సూచీలకు ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, మారుతీ షేర్ల దన్ను
ముంబై: ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి.
ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్‌ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి.
ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ...
కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి.
జీవితకాల కనిష్టానికి రూపాయి
రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment