Nifty Gain
-
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: వారాంతాపు రోజున ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు కోల్పోయి 80వేల దిగువన 79,997 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 24,363 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 24,314 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో విక్రయాల ప్రభావంతో భారీగా పతనమైన సూచీలను రిలయన్స్ (2%) ఎస్బీఐ (2.50%) రాణించడంతో సూచీలు రికవరీ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయ ల్, విద్యుత్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్ గణాంకాలు, బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. → జియో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2% పెరిగి రూ.3180 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 3% ఎగసి రూ.3198 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పెరిగి రూ.21.51 లక్షల కోట్ల చేరింది.రూ.450 లక్షల కోట్లు సూచీలు ఫ్లాట్‌గా ముగిసినా, ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 2.58 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ.450 లక్షల కోట్లకు చేరింది. -
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
స్టాక్స్ బుల్ సవారీ
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. . మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. బ్లూచిప్స్ దన్ను ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి. ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. మే 20న మార్కెట్లకు సెలవు ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ప్లస్!
ముంబై: స్టాక్ మార్కెట్ దూకుడుకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే చివరకు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 54,526 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రెండు పాయింట్లు స్వల్ప లాభంతో 16,282 వద్ద నిలిచింది. మార్కెట్ ప్రథమార్థంలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, ఫార్మా షేర్లలో భారీ పతనాన్ని చవిచూశాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 592 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 306 పాయింట్లు శ్రేణిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.238 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.206 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో రికవరీ... అకారణంగా ర్యాలీ చేసే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లపై అదనపు నిఘా చర్యలను తీసుకుంటామని బీఎస్ఈ ఎక్సే్చంజీ ఆగస్ట్ 9న ఒక సర్క్యులేషన్ జారీ చేసింది. ఎక్సే్చంజీ తీసుకున్న కొత్త నిర్ణయంతో గత రెండురోజులుగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఈ నిఘా చర్యలు రూ.1000 కోట్ల మార్కెట్ విలువ (లేదా) షేరు ధర రూ.20లోపు ఉన్న కంపెనీలకే పరిమితమని బీఎస్ఈ ఎక్సే్చంజీ బుధవారం వివరణ ఇచ్చింది. ఎక్సే్చంజీ తాజా నిర్ణయంతో స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు చాలా వరకు రికవరీ అయ్యాయి. ఉదయం సెషన్లో రెండున్నర శాతం క్షీణించిన బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు చివరికి ఒకశాతం నష్టంతో సరిపెట్టుకున్నాయి. పతనాన్ని అడ్డుకున్న మెటల్ షేర్లు మెటల్ షేర్లు రాణించి ర్యాలీ సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. అమెరికా సెనెట్ ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల బిల్లుకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఇతర దేశాలకు కమోడిటీలను ఎగుమతి చేసే కంపెనీలకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ ఈ మధ్యనే చైనా నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు భారత కమోడిటీ కంపెనీలకు కలిసొస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు మెటల్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో మెటల్ షేర్లు ర్యాలీతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా మూడుశాతానికి పైగా లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► జూన్ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినా జొమాటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 11% ర్యాలీ చేశాయి. చివరికి 9% లాభంతో రూ.136 వద్ద ముగిశాయి. ► మెటల్ షేర్ల ర్యాలీలో వేదాంత 6.5% లాభంతో రూ.324 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలతో కిమ్స్ హాస్పిటల్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ. 1275 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాల్లోముగిసిన మార్కెట్లు
ముంబై: ఆసియా మార్కెట్ల పాజిటివ్ సంకేతాలు, మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల ధోరణితో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగాశాయి. ప్రారంభంనుంచీ ఊగిసలాటల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరికి వరుసగా నాలుగోరోజూకూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 28, 634దగ్గర, 29 పాయింట్లలాభంతో నిఫ్టీ 8,808 వద్ద క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో కొనుగోళ్ల జోరు కొనసాగింది. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్తాయి 8,800కి పైన స్థిరంగా ముగిసింది. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రియల్టీ,ఫార్మా షేర్లకొనుగోళ్ల వైపు ఆసక్తి నెలకొంది. ఇండస్ ఇండ్, అరబిందో ఫార్మా, ఐసీఐసీఐ, టీసీఎస్, హెరిటేజ్ ఫుడ్స్ లాభపడగా, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, భారతి ఎయిర్ టెల్, హీరో మోటార్ కార్పొ, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 0.03 పైసల లాభంతో66.95 ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా.90 రూపాయల లాభంతో 30,903 వద్ద ఉంది. -
స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభం
ముంబై: ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు లాభంతో 28,668 వద్ద శుక్రవారం అమెరికా, నిఫ్టీ 31పాయింట్లలాభంతో 8810 దగ్గర ట్రేడవుతున్నాయి. ఐటీ స్వల్ప నష్టాలలో ఉండగా,మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.ఇన్ఫోసిస్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో నష్టపోతున్నాయి. నిఫ్టీ 88 వేలకు పైన ట్రేడవుతున్నప్పటకీ, లాభనష్టాలమధ్య దేశీయ సూచీలు ఊగిసలాడుతున్నాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసల లాభంతో 66.88 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 105 రూపాయల లాభంతో 30,918వద్ద ఉంది.