ముంబై: ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు లాభంతో 28,668 వద్ద శుక్రవారం అమెరికా, నిఫ్టీ 31పాయింట్లలాభంతో 8810 దగ్గర ట్రేడవుతున్నాయి. ఐటీ స్వల్ప నష్టాలలో ఉండగా,మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.ఇన్ఫోసిస్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో నష్టపోతున్నాయి. నిఫ్టీ 88 వేలకు పైన ట్రేడవుతున్నప్పటకీ, లాభనష్టాలమధ్య దేశీయ సూచీలు ఊగిసలాడుతున్నాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసల లాభంతో 66.88 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 105 రూపాయల లాభంతో 30,918వద్ద ఉంది.