మూడు దశల పోలింగ్‌లో తగ్గిన ఓటింగ్ శాతం
అధికార పార్టీ విజయావకాశాలపై సందేహాలు
సెన్సెక్స్ 1,062 పాయింట్లు క్రాష్ ∙22,000 స్థాయి దిగువకు నిఫ్టీ
ఇన్వెస్టర్లకు రూ.7.34 లక్షల కోట్ల నష్టం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్‌ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
ఆద్యంతం అమ్మకాలే
ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి.
→ సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి.
→ మార్చి క్వార్టర్‌లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
→ క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment