అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలు
74 వేల స్థాయి దిగువకు సెన్సెక్స్
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్‌టెల్(–2%), ఎల్‌అండ్‌టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది.
∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్‌ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment