భగ్గుమన్న పసిడి
ముంబై: విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే 'బ్రెగ్జిట్' ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమవుతున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న వార్తలతో దాదాపు గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన ట్రేడ్ అవుతుంది.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా ... బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది.