
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సెన్సెక్స్ 840 పాయింట్లు కోల్పోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘పార్లమెంటరీ పరిభాషలో చెప్పాలంటే మోదీ బడ్జెట్‌పై సెన్సెక్స్ 800 పాయింట్ల బలమైన అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం గడువు ఇంకో ఏడాది ఉండటాన్ని గుర్తుచేస్తూ.. ‘మరో ఏడాదే మిగిలింది’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. బడ్జెట్ దెబ్బకు బీఎస్‌ఈ సెన్సెక్స్ రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా 840 పాయింట్లు, ఎన్‌ఎస్‌సీ 256 పాయింట్లను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment