రికార్డు స్థాయి నుంచి సెన్సెక్స్ వెనక్కి
వారాంతాన లాభాల స్వీకరణ
రిలయన్స్, ఎస్‌బీఐ దన్నుతో రికవరీ
మిశ్రమంగా ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: వారాంతాపు రోజున ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు కోల్పోయి 80వేల దిగువన 79,997 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 24,363 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 24,314 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో విక్రయాల ప్రభావంతో భారీగా పతనమైన సూచీలను రిలయన్స్ (2%) ఎస్‌బీఐ (2.50%) రాణించడంతో సూచీలు రికవరీ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయ ల్, విద్యుత్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్ గణాంకాలు, బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
→ జియో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 2% పెరిగి రూ.3180 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 3% ఎగసి రూ.3198 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పెరిగి రూ.21.51 లక్షల కోట్ల చేరింది.
రూ.450 లక్షల కోట్లు
సూచీలు ఫ్లాట్‌గా ముగిసినా, ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 2.58 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ.450 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment