
నేడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌పై చర్చ
డీలిమిటేషన్‌పై తీర్మానం కూడా..
మున్సిపల్, పంచాయతీరాజ్ బిల్లులకు సవరణల ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎనిమిదోరోజు సోమవారం 2025–26 వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. పురపాలక, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. ఈ పద్దులపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.
మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రెండు బిల్లుల్లో సవరణలను ప్రతిపాదించనుంది. దీంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలుస్తోంది. మరో 25 ఏళ్ల వరకు పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని, దీనిపై చర్చ అనంతరం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment