూ1లో 3.1 శాతమే: బీఓఎఫ్ఏ ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ త్రైమాసికం వృద్ధి అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ 48 గంటల్లో రెండవసారి ఏకంగా 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం 3.1 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదవుతుందని వివరించింది. 2020–21లో వృద్ధి రేటు 4.1%గా ఉంటుందని విశ్లేషించింది. బుధవారంనాడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికను విడుదల చేస్తూ, జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీని 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 4%కి కుదించింది. గురువారం ఈ రేటునూ మరో 90 బేసిస్ పాయింట్లు కుదించడం గమనార్హం. ఇక 2020–21 భారత్ వృద్ధి రేటును 5.1%గా 48 గంటల క్రితం లెక్కకట్టిన ఈ సంస్థ తాజాగా ఈ అంచనాలకూ 100 బేసిస్ పాయింట్లు కోతపెట్టడం (4.1 శాతానికి) గమనార్హం. రిలయన్స్... 4 నెలల్లో 5 లక్షల కోట్లు హాంఫట్ వరుసగా ఐదో రోజూ రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయింది. ఇంట్రాడేలో 8 శాతం పతనమైన ఈ షేర్ చివరకు 5.3 శాతం నష్టంతో రూ.917 వద్ద ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ షేర్ 17 శాతం నష్టపోగా, మార్కెట్ క్యాప్ రూ.1,20,312 కోట్లు తగ్గింది. నాలుగు నెలల క్రితం (గత ఏడాది నవంబర్‌లో)ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం సగం విలువ హరించుకుపోయి రూ.5,81,374 కోట్లకు పడిపోయింది. కాగా ముకేశ్, ఆయన భార్య, పిల్లలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో తమ తమ వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. ప్రమోటర్ గ్రూప్ కంపెనీ నుంచే ఈ వాటాలను కొనుగోలు చేయడంతో రిలయన్స్ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌లో మార్పుచోటు చేసుకోలేదు. మొత్తం మీద ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అం బానీ, ఆయన పిల్లలు–ఆకాశ్, ఇషా, అనంత్‌లకు ఒక్కొక్కరికి 75 లక్షల షేర్లు ఉన్నాయి. -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్‌కు నచ్చలే..!
కొండంత రాగం తీసి, ఏదో... చెత్త పాట పాడాడు అని ఒక సామెత ఉంది. ఈ సామెత శనివారం జరిగిన ప్రత్యేక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు పూర్తిగా వర్తిస్తుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటుందని అంచనాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూ పోయాయి. ఆదాయపు పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) విషయాల్లో ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండగలవని, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)లను రద్దు చేస్తారని....ఇలా ఎన్నో ఆశలు రాజ్యమేలాయి. కరోనా వైరస్ కల్లోలంతో ప్రపంచ మార్కెట్లు కుదేలైనా, మన మార్కెట్ మాత్రం బడ్జెట్‌పై ఆశలతో పెద్దగా పడలేదు. తీరా చూస్తే, ఈ ఆశలన్నింటినీ ఆర్థిక మంత్రి సీతమ్మ వమ్ము చేశారు. బడ్జెట్ అంచనాలను తప్పడంతో మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 1,275 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 11,662 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్ 2.43 శాతం, నిఫ్టీ 2.51 శాతం మేర నష్టపోయాయి. రూ. 3.46 లక్షల కోట్ల సంపద ఆవిరి మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.3.46 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,46,257 కోట్లు హరించుకుపోయి రూ.1,53,04,725 కోట్లకు పడిపోయింది. జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్. నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్ పన్నును తగ్గించిన ఆర్థిక మంత్రి సీతారామన్...అదే బహుమతిని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కూడా ఇవ్వడం ఖాయమేనన్న మార్కెట్ అంచనాలు పూర్తిగా వాస్తవరూపం దాల్చలేదు. శ్లాబుల్ని విభ జించి, రూ.5 లక్షలకుపైబడి పన్ను ఆదాయం కలిగిన వారికి రేట్లు కొంత తగ్గించినప్పటికీ, మరోవైపు వివిధ సెక్షన్ల కింద లభిస్తున్న మినహాయింపుల్ని ఎత్తివేయడంతో మధ్య ఆదాయ వర్గాలకు ఒరిగేదేమీ లేకపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయా మినహాయింపుల ద్వారా భారీ వ్యాపారాన్ని పొందుతున్న ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు నిలువునా పతనంకావడం, వాటి మాతృ సంస్థలైన పెద్ద ఫైనాన్షియల్ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇందుకు నిదర్శనం. డీడీటీపై డబుల్‌గేమ్... అలాగే మరోవైపు డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ) పూర్తిగా ఎత్తివేస్తారన్న గట్టి అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ పన్నును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవానికి పన్ను చెల్లింపు బాధ్యతను కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి మళ్లించారు. ఇప్పటివరకూ 20 శాతం డీడీటీని కంపెనీలు చెల్లిస్తుండగా, ఇకనుంచి ఇన్వెస్టర్లు వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్ని అనుసరించి, డివిడెండ్ల రూపేణా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. అధిక ట్యాక్స్ శ్లాబ్ రేట్లలో వుండే సంపన్నులు, ఆయా కంపెనీల ప్రమోటర్లు 43 శాతం పన్నును ఈ డివిడెండ్ ఆదాయంపై చెల్లించాల్సివుంటుంది. అలాంటప్పుడు ప్రమోటర్లు... ఆయా కంపెనీలు భారీ డివిడెండ్లు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? బైబ్యాకో, మరో పద్ధతో అనుసరిస్తారు. ఈ కారణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన డీడీటీ ఎత్తివేత ప్రతిపాదన కూడా మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఇక అంచనాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)పై పన్ను ఎత్తివేతా జరగలేదు. కేటాయింపుల సంగతేంటి? వ్యవసాయ, మౌలిక రంగాలకు భారీ కేటాయింపులు జరపడం దీర్ఘకాలికంగా మేలు చేకూర్చేదే అయినా, ముఖ్యంగా మౌలిక రంగానికి ప్రతిపాదించిన రూ. లక్ష కోట్ల కేటాయింపులకు సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికలు ఏవీ వెల్లడికాలేదు. ద్రవ్యలోటు ఆందోళనలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గత బడ్జెట్లో నిర్దేశించుకున్న 3.3% ద్రవ్యలోటు మించిపోయిందని, అది 3.8 శాతానికి చేరుతుందని స్వయానా ఆర్థిక మంత్రే తన తాజా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5% ద్రవ్యలోటును ప్రతిపాదించారు. బ్యాంకులు బెంబేలు... ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత కొన్నాళ్లుగా లక్షల కోట్ల మూలధనాన్ని సమకూరుస్తూ, వాటిని ఆదుకుంటున్న కేంద్రం ఈ బడ్జెట్లో తాజా మూలధన కల్పన ప్రకటించకపోగా, క్యాపిటల్ మార్కెట్ నుంచి అవి నిధుల్ని సమీకరించుకోవాలంటూ ఘంటాపథంగా చెప్పడం మార్కెట్‌కు మరో పెద్ద షాక్. -
మార్కెట్ పంచాంగం
కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం విక్రయిస్తున్నారు. ఈ రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగితే...వీటికే సూచీల్లో అధిక వెయిటేజీ వున్నందున, మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం వుంటుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,923 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 37,633 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 1150 పాయింట్ల భారీ నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 37,950 పాయింట్ల తొలి అవరోధాన్ని అధిగమించి, స్థిరపడితేనే డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుంది. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే 38,300–38,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది. ఈ వారం సెన్సెక్స్ తొలి అవరోధంపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,540 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 37,305 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 11,260 గతవారం ప్ర«థమార్థంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,554 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన తర్వాత ... చివరిరోజున 11,158 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 337 పాయింట్ల నష్టంతో 11,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల సమీపంలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితేనే మార్కెట్ క్షీణతకు అడ్డుకట్టపడుతుంది. అటుపైన 11,370–11,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 11,500 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 11,110 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,060 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
మార్కెట్లకు జీడీపీ ‘కోత’!
పరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను భారీగా తగ్గించడం(6.9% నుంచి 6.1 శాతానికి) దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల స్టాక్స్‌లో అమ్మకాలు జరగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 434 పాయింట్లు క్షీణించి 37,674 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించి 11,175 పాయింట్ల దగ్గర ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 770 పాయింట్ల శ్రేణిలో తిరుగాడింది. ఇంట్రాడేలో 37,633 (కనిష్టం), 38,404 పాయింట్ల (గరిష్టం) మధ్య తిరిగింది. సెన్సెక్స్ సుమారు 300 పాయింట్ల పైగా లాభంతో మొదలైనా.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ విధానాన్ని ప్రకటించడంతో... లాభాలన్నీ కోల్పోయింది. ఈ వారంలో సెన్సెక్స్ 1,149 పాయింట్లు (2.96%), నిఫ్టీ 338 పాయింట్లు (2.93%) క్షీణించాయి. ‘రేట్ల కోత, ఉదార ద్రవ్య విధానాల కొనసాగింపు సంకేతాలు వచ్చినప్పటికీ మార్కెట్లు.. ముఖ్యంగా బ్యాంకులు ప్రతికూలంగా స్పందించాయి. తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాలను సత్వరం ఖాతాదారులకు బదలాయించాల్సి రానుండటం వల్ల బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనుండటమే ఇందుకు కారణం. ఇక ఆర్థిక వృద్ధి అంచనాలు కూడా ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. ఎకానమీ వృద్ధికి ఊతమిచ్చేలా ద్రవ్యపరమైన చర్యలు తీసుకోవడానికి ఆర్బీఐకి వెసులుబాటు పరిమితంగానే ఉంది‘ అని షేర్‌ఖాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ దువా తెలిపారు. కీలక షేర్లు 3% పైగా డౌన్.. సెన్సెక్స్‌లోని కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి 3.46 శాతం దాకా క్షీణించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మొదలైనవి 1.03 శాతం దాకా పెరిగాయి. వడ్డీ రేట్ల ప్రభావిత స్టాక్స్ క్షీణత.. వడ్డీ రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండే స్టాక్స్ గణనీయంగా తగ్గాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ స్టాక్స్ 5 శాతం దాకా క్షీణించాయి. ఫెడరల్ బ్యాంక్ 3.82%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.46%, ఐసీఐసీఐ బ్యాŠంక్ 3.17%, ఆర్బీఎల్ బ్యాంక్ 2.82 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.79% తగ్గాయి. దీంతో బీఎస్ఈ బ్యాంకెక్స్ సూచీ 2.45% క్షీణించింది. రియల్టీలో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ 5.28%, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 3.61 శాతం క్షీణించాయి. ఆటో సూచీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 3.14 శాతం, బాష్ 2.88 శాతం పడ్డాయి. -
బ్యాంకింగ్ బేర్!
ఆర్థిక రంగ ప్రతికూల వార్తలకు వాహన అమ్మకాల గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. బ్యాంక్ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడంతో ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ చివర్లో ఒకింత కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో 737 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 362 పాయింట్ల నష్టంతో 38,305 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 11,360 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 684 పాయింట్లు, నిఫ్టీ 211 పాయింట్ల మేర పతనమయ్యాయి. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎమ్‌సీ)బ్యాంక్ సంక్షోభం మరింత ముదరడం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొందని నిపుణులంటున్నారు. లాభాల స్వీకరణకే మొగ్గు... ఆగస్టులో 8 కీలక రంగాల్లో వృద్ది కుంటుపడటం, పన్నును భారీగా తగ్గించినప్పటికీ 3.3% ద్రవ్యలోటుకే ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో ప్రభుత్వ వ్యయం తగ్గుతుందనే అంచనాలు ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. పండగ సీజన్లో కూడా వాహన విక్రయాలు పుంజుకునేలా లేవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బ్యాంక్ షేర్లు ఒడిదుడుకులకు గురవ్వడం, రూపాయి పతనం.. ఈ రెండు అంశాలు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లను పురికొల్పాయని వివరించారు. బ్యాంక్ షేర్లు బేజార్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు.. కుదైలన ఎన్‌బీఎఫ్‌సీలకు, సంక్షోభంలో ఉన్న రియల్టీ రంగానికి బ్యాంక్‌లు భారీగా రుణాలిచ్చాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. మొండి బాకీలు మరింతగా పెరగగలవని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ హెచ్చరించడం మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై బ్యాంకింగ్‌లో చోటు చేసుకుంటున్న ప్రతికూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ 9% నష్టంతో రూ.300 వద్ద ముగిసింది. ఎస్బీఐ బ్యాంక్ 5%, బ్యాంక్ ఆఫ్ బరోడా 4% పడ్డాయి. నష్టాలు ఎందుకంటే.. ఆగస్టులో కీలక రంగాల వృద్ధి 0.5% డౌన్ సెప్టెంబర్‌లో తయారీ రంగం వృద్ధి సూచీ 51.4గా నమోదైంది. ఆగస్టుతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు వాహన విక్రయాలు సెప్టెంబర్‌లోనూ నిరుత్సాహకరంగానే ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 71.09కు చేరింది. -
బేర్ ‘విశ్వ’రూపం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది. ‘మార్కెట్ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సర్‌చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్‌పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే.. ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి. యస్ బ్యాంక్ 8 శాతం డౌన్.. ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో మరో షాక్ తగిలింది. అసెట్ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది. ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా రేటింగ్ సెగ తప్పలేదు. రిలయన్స్ రేటింగ్‌ను న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్ఫ్కి తగ్గించడంతో పాటు టార్గెట్ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్ 5.25 శాతం, పవర్‌గ్రిడ్ 4.42 శాతం, కోటక్ బ్యాంక్ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం పతనం.. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు మరింత పతనమైంది. ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్ఎస్ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 22.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్ఎఫ్ఎల్ వివరణనిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్కు రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది. నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి లార్జ్ క్యాప్, మిడ్.. స్మాల్ క్యాప్ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్ 8 శాతం క్షీణించింది. ఇక కరెన్సీ యుద్ధాలు..! అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్‌కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్ విలువ 7.03 స్థాయికి క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం.. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్‌సెంగ్ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్ స్టాక్స్ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్ ఏకంగా 2.6 శాతం, నాస్డాక్ 3.3 శాతం మేర పడ్డాయి. రూపాయి విలవిల... ఆరేళ్లలో అతిపెద్ద పతనం! డాలర్ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్ 70.73 వద్ద ముగింపు నాలుగు నెలల కనిష్టస్థాయి ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్‌లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది. మూడు ప్రధాన కారణాలు... ► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్ అమ్మకాలు ► అమెరికా డాలర్ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్ మారకంలో చైనా యువాన్ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► కశ్మీర్ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ ట్రేడింగ్ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది. బంగారం భగభగ ► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం ► ఔన్స్‌కు 1,482 డాలర్లకు దూకుడు ► దేశీయంగానూ కొత్త రికార్డులు ► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్ ఏకంగా 7 శాతం పతనమైంది. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్ తోడు... అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది. -
‘సీత’మ్మ నష్టాలు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్బీఎఫ్సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. సెన్సెక్స్ ప్రారంభం: 39,990 సెన్సెక్స్ గరిష్టం : 40,032 సెన్సెక్స్ కనిష్టం : 39,441 సెన్సెక్స్ ముగింపు : 39,513 ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్ ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్క బ్యాంక్ షేర్లు మినహా, మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇది చెత్త బడ్జెట్ కానప్పటికీ, సంపన్నులపై అధిక పన్ను విధింపు, 20 శాతం షేర్ల బైబ్యాక్ ట్యాక్స్, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులంటున్నారు. మరిన్ని వివరాలు... బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారీ సంస్కరణలను ఆశిస్తూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 11,950 పాయింట్లను అధిగమించాయి. బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 40,032 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభమైనప్పటి నుంచి నష్టాలు ఆరంభమయ్యాయి. ప్రసంగం పూర్తయ్యేంత వరకూ పరిమిత శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తర్వాత భారీ నష్టాల దిశగా సాగాయి. మధ్యలో ఒకింత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్395 పాయింట్లు పతనమై 39,513 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11,811 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సానుకూలతలున్నా క్షీణతే.. బడ్జెట్ప్రతిపాదనలకు ముందు 40 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్, బడ్జెట్ తర్వాత ఆ జోరును కొనసాగించలేక చతికిలపడింది. ఆప్షన్ల ట్రేడింగ్‌కు సంబంధించి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) విషయంలో ఒకింత ఊరట లభించడం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధులందడం, మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయించడం వంటి సానుకూల చర్యలున్నప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం నష్టాల నుంచి రికవరీ అయినా కూడా మన మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 3,044 పాయింట్లు, నిఫ్టీ 918 పాయింట్లు చొప్పున లాభపడటం విశేషం. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు చొప్పున పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు షేర్లు– ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్ షేర్ 8.3 శాతం నష్టంతో రూ.88 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరె¯Œ ్స, బజాజ్ ఫైనాన్ ్స, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి పంచ కారణాలు.. పబ్లిక్ హోల్డింగ్ 35 శాతానికి పెంపు... స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన స్టాక్ మార్కెట్‌ను పడగొట్టింది. ఇప్పటికే ఓవర్‌బాట్ పొజిషన్లో ఉన్న మార్కెట్లో ఈ ప్రతిపాదన కారణంగా విక్రయ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే భయాలతో సెన్సెక్స్,నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. 25% పబ్లిక్ హోల్డింగ్ నిబంధననే ఇప్పటిదాకా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అమలు చేయలేకపోయాయి. మరోవైపు ఈ నిబంధన కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి మొగ్గుచూపుతాయని నిపుణులంటున్నారు. మార్కెట్లో ఈ నిబంధన పెను కలకలమే సృష్టించింది. 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ట్యాక్స్(డీడీటీ)ను పలు కంపెనీలు ఎగవేసి షేర్ల బైబ్యాక్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో షేర్ల బైబ్యాక్‌ను నిరుత్సాహపరచడానికి 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్‌ను విధించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వాటాదారులు కొనుగోలు చేసిన ధరను కాకుండా కంపెనీ ప్రకటించే బైబ్యాక్ ధర నుంచి ఇష్యూ ధరను తీసివేసి వచ్చిన దానిపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. దీంతో కంపెనీలపై భారీగా పన్ను భారం పడుతుందని, ఫలితంగా కంపెనీలు షేర్ల బైబ్యాక్‌లు ప్రకటించవని నిపుణులంటున్నారు. . సంపన్నులపై అధిక పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్‌చార్జీని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీంతో ఈ రెండు కేటగిరీల సంపన్నుల పన్ను 3–7 శాతం రేంజ్లో పెరగనున్నది. సంపన్నులపై అధిక పన్ను విధించడం తప్పు కాకపోయినా, మొత్తం వారు చెల్లించాల్సిన పన్ను 42 శాతానికి పెరగడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.90,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదన కారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్, లోహాలపై ఎక్సైజ్ సుంకం మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భారీ నిధుల కోసం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై రూ. 1 అదనపు సుంకం విధించారు. పుత్తడి వంటి విలువైన లోహాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం ప్రతికూల ప్రభావం చూపించాయి. రూ.2.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,580 కోట్లు తగ్గి రూ.151,35,496 కోట్లకు పడిపోయింది. అధికాదాయం ఆర్జించే వర్గాలపై పన్ను విధించడం, భారీగా నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కారణంగా సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గనుండటం, ఇక కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, తదితర ప్రతిపాదనల వల్ల స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది... – అమర్ అంబానీ, యస్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ -
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్
ముంబై : స్టాక్ మార్కెట్ల వరస లాభాలకు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మౌలిక, ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 140 పాయిట్ల నష్టంతో 40,132 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 12,050 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
పాలసీని స్వాగతించని మార్కెట్!
అంచనాలకు తగ్గట్లుగానే ఆర్బీఐ రేట్ల కోత ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 38,700 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సేవల రంగం గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. ప్రధాన స్టాక్ సూచీలు ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు పతనమై 38,685 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. అంచనాలకు తగ్గట్లే రేట్ల కోత అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. అంతంతమాత్రం వృద్ధితో మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గింది. దీంతో రెపో రేటు ఏడాది కనిష్ట స్థాయి 6 శాతానికి చేరింది. ఈ రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభిస్తాయి. నెలవారీ వాయిదాలు చౌక అవుతాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ముడి చమురు ధరలు పుంజుకుంటుండటంవల్ల తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని వివరించింది. కొత్త వర్క్ ఆర్డర్లు మందగమనంగా ఉండటంతో మార్చిలో భారత సేవల రంగం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.5 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ మార్చిలో 52కు పడిపోయింది. మూడు రోజులుగా లాభపడుతున్న రూపాయి గురువారం భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21ను తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా సూచీలు లాభపడ్డాయి. కొనసాగిన లాభాల స్వీకరణ... ప్రధాన స్టాక్ సూచీలు బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడే వరకూ పరిమిత శ్రేణి లాభ, నష్టాల్లోనే సూచీలు ట్రేడయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత అమ్మకాల జోరు పెరిగి నష్టాలు కూడా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 62 పాయింట్లు లాభపడగా, మరో దశలో 296 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 358 పాయింట్ల రేంజ్లో కదిలింది. మిశ్రమంగా ‘వడ్డీ’ ప్రభావిత షేర్లు... వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు 3–1 శాతం రేంజ్లో లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు చెరో అరశాతం మేర నష్టపోయాయి. బ్యాంక్ షేర్లలో సిటీ యూనియన్ బ్యాంక్ 2.2 శాతం, ఎస్బీఐ 0.3 శాతం మేర లాభపడగా, యస్ బ్యాంక్ 2 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.8 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ► టీసీఎస్ సెన్సెక్స్‌లో భారీగా 3.1 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ► రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.46 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,04,506 కోట్లకు పడిపోయింది. ► షేర్ల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నదన్న వార్తలతో యస్ బ్యాంక్ షేర్ 2 శాతం క్షీణించి రూ.268 వద్ద ముగిసింది. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
బ్యాంక్ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్బ్రెంట్ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి. 198 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లకు నష్టాలు లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ∙వాటెక్ వాబాగ్ షేర్ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్ బ్యాంక్ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. -
ఇది సెన్సెక్స్ అవిశ్వాస తీర్మానం: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సెన్సెక్స్ 840 పాయింట్లు కోల్పోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘పార్లమెంటరీ పరిభాషలో చెప్పాలంటే మోదీ బడ్జెట్‌పై సెన్సెక్స్ 800 పాయింట్ల బలమైన అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం గడువు ఇంకో ఏడాది ఉండటాన్ని గుర్తుచేస్తూ.. ‘మరో ఏడాదే మిగిలింది’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. బడ్జెట్ దెబ్బకు బీఎస్ఈ సెన్సెక్స్ రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా 840 పాయింట్లు, ఎన్ఎస్సీ 256 పాయింట్లను కోల్పోయింది. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ లాభాల్లో ఉన్నప్పటికీ ఆరంభం నుంచీ అప్రమత్తంగా మదుపర్లు మిడ్ సషన్ తరువాత అమ్మకాలపై మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ ఒకదశలో 200 పాయింట్లకు పైగాకోల్పోయింది. చివరికి 184పాయింట్లు క్షీణించి 28, 155 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 8725వద్ద ముగిసింది. ఆటో, రియల్ ఎస్టేట్, ఫార్మ, సెక్టార్ లో భారీ అమ్మకాల ధోరణి సాగింది. ప్రధానంగా దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ ఫలితాల నేపథ్యంలో భారీగా నష్టపోయింది. దాదాపు10శాతానికిపైగా క్షీణించింది. గత మూడునెలల కాలంలో బిగ్గెస్ట్ ఫాల్ నమోదు చేయడంతో నిఫ్టీ రెండువారాల కనిష్టాన్ని నమోదు చేసింది. మిడ్ క్యాప్, బ్యాంక్‌నిఫ్టీ అండర్ పెర్ఫాం చేసింది. సన్ ఫార్మా, డీఎల్ఎఫ్, స్పైస్ జెట్ కూడా బాగా నష్టపోయాయి. -
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్
-
భగ్గుమన్న పసిడి
ముంబై: విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే 'బ్రెగ్జిట్' ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమవుతున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న వార్తలతో దాదాపు గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా ... బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై: 'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. తర్వాత 10.5 గంటల సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 1000-900 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. 'బ్రెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది. దీంతో 10 నిమిషాల పాటు జపాన్ స్టాక్ మార్కెట్ ను నిలిపివేశారు. -
సెన్సెక్స్ 249 పాయింట్లు డౌన్
బిహార్ ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ 26,304 వద్ద ముగిసిన సెన్సెక్స్ 8,000 కిందకు పతనమైన నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 7,955 వద్ద ముగింపు ముంబై: బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఉత్కంఠ, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ నెల రోజుల కనిష్ట స్థాయికి, నిఫ్టీ 8,000 దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 26,304 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 7,955 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక సేవల, ఫార్మా, టెక్నాలజీ, లోహ షేర్లు క్షీణించాయి. డిసెంబర్లోనే రేట్ల పెంపు ! ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉందని, ఈ డిసెంబర్లోనే వడ్డీరేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ బుధవారం వ్యాఖ్యానించడం. రేట్లు పెంచితే విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో మళ్లీ రాజుకోవడం, ఈ నేపథ్యంలో రూపాయి 26 పైసలు నష్టపోవడం...మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే బిహార్ -
నిన్న లాభాలు, నేడు కష్టాలు
-
మరోసారి వడ్డీ రేటు పెంపు..?