![Stock market crash Feb 11 Business News Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/India_Stock_Market.jpg.webp?itok=LZ_t99dN)
ముంబై: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. 1,000పైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. మార్కెట్లు భారీగా క్షీణించడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్టీల్ టారిఫ్ ఆందోళనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి.
పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్: పది సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ఇండియా, అమెరికా గవర్నమెంట్ బాండ్లపై రాబడులు పెరిగాయి. ఈక్విటీల కంటే బాండ్లు సురక్షితం కాబట్టి, మదుపర్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతో మార్కెట్‌లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.
![Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్](https://www.sakshi.com/s3fs-public/inline-images/st_7.jpg)
ఇదీ చదవండి: రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’
రంగాలవారీ ప్రభావం: లోహాలు, రియల్టీ, మీడియా, హెల్త్ కేర్ సహా వివిధ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. ఇది మొత్తం మార్కెట్ తిరోగమనానికి దోహదం చేసింది.
అంతర్జాతీయ ఆర్థిక అంశాలు: అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment