
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో భారీ కొనుగోళ్లతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 855.30 పాయింట్లు లేదా 1.09 శాతం పెరిగి 79,408.50 వద్ద స్థిరపడింది.
ఇక నిఫ్టీ కూడా 273.90 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 24,125.55 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 4.91 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి.
మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 2.50 శాతం, 2.21 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 7.5 శాతం లేదా 5,562 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 7.7 శాతం లేదా 1,726 పాయింట్లు పెరిగింది.