బిహార్ ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ
26,304 వద్ద ముగిసిన సెన్సెక్స్
8,000 కిందకు పతనమైన నిఫ్టీ
85 పాయింట్ల నష్టంతో 7,955 వద్ద ముగింపు
ముంబై: బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఉత్కంఠ, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ నెల రోజుల కనిష్ట స్థాయికి, నిఫ్టీ 8,000 దిగువకు పడిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 26,304 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 7,955 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక సేవల, ఫార్మా, టెక్నాలజీ, లోహ షేర్లు క్షీణించాయి.
డిసెంబర్‌లోనే రేట్ల పెంపు !
ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉందని, ఈ డిసెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ బుధవారం వ్యాఖ్యానించడం. రేట్లు పెంచితే విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో మళ్లీ రాజుకోవడం, ఈ నేపథ్యంలో రూపాయి 26 పైసలు నష్టపోవడం...మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే బిహార్
సెన్సెక్స్ 249 పాయింట్లు డౌన్
Published Fri, Nov 6 2015 12:59 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement